New Aarogyasri card Download ap
Arogya Sri Card - ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎటువంటి ప్రమాదకరమైన జబ్బులకు సంబంధించి అయినా కార్పొరేట్ హాస్పిటల్ నందు మెరుగైన వైద్యం పొందుటకు ఆరోగ్య శ్రీ పరిధిని 25 లక్షలకు పెంచడం జరిగింది.కావున ప్రతి ఒక్కరు కూడా Online లో ఉచితంగా మీ ఆరోగ్యశ్రీ కార్డ్ ని పొందే అవకాశం ఉంది,కనుక తప్పకుండా ఈ website ని ఉపయోగించుకోగలరు.ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ ని ఎప్పుడూ మన దగ్గరే ఉంచుకొము కనుక అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా ఈ కార్డ్ ఉపయోగపడుతుంది.
ఇప్పుడు చాలా సులభంగా మన ఫోన్ లోనే ఒక్క నిమిషంలో కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్యశ్రీ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే వెబ్సైటు లింక్ ని పేజీ చివరన ఇవ్వడం జరిగింది.కనుక గమనించగలరు.
Step 1 - ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసున్నాక ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ login మీద క్లిక్ చేసి Citizen Login ని ఓపెన్ చేసుకోవాలి.
Step 2 - ముందుగా ఈ వెబ్సైట్ ని ఉపయోగించుకోవాలి అనుకుంటే మనకంటూ ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అక్కడ ఉన్న ఆప్షన్ Create One పై క్లిక్ చేసుకుని ఈ అకౌంట్ కి ఒక పేరు,ఈ మెయిల్ ID,ఆధార్ నెంబర్,మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Step 3- అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక తరువాత సాధారణంగా Login అవ్వాల్సివుంటుంది.లాగిన్ అయ్యేటప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది,దానిని ఎంటర్ చేయాల్సివస్తుంది.
Step 4 - లాగిన్ అయ్యాక Services అనే ఆప్షన్ నందు Health And Family Welfare Department Atogyasree అనే ఆప్షన్ ఉంటుంది.
దానిలో Generate Arogya Sri Card అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి.
Step 5 - ఆరోగ్య శ్రీ కార్డ్ ని 3 రకాల వివరాలతో Download చేసుకోవచ్చు.
1) UHID అంటే
ఆరోగ్య శ్రీ కార్డ్ యొక్క నెంబర్
2) Application Number అంటే
సచివాలయంలో క్రొత్త ఆరోగ్య శ్రీ కార్డ్ కి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇచ్చే నెంబర్ Application Number అంటారు.
3) Registered Aadhar Number అంటే
ఆరోగ్య శ్రీ కార్డ్ నందు ఇదివరకే సభ్యులుగా వున్న వారి యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వవలెను.
పై విధంగా ఏదైనా ఒక వివరాలు ఇచ్చి Download Digital Card పై క్లిక్ చేసుకుంటే 1 నిమిషాల్లోనే Arogya Sri Card డౌన్లోడ్ అయిపోతుంది.
దానిని ఇక్కడ చూపించిన విధంగా పైన కుడివైపున Print అనే ఆప్షన్ నందు Click చేసుకుని PDF లో ఈ కార్డ్ ని ఉపయోగించుకోవచ్చును.
Download Website Link - Click Here
Conclusion
ఈ పేజీలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ లోనే సులభంగా Download చేసుకోవచ్చును.కావున దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నచో మనకు సంబంధించిన Whatspp Group Link ఇస్తున్నాను.ఇందులో జాయిన్ అయ్యి నాకు కామెంట్ చేయగలరు.
Join Whatsapp Group Link
Related Links
New Arogya Sri Benefits - Click Here
APPSC Group 2 Notification - Click Here
0 Comments