10 వ తరగతి మార్క్స్ మెమో డౌన్లోడ్ -2022
ఈ పేజీ నందు ప్రధానంగా మనం ఈ క్రింది విషయాలు గురించి చెప్పుకుందాం.
1. 10 వ తరగతి మార్క్స్ మెమో డౌన్లోడ్ చేయు విధానం
2. ఫెయిల్ అయిన విద్యార్థులు కు శుభవార్త
3. పాస్ అయిన వారికి మరో అవకాశం
మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయి తెలుసుకుంటూ ఉండగలరు.
![]() |
Watsapp |
10 వ తరగతి మార్క్స్ మెమో డౌన్లోడ్ చేయు విధానం
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జూన్ 6 వ తేదీన పరీక్ష ఫలితాలు వెలువరించిన విషయం మనకు తెలిసిందే.ఇప్పడు దీనికి సంబంధించి ఆ విద్యార్థులు ఇంటర్మీడియట్ చేరాలంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయబోయే మార్క్స్ మెమో ని కళాశాలలో ఇచ్చి కూడా జాయిన్ అయ్యే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఫోన్ లోనే కూడా చేసుకుని బయట ఇంటర్నెట్ షాప్ లలో ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఈ పేజీ చివరన ఇవ్వడం జరిగింది.దాని మీద క్లిక్ చేయగా ఈ క్రింది రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.
STEP 2 : పై పేజీ నందు విద్యార్ధి యొక్క హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసి Submit బటన్ పై క్లిక్ చేయవలెను.ఇక్కడే ఆ విద్యార్థికి సంబంధించిన మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.
STEP 3 : ఈ పేజీ లోనే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దానిమీద క్లిక్ చేసి PDF లో SAVE చేసుకుని ఇంటర్నెట్ షాప్ లో ప్రింట్ తీసుకోవచ్చును.
ఫెయిల్ అయిన విద్యార్థులు కి శుభవార్త
శుభవార్త ఏమిటంటే సాధారణంగా పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆ తరువాత నెలలలో పరీక్ష ఫీజు కట్టి మళ్ళి పరీక్ష వ్రాసి పాస్ అవుతూవుంటారు.ఆ విధంగా పాస్ అయిన వారికి ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ నందు Regular Pass అని కాకుండా Comportment పాస్ అని ఇస్తుంటారు.
కానీ మొట్ట మొదటగా పై విధంగా పాస్ అయిన విద్యార్థులుకి Comportment Pass అని లేకుండా Regular గానే గుర్తిస్తాము అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఆ విద్యార్థులు కి చాలా చక్కటి అవకాశం.దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
మరో అవకాశం కూడా ఏమిటంటే ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించి, అందులో భాగంగా ప్రతి రోజు రెండు గంటలు శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పించనున్నారు.
సప్లమెంటరీ పరీక్ష ఫీజు : జూన్ 7 వ తేదీ
స్పెషల్ క్లాస్ : జూన్ 13 వ తేదీ నుండి
పరీక్షలు : జులై 6 నుండి 15 వ తేదీ వరకు
పాస్ అయిన వారికి మరో అవకాశం
ఈ 2022 వ సంవత్సరం లో పాస్ అయిన 10 వతరగతి విద్యార్థులు,ఒక వేల Improvement Marks కొరకు మరలా వ్రాయదలేస్తే,అలాంటి వారు పరీక్ష రుసుము కట్టి మరలా వ్రాసుకోవచ్చును. దీని వల్ల ఎక్కువ మార్కులు వచ్చిన పరీక్ష ను పరిగణనలోకి తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. ఒక వేళ ఇప్పుడు వ్రాసిన Improvement పరీక్ష లో కన్నా మొదటగా వ్రాసినా పరీక్ష లోనే ఎక్కువ మార్కులు వచ్చినా దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.
SSC MARKS MEMO DOWNLOAD LINK
![]() |
SSC 2022 |
THANK YOU
0 Comments