Header Ads Widget

how to register graduate mlc voter online-2022

How to register graduate mlc voter online-2022

form 18 online registration in ap graduate voter registration online  graduate voter list mandya graduate constituency voter list eligibility for mlc voter registration mlc voter registration form 18 graduate mlc elections in ap eligibility for mlc voter registration graduate mlc voter registration online in ap 2022 graduate mlc voter registration online  graduate voter registration ceo ap graduate mlc voter registration online in karnataka graduate mlc elections in ap graduate voter registration online


ఈ పేజీ లో మనం ఇప్పుడు  పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఓటరు కార్డ్ నమోదు చేయు పద్దతి మరియు అర్హతలు ఇలా చాలా విషయాలు చర్చించుకుందాం.

 

ఇలాంటి మరిన్ని కేంద్ర,రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకున్న వారు ఈ క్రింది గ్రూప్ నెలలో జాయిన్ అయ్యి నూతన వివరాలు పొందవచ్చును.


WATS APP GROUP : CLICK HERE

TELEGRAM GROUP : CLICK HERE


ఆంద్రప్రదేశ్ లో గానీ,తెలంగాణాలో గానీ అదేవిధంగా దేశంలో ఎక్కడైనా గానీ శాసన మండలికి సంబంధించిన ఓటరు కార్డ్ రిజిస్ట్రేషన్ కొరకు ఒకే విధమైన షరతులు ఉంటాయి.అవేమిటో ఇప్పడు ఈ పేజీ లో చాలా విషయాల గురించి క్షుణ్ణంగా చర్చించుకుందాము.
 



1) గతంలో ఇదేవిధంగా శాసన మండలి కి సంబంధించి ఓటర్ రిజిస్ట్రేషన్ చేరుకున్నాము...ఇప్పడు అదే సరిపోతుంది కదా ?

జ) ఈ సందేహం చాలా మందికి ఉంటుంది.కావున ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించిన ముఖ్య వివరాలు వెల్లడించారు.అదేమిటంటే ఈ శాసన మండలి ఓటర్ నమోదుకు ఎన్నికలు జరిగే ప్రతి సారి నూతనంగా నమోదు చేసుకోవాలి.అంతేగానీ గతంలో నమోదు చేసుకున్న ఓటర్ కార్డ్ చెల్లదు.ఎందుకంటే గత ఓటరు లిస్టుని పూర్తిగా తొలగించబడుతుంది.


2) ఈ ఓటరు కార్డ్ నమోదు కొరకు ఎవరు అర్హులు ?

జ) ఈ 2019,అక్టోబర్ 31 వతేదీ కల్లా ఎవరికైతే గ్రాడ్యుయేషన్ పూర్తి అయిందో అట్టి వారందరూ  కూడా అర్హులే.మరియు భారతదేశం లో పట్టభద్రులై కనీస వయస్సు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి.అలాగే విద్యార్హత కి వచ్చినట్లు అయితే ఏదైనా డిగ్రీ గానీ,ఇంజినీరింగ్, అదే విధంగా డిగ్రీ కి సమానమైన డిప్లొమా కోర్సు లు చేసిన వారు మరియు MBBS, అగ్రికల్చర్ లో డిగ్రీ, ఆయుర్వేదిక్ డిగ్రీ..ఇలా వీరందరూ కూడా అర్హులే.


3) ఈ ఓటరు కార్డ్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు ?

జ) ఈ శాసన మండలికి సంబంధించిన పట్టభద్రుల ఓటరు కార్డ్ నమోదుకు రెండు రకాలుగా దరఖాస్తు చెసుకోవచ్చును.


1) ఈ క్రింది అప్లికేషన్ ఫారం-18 ని నింపి మీ AERO గారికి నేరుగా గానీ/పోస్ట్ ద్వారా గానీ చేర్చాలి.


APPLICATION PDF : DOWNLOAD


2) Online లో కూడా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చును.


GRADUATE VOTE: CLICK HERE

TEACHERS VOTE : CLICK HERE


4)ఈ ఓటరు కార్డు దరఖాస్తు కొరకు కావాల్సిన పత్రాలు ఏమిటి ?


OFFLINE ధరఖాస్తుకు

జ) ఫారం18,

డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్)

ఆధార్ కార్డ్ 

ఓటరు కార్డ్

పాస్ పోర్ట్ సైజ్ ఫోటో (ఫోటో బ్యాంక్ గ్రౌండ్ తెలుపు రంగులో ఉండాలి)


ONLINE లో దరఖాస్తు చేయుటకు

A) పాస్ పోర్ట్ సైజ్ ఫోటో (100kb లోపల)

B) డిగ్రీ సర్టిఫికెట్ ఒరిజినల్ 

C) ఆధార్ నెంబర్ (ఖచ్చితత్వం లేదు)


5) ఏయే జిల్లాల వాళ్ళు ఇప్పడు దరఖాస్తు చేసుకోవచ్చునను ?

జ) 18 క్రొత్త జిల్లాల పట్ట భద్రులు ప్రస్తుతం ఓటరు కార్డ్ నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చును.

గ్రాడ్యుయేషన్ నిజకవర్గం క్రింద ఈ క్రింది జిల్లాల వారికి అవకాశం కలదు.


1) శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం

శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం మన్యం,విశాఖపట్నం, అనకాపల్లి,అల్లూరి సీతారామరాజు


2) ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు

ప్రకాశం జిల్లా,నెల్లూరు జిల్లా,చిత్తూరు జిల్లా ,తిరుపతి జిల్లా,బాపట్ల, అన్నమయ్య జిల్లాలు.


3) కడప,అనంతపురం,కర్నూల్

కర్నూల్ జిల్లా,నంద్యాల జిల్లా,అనంతపురం జిల్లా,శ్రీ సత్యసాయి జిల్లా,వైస్సార్ కడప జిల్లా,అన్నమయ్య జిల్లా



5) ఈ ఓటరు కార్డ్ దరకాస్తుకి చివరి తేదీ ఎప్పుడు ?

జ) ఈ పట్ట భద్రుల శాసన మండలి ఓటరు కార్డ్ కి సంబంధించిన దరఖాస్తు కొరకు


దరఖాస్తు కొరకు: అక్టోబర్ 1 వ తేదీ నుండి, నవంబర్ 7 వతేదీ 

ముసాయిదా జాబితా : నవంబర్ 23 వతేదీ

అభ్యంతరాల స్వీకరణ: నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వ తేదీ వరకు


5) దరఖాస్తులు ఎక్కడ అందజేయాలి ?

జ) Offline లో దరఖాస్తు చేసుకున్న వారు మీకు సంబంధించిన RDO ఆఫీస్ లో గానీ లేదా మీ MRO ఆఫీస్ లో గానీ పైన చెప్పిన కాపీ లపై సెల్ఫ్ ఆటేస్టేడ్ మరియు గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర కూడా అటెస్టడీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.


 గమనిక: Online లో దరఖాస్తు చేసుకునే వాళ్ళు అటెస్టడ్ అవసరం లేదు.ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికెట్ కి సంబంధించిన ఫోటో పెడుతాము కాబట్టి అటెస్టెడ్ అవసరం లేదు.


6) దరఖాస్తులను వేరిఫికేషన్ ఎలా చేస్తారు ?

జ) దరఖాస్తులు ని అంచేజేసిన తరువాత ఫీల్డ్ వేరిఫికేషన్ కూడా మీరు ఇచ్చిన చిరునామా కి వచ్చి సర్టిఫికేట్స్ ని వెరిఫై చేస్తారు.


7) ఏదైనా సందేహాలకు ఎవరిని సంప్రదించాలి ?

జ) ఎలెక్షన్ కమీషన్ ప్రతి ఏరియా కి  సంబంధించి కొంతమంది ఉన్నత అధికారులకు AERO/ERO బాధ్యతలుని ఇవ్వడం జరిగింది.కావున మీకు సంబంధించిన వారి మొబైల్ నెంబర్ ని ఈ క్రింది PDF లో చూసుకోవచ్చు.ఆ నెంబర్ తో వారిని కాంటాక్ట్ అయ్యి మీ సందేహాలను నివృత్తి చెసుకోవచ్చును.


     

form 18 online registration in ap graduate voter registration online  graduate voter list mandya graduate constituency voter list eligibility for mlc voter registration mlc voter registration form 18 graduate mlc elections in ap eligibility for mlc voter registration graduate mlc voter registration online in ap 2022 graduate mlc voter registration online  graduate voter registration ceo ap graduate mlc voter registration online in karnataka graduate mlc elections in ap graduate voter registration online


Post a Comment

0 Comments