అమ్మఒడి కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్
- ఈ సంవత్సరం అమ్మఒడి సొమ్ము ఎంత వేయనున్నారు.?
- అమ్మఒడి డబ్బులు ఎప్పుడు పడనున్నాయి..?
- ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఎలా తెలుసుకోవాలి..?
అమ్మఒడి : ఆంధ్రప్రదేశ్ నందు అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది.ఇప్పటికే చాలా మంది కూడా ఈ సంవత్సరం కి సంబంధించి అమ్మఒడి సొమ్ము ఎప్పుడు జమ అవుతోంది అని ఎదురుచూస్తున్నారు.
ఇది వరకే ప్రభుత్వం ఈ జూన్ నెలలో ప్రాథమిక అర్హుల లిస్ట్, అనర్హుల లిస్ట్ అయితే వెలువరించడం జరిగింది. అందులో యధావిధిగా అన్ని పథకాలకు అవకాసం ఇచ్చినట్టే ఈ అమ్మఒడికి కూడా ఈ అనర్హత లిస్ట్ లో ఏమైనా పొరపాట్లు ఉంటే NBM వెబ్సైట్ ద్వారా సచివాలయంలో గ్రీవిన్స్ పెట్టుకోమన్నారు.కాబట్టి ప్రజలు కూడా ఈ అవకసాన్ని ఉపయోగించుకున్నారు.
ఈ సంవత్సరం అమ్మఒడి సొమ్ము ఎంత వేయనున్నారు.?
ప్రభుత్వం ఈ అమ్మఒడి పథకం ప్రకటన చేసిన తరవాత మొదటగా చెప్పినది తల్లుల ఖాతాలో 15 వేల రూపాయలు వేయనున్నట్లు చెప్పి అదే విధంగా వేయడం జరిగింది. తరువాత మరుసటి సంవత్సరం పిల్లల యొక్క యోగక్షేమం ఆలోచించి స్కూల్ నందు టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు నిమిత్తం ఈ అమ్మఒడి సొమ్ములో 1000 తగ్గించి, బ్యాంక్ ఖాతాలో 14 వేల రూపాయలు అయితే వేయడం జరిగింది.ఇప్పుడు అదే విధంగా పాఠశాల నిర్వహణ ఖర్చు క్రింద మరో రూ.1000/-లు తగ్గించి ఈ సారి రూ 13 వేలు మాత్రమే తల్లుల ఖాతాలో వేయనున్నట్లు ఈ మధ్య ప్రభుత్వం నుండి ఉత్తర్వులు కూడా రావడం జరిగింది.
అమ్మఒడి డబ్బులు ఎప్పుడు పడనున్నాయి..?
ఈ సంవత్సరం కి సంబంధించి మొదట చెప్పినట్టు జూన్ 21 న వేయడం జరుగుతుంది అన్నారు.దాని తర్వాత ఆ తేదీని జూన్ 23 కి మార్చడం జరిగింది. ఆ తేదీ కాస్త ఇంకా ముందుకు వెళ్లి శ్రీకాకుళం జిల్లాలో june 27 వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించి,ఆ తల్లుల ఖాతాలో డబ్బులు వేయనున్నట్లు ప్రకటించారు.
ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఎలా తెలుసుకోవాలి..?
ఈ అమ్మఒడికి సంబంధించి సచివాలయల్లో ప్రాథమిక అర్హుల లిస్ట్ మాత్రమే వచ్చింది.తదుపరి ఫైనల్ లిస్ట్ ఈ రోజుకి అంటే జూన్ 22 నాటికి ఇంకా ప్రచురణ కాలేదు. కాబట్టి ప్రభుత్వం జూన్ 27 న డబ్బులు వేయనున్నారు కాబట్టి ఒకటి రెండ్రోజుల్లో రావచ్చు అని అంచనా వేయవచ్చును.
Join Watspp Group
![]() |
WATSAPP GROUP |
0 Comments