Ysr Cheyutha Final eligible & In eligible list Released-2022
ఈ పేజీ లో మనం ఇప్పుడు ఈ 2022 లో YSR చేయూత కి సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్ ని తెలుసుకుందాం.
1) ఫైనల్ అర్హుల లిస్ట్ విడుదల,చెక్ చేసుకునే అవకాశం ఎలా ?
2) ఈ లింక్ లేకపోతె అర్హుల లిస్ట్ లో వున్నా కూడా డబ్బులు రావు ?
3) Ysr చేయూత రిలీజ్ తేదీ వాయిదా..?
మరిన్ని నూతన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి.
1) ఫైనల్ అర్హుల లిస్ట్ విడుదల,చెక్ చేసుకునే అవకాశం ఎలా ?
జ) ఈ 2022 వ సంవత్సరం కి సంబంధించి SC, ST, BC, MIN లలోని 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు ప్రభుత్వం రూ.18,750 లను ఉచితంగా వారి వ్యక్తిగత అకౌంట్ లలో డబ్బులు వేయనున్న విషయం మనకు తెలిసిందే.దీనికి సంబంధించిన ఫైనల్ అర్హుల లిస్ట్ మరియు అనర్హుల లిస్ట్ అనేది 20-09-2022 న సచివాలయంలో ఇప్పుడు విడుదల అవడం జరిగింది.
Website Link : CLICK HERE
2) ఫైనల్ అర్హత జాబితా & అనర్హత జాబితా లిస్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలి ?
జ) దీనికి సంబంధించి సిటిజెన్ చెక్ చేసుకోవడానికి లాగిన్ ఏమి ఇవ్వలేదు.ఈ లిస్ట్ పూర్తిగా సచివాలయం యొక్క లాగిన్ లో డౌన్లోడ్ చేసుకుని నోటీస్ బోర్డ్ లో ప్రచురిస్తారు.కనుక మీరు వెళ్లి మీ పేర్లు చెక్ చేసుకోగలరు.లేదా మీ వాలంటీర్ కి తెలియజేసిన కూడా ఆ లిస్ట్ లో చూసి చెబుతాడు.
3) ఈ విడత చేయూత డబ్బులు ఎప్పుడు పడనున్నాయి ?
జ) ఈ రోజు నాటికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం సెప్టెంబర్ 22 వ తేదీన ప్రారంభిస్తారని తెలియజేసారు.కానీ దాన్ని కొంచెం మార్పు చేసి చిత్తూరు జిల్లాలోని కుప్పం నందు ఈ కార్యక్రమంని సెప్టెంబర్ 23 వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు.
4) ఆధార్ కార్డ్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో తెలుసుకోవడం ఎలా ?
జ) ప్రభుత్వం ఆర్ధిక సాయం చేసేటప్పుడు మధ్యలో అక్రమాలకు తావులేకుండా చేయాలనే ఉదేశ్యం తో DBT(Direct Benefit Transfer) ద్వారా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారుని అకౌంట్ లో జమ అయ్యేటట్టు చూడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో..ఆ విధంగా అడుగులో పడ్డాయి.అది ఏ విధంగా అంటే ఎవరు అయితే వాళ్ళ ఆధార్ నెంబర్ ని అకౌంట్ కి NPCI లింక్ చెసుకుంటారో..అలాంటి ఖాతాలకు డబ్బులను సులువుగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది.కనుక అందరూ ఖచ్చితంగా NPCI లింక్ చేసుకోమని గత సంవత్సర కాలం గా చెబుతూనే ఉన్నారు.
NPCI link Checking
![]() |
NPCI LINK |

0 Comments