ఈ పేజీ లో మనం అమ్మఒడి డబ్బులు పడకపోవడానికి గల కారణాలను ప్రభుత్వ అధికారులు తెలియజేసారు.మరియు వాటిని ఏ విధంగా సరిచేసుకోవాలి అని కూడా కొన్ని ప్రశ్నలు - సమదానాలు రూపంలో ఒక PDF విడుదల చేయడం జరిగింది
సమస్య: Account Closed
సమాధానం: కొంతమందికి గతంలో వున్న బ్యాంక్ అకౌంట్ లో సంవత్సరం కాలంగా లావాదేవీలు జరగకపోతే, అలాంటి అకౌంట్లు క్లోజ్ అవుతాయి.కాబట్టి అలాంటి వారికి ఈ స్టేటస్ చూపిస్తుంది.కావున క్రొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు
సమస్య: Inactive Adhar
సమాధానం: ఈ సమస్య ఈ క్రింది సందర్భాలలో వస్తుంది అంటున్నారు.
1. డూప్లికేట్ ఆధార్ నెంబర్ అయినప్పుడు కూడా ఇలా చూపించవచ్చు.
2.ఆధార్ కార్డ్ లో బియోమెట్రిక్ అప్డేట్ కూడా చేసుకుంటే మంచిది అని కూడా చెబుతున్నారు.
3. ఈ సమస్యకు NPCI లింక్ నందు ఒకసారి డీ- లింక్ చేసి, మరలా లింక్ చేయమని బ్యాంక్ మేనేజర్ ని అడగాలని తెలియజేస్తున్నారు.
సమస్య: Account Reach Maximum Credit Limit Set On Account By Bank
సమాధానం: ఇలాంటి స్టేటస్ ఎవరికి వస్తుంది అంటే కొంతమంది జీరో అకౌంట్ ఓపెన్ చేసి వుంటారు.ఆ అకౌంట్ కి లిమిట్ సంవత్సరానికి రూ 50 వేలు మాత్రమే ఉంటుంది.ఆ లిమిట్ దాటేసి వున్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్ పడే అవకాశం ఉండదు.కాబట్టి అలాంటి సందర్బాలలో ఈ విధంగా చూపిస్తుంది.ఇలాంటి వారు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో మరో క్రొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవడం మేలు.
సమస్య: Invalid Account Type
సమాధానం: ఇలాంటి ఆర్ధిక సాయాలు కేవలం సేవింగ్ అకౌంట్ కి మాత్రమే జమ చేయబడతాయి.కానీ ఇతర అకౌంట్ లకి NPCI సీడ్ అయుంటే అమౌంట్ వేయరు.కనుక ఇలాంటి స్టేటస్ చూపించవచ్చును.
సమస్య: Invalid Bank Identifier
సమాధానం: ఈ సమస్యకి ప్రభుత్వ అధికారులు చెప్పినది ఏమనగా క్రొతగా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దానికి NPCI లింక్ చేసుకోవడం ఉత్తమం.
సమస్య: Unclaimed / DEAF Accounts
సమాధానం: ఈ విధంగా స్టేటస్ వచ్చిన వారు కూడా క్రొత్తగా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవలెను.
0 Comments