శ్రీకాళహస్తిలోని పోలీసులు - హెచ్చరికలు జారీ
MR NEWS TELUGU
మద్దిమడుగు మునిరత్నం
శ్రీకాళహస్తిలో ప్రతి ఏడాది విశేష భక్తి, శ్రద్ధలతో జరుపుకొనే రాష్ట్ర పండుగ అయిన ఏడు గంగమ్మల జాతర నేపథ్యంలో పట్టణంలో భద్రతా ఏర్పాట్లపై శ్రీకాళహస్తి ఒన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డి.ఎస్.పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జాతర సందర్భంగా చేపట్టనున్న పలు చర్యలను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ జాతర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు సాగేందుకు పోలీసు విభాగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. మొత్తం 270 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొని పర్యవేక్షణ చేపట్టనున్నారని వెల్లడించారు.
జాతరలో మహిళలతో అస్లీల నృత్యాలకు తావులేదని మరియు యువత ప్రవర్తనపై ప్రత్యేకంగా హెచ్చరిస్తూ, జాతర సమయంలో మద్యం సేవించి రోడ్లపై అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని, దీనిలో ఎలాంటి సందేహం ఉండబోదని స్పష్టం చేశారు. అలాగే ట్రాఫిక్ నియమాలకు ప్రజలు సహకరించాలని, పోలీసుల సూచనలను గౌరవించాలని సూచించారు. అందరూ పోలీసులు, అధికారులు చేపట్టే చర్యలకు అండగా నిలిస్తే, ఏడు గంగమ్మల జాతరను మరింత భక్తి భావంతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించవచ్చని డి.ఎస్.పి నరసింహమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రకాష్ కుమార్ మరియు 1 టౌన్ ఎస్.ఐ రవి, నూతనంగా ఛార్జి తీసుకున్న టూటౌన్ స్టేషన్, తొట్టంబెడు స్టేషన్ మరియు శ్రీకాళహస్తి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.



0 Comments