10 వతరగతి విద్యార్థులు కి 10 వేలు - దరఖాస్తు విధానం
ఈ పేజీ నందు మనం వివరించుకోబోతున్న అంశాలు ఏమిటంటే...??
- విద్యాదాన్ ఉపకార వేతనాలు అంటే ఏమిటి ?
- ఈ విద్యాదాన్ ఉపకార వేతనాల ద్వారా ఎంత సహాయం చేస్తారు ?
- ఈ విద్యాదాన్ ఉపకార వేతనాలు కి ఎవరు అర్హులు ?
- ఈ స్కాలర్ షిప్ కి ఎలా ఎంపిక చేస్తారు ?
- ఈ స్కాలర్ షిప్ కి దరఖాస్తుకి సంబంధించి ముఖ్యమైన తేదీలు ?
- ఈ స్కాలర్ షిప్ కి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?
- దరఖాస్తు చేయు విధానం ఎలా ?
- ఏదైనా సందేహాలకు ఎవరిని సంప్రదించాలి ?
మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కావాలంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవగలరు
విద్యాదాన్ ఉపకార వేతనాలు అంటే ఏమిటి ?
సరోజిని దామోదర ఫౌండేషన్ వారు ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ అనే కార్యక్రమం ద్వారా 10 వ తరగతిలో మంచి ప్రతిభ కనపరచిన పేద విద్యార్థులకు ఈ సంస్థ వారి యొక్క ఉన్నత చదువుల కోసం తోడుగా వుంటున్నారు. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ, చెన్నై,గోవా,ఒడిశా రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన పేద విధ్యార్ధులకు దాదాపు 5090 మందికి తోడుగా నిలిచారు.
గమనిక : ప్రస్తుతానికి ఆంద్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు కి మాత్రమే అవకాశం ఇచ్చి వున్నారు.ఇక కాకపోతే తెలంగాణ విద్యార్థులకు పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత ఇదే ప్రాసెస్ వారికి కూడా వర్తిస్తుంది.
ఈ విద్యాదాన్ ఉపకార వేతనాల ద్వారా ఎంత సహాయం చేస్తారు ?
విద్యార్థి చదువుతున్న కోర్సు ని బట్టి సంవత్సరానికి Rs.10,000 ల నుండి Rs.60,000 వరకు సహాయం చేయడం జరుగుతుంది
ఈ విద్యాదాన్ ఉపకార వేతనాలు కి ఎవరు అర్హులు ?
ఈ స్కాలర్షిప్ కొరకు 2021-22 విద్యా సంవత్సరంలో 10 వతరగతి (SSC/CBSC/ICSC) ఫలితాలు నందు 90% మార్కులు గానీ లేదా 9 CGPA సాధించిన వారు ఈ స్కాలర్షిప్ కి అర్హులు.మరియు ఇందులోనే దివ్యాంగులుకు మాత్రం 75% మార్కులు లేదా 7.5 CGPA వచ్చినా కూడా అర్హులే.
90% మార్కులు అంటే : 540 పైగా మార్కులు వస్తే చాలు
దివ్యాంగులుకు : 450 మార్కుల పైన వచ్చి ఉంటే సరిపోతుంది
మరియు ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ పొందాలంటే ఆ విద్యార్థి యొక్క కుటుంబ సంవత్సర ఆదాయం 2 లక్షలకు లోపల ఉండాలి.
ఈ స్కాలర్ షిప్ కి ఎలా ఎంపిక చేస్తారు ?
విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా మరియు అప్లికేషన్ లో ఇచ్చిన వివరాల ఆధారంగా పరిశీలించి,ఆ పిదప ఆ విద్యార్థులకు ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించి మరియు ఇంటర్వ్యూ కూడా చేసి, ఆ తర్వాత అర్హుల జాబితా ప్రకటిస్తారు.ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన e-mail ద్వారా ప్రతి విషయాన్ని కూడా తెలియ పరుస్తూ వుంటారు.
ఈ స్కాలర్ షిప్ కి దరఖాస్తుకి సంబంధించి ముఖ్యమైన తేదీలు ?
దరఖాస్తు కి ఆఖరు తేదీ : జులై 10, 2022
వ్రాత పరీక్ష : జులై 24, 2022
ఇంటర్వ్యూ : ఆగస్ట్ 7 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు
ఈ స్కాలర్ షిప్ కి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?
10 వ తరగతి మార్కు లిస్ట్ (ఒకవేళ ఒరిజినల్ మార్కలిస్ట్ ఈ సమయానికి అందుబాటులో లేకపోతే అఫిషియల్ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకున్న మార్కు లిస్ట్ కూడా పెట్టవచ్చు)
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
2022 లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate)
దివ్యాంగులు అయితే ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం ఉండాలి
జులై 10,2022 లోపు కాలేజ్ లో జాయిన్ అయి, ఆ వివరాలను ఈ విద్యాదాన్ ఆన్లైన్ అప్లికేషన్ లో పెట్టాల్సి ఉంటుంది. లేనియెడల మీ అప్లికేషన్ ని అంగీకరిచబడదు.
దరఖాస్తు చేయు విధానం ఎలా ?
ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Official Website :
APPLY LINK
ఏదైనా సందేహాలకు సంప్రదించాల్సిన వారి వివరాలు
Whatsapp OR SMS
సురేష్ : 8367751309
ఈ సందేహాలకు సోమవారం నుండి శనివారం వరకు మరియు 9 am నుండి సాయంత్రం 6 గంటల మధ్య సంప్రదించగలరు.
Thanking You
0 Comments