మనకు ఆధార్ కార్డ్ - భూమికి భూదార్ కార్డ్
భూదార్ : దేశవ్యాప్తంగా ప్రతి మనిషికి 12 అంకెలతో ఆధార్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో భూదార్ ని ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ భూదార్ రాష్ట్ర వ్యాప్తంగా....
2.84 కోట్ల వ్యవసాయ భూములకు భూదార్ నెంబర్ కేటాయించడం జరిగింది.
0.50 కోట్ల పట్టణ భూములకు భూదార్ నెంబర్ కేటాయించడం జరిగింది
0.85 కోట్ల గ్రామీణ ఆస్తులకు భూదార్ నెంబర్ కేటాయించడం జరిగింది
ఈ పేజీ నందు మనం భూదార్ కార్డు గురించి ఈ క్రింది అంశాలు తెలుసుకుందాం
1. భూదార్ కార్డ్ నెంబర్ మరియు వివరాలు కనుక్కునే పద్దతి
2. భూదార్ కార్డ్ యొక్క ఉపయోగాలు
3.భూదార్ కార్డ్ లో ఉన్న రకాలు
మరిన్ని ప్రభుత్వ పరమైన అప్డేట్స్ కావాలంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందగలరు.
![]() |
WATSAPP |
భూదార్ కార్డ్ ఎన్ని రకాలు
ఒక వ్యక్తికి సంబంధించి ఎంత భూమి అయితే వుందో, అన్నింటిని కలిపి,డిజిటలైజ్డ్ చేసి ఒక 11 అంకెలతో కార్డు ని రూపొందించారు.దీనినే భూదార్ అని అంటారు.ఈ ఒక్క కార్డ్ ఉంటే 25 రకాల సేవలు పొందవచ్చును.
భూదార్ యొక్క ఉపయోగాలు
1.ఈ భూదార్ ని రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, అటవీశాఖ లతో అనుసంధానం చేయడం జరిగింది.
2. భూ సమస్యల పరిష్కారానికి సులభతరం
3. భూమి యొక్క ప్రస్తుత స్థితి నిర్దారణ చేసుకునుటకు ఉపయోగపడును.
4. భూదార్ నెంబర్ ఉన్న భూములకు పాస్ బుక్, ఆడంగల్, పహాని వంటివి అవసరం లేకుండా ఈ భూదార్ సంఖ్య పనిచేస్తుంది.
5.ల్యాండ్ పార్సిల్ సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజ నిర్దారణ కలిగిన సమాచారం అందిచడం జరుగుతుంది.
భూదార్ కార్డ్ ఎన్ని రకాలు
ఈ భూదార్ కార్డ్ ని రెండు రకాలుగా విభజించారు.
1. తాత్కాలిక భూదార్ నెంబర్
2. శాశ్వత భూదార్ నెంబర్
తాత్కాలిక భూదార్ నెంబర్ : ఒక వ్యక్తికి సంబంధించిన భూములకు జియో టాగింగ్ ఇంకనూ పూర్తి కానీ భూములకు ఉన్నచో వాటికి తాత్కాలిక భూదార్ సంఖ్య ఇవ్వడం జరుగుతుంది.ఇలాంటి భూములకు 99 సీరియల్ నెంబర్ తో మొదలవుతుంది.
శాశ్వత భూదార్ నెంబర్ : ఇవి ఆ వ్యక్తి యొక్క మొత్తం భూములకు సంబంధించి జియో ట్యాగింగ్ పూర్తి చేసుకున్న భూములకు ఈ శాశ్వత భూదార్ నెంబర్ ని 11 అంకెలతో ఇస్తూ వాటిలో మొదట నంబర్లు 28 తో మొదలు అయ్యేలా ఉంటాయి.
ఇప్పుడు భూదార్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం
ఈ కార్డ్ ని రెండు రకాలుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
1 భూదార్ వివరాలు ప్రింట్ చేసుకోవడం
2 e-Bhudar ని డౌన్లోడ్ చేసుకోవాలి
మొదట భూదార్ వివరాలను ఈ క్రింది లింక్ ని ఓపెన్ చేసి నెంబర్ ని చెక్ చేసుకోగలరు.
STEP 1: ఈ పేజీ లో వ్యవసాయానికి సంబంధించిన భూమి వివరాలు, మున్సిపల్ భూములకు సంబంధించిన వివరాలు మరియు పంచాయతీ, అటవీ భూములకు సంబంధించిన వివరాలు చూపించడం జరుగుతుంది. వాటిలో మీకు ఏది కావాలో దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
STEP 2 : ఈ పేజీ నందు భూమి ఉన్న వివరాలు ఇవ్వవలెను.ఇచ్చాక వెతకండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి వుంటుంది
STEP 3 : ఈ పేజీ భూమి కిసంబంధించిన యజమాని వివరాలు చూపిస్తూ అక్కడే వారి భూమికి భూదార్ నెంబర్ ని చూపించడం జరుగుతుంది.
STEP 4 : అక్కడే కొంచెం పైన ప్రింట్ అనే ఓషన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చెసుకోవచ్చును.
E Bhudar కార్డ్ డౌన్లోడ్ చేయు విధానం
ఈ కార్డ్ డౌన్లోడ్ చేయు అవకాశం ప్రస్తుతానికి వ్యవసాయ భూములకు మాత్రమే అవకాశం ఇచ్చారు.
గమనిక: ఈ కార్డ్ పొందాలంటే మీ భూమికి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఒరిజినల్ భూదార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కలదు.
![]() |
E BHUDAR |
ఈ లింక్ ఓపెన్ చేసాక ఈ పేజీ లోనే కొంచెం క్రిందకు వస్తే Quick Links అనే ఆప్షన్ లో e Bhudar ఆప్షన్ పై క్లిక్ చేసి ఓపెన్ చేసుకోగలరు.
గమనిక : ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే శాశ్వత భూదార్ నెంబర్ అంటే మొదటి నెంబర్ 28 తో మొదలైన నెంబర్ వచ్చి ఉంటే మాత్రమే ఈ కార్డ్ డౌన్లోడ్ అవుతోంది
భూదార్ నమూనా ఈ క్రింద విధంగా ఉంటుంది.
THANK YOU
0 Comments