Header Ads Widget

మన కొనుగోలు - మన దేశానికే చెందాలి !

 మన కొనుగోలు - మన దేశానికే చెందాలి ! 

- జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు డా|| చంద్రప్ప 



MR News Telugu 

Managing Director - Munirathnam

 

- ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు 

- ఓ యువత మేలుకో 

- అమెరికా లాంటి దేశంలో ఎలా చేసిందో చూశాం కదా!


రాష్ట్ర ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా, సాంప్రదాయబద్దంగా, జాగ్రత్తలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని తిరుపతి జిల్లా మాజీ బిజెపి అధ్యక్షులు డాక్టర్.చంద్రప్ప పండుగ సందర్బంగా కోరుతూ, ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దీపావళి పండుగ విశిష్టత గురించి మరొకసారి గుర్తు చేస్తూ చెడు మీద, మంచి గెలవడానికి గుర్తుగా ఈ పండుగ చేసుకుంటున్నామన్నారు, అదేవిధంగా నరేంద్ర మోది కూడ మన దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలపాలని అహర్నిశలో పనిచేస్తున్నారని, ఈ దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు సూచించిన సూచనలలో భాగంగా "స్వదేశీ ఉద్యమం" అనే మూమెంట్ ద్వారా ప్రతి ఒక్క భారతీయుడు స్వదేశంలో తయారు చేసే వస్తువులనే వాడుకోవాలని, దానిద్వారా సంపద సృష్టి కూడా మన దేశ ప్రజలకే దక్కుతుందని, దానితో ఆ కుటుంబం ఆర్ధికంగా పుంజుకోవడమే కాకుండా, భారతదేశం కూడా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచం దేశాలకి దీటుగా, బలంగా తయారవుతుందని, కనుక ఈ దీపావళి నుండే మనమందరం ఒక మాటపై కలసికట్టుగా ఉంటూ, మనవాళ్లు తయారుచేసిన టపాకాయలను, దీపాలను, ఒత్తులను, నూనెను, అదేవిధంగా వస్త్రాలను అలాగే పిండి వంటలు చేసేటప్పుడు ఉపయోగించే వస్తువులు గానీ మరియు మన అదనంగా వాడే అలంకార వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట దేశాల నుండి దిగుమతి అయిన వాటిని కొనడం చేయకుండా, స్వదేశంలో తయారైన వాటికి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ముఖ్యంగా యువత గుర్తించు కోవాల్సిన అంశం ఏమిటంటే విదేశీ వస్తువులను మనం కొనుగోలు చేసి, ఆ లాభాలతో వారి దేశాన్ని మనం బలంగా చేయడం వలన, మన దేశం పైనే కొన్ని దేశాలు కాలుదువ్వుతున్నారని గుర్తు చేశారు. అదేవిదంగా అమెరికా లాంటి దేశాల్లో భారతదేశ నుంచి మనం తయారుచేసి ఎగుమతి చేసే వస్తువులపై, భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలని కుశలబుద్దితో కొనుగోలుదారుడు కొనుగోలు చేయాలేనంత భారంగా టాక్స్ పెంచేసి, భారతీయుల్ని ఇబ్బంది పెడుతున్నారని... ఇలాంటివన్నీ కూడా తప్పకుండా మనమందరం గమనించాలని, అందుకోసమే మన ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ ఉద్యమం అనే మూమెంట్ ని ప్రారంభించారని, అందులో భాగంగా మనమందరం ఈ దీపావళి నుండే స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం, తద్వారా మన దేశ ప్రజలకే ఆ లాభాలన్నీ చెందేటట్టు చేసి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ముందస్తులో ఉండేటట్టు చేయాలని కొనియాడారు. నా కొనుగోలు - నా దేశానికి అనే భావనతో ప్రజలందరూ ముక్తకంఠంతో ఉండాలని కోరుకున్నారు.

Post a Comment

0 Comments