Header Ads Widget

ఆధార్ తో సర్వీస్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా ?

 ఆధార్ తో సర్వీస్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా ?




ఈ రోజు ఈ పేజీ నందు ఆంద్రప్రదేశ్ లోని ప్రజలకు సంబంధించి 

సచివాలయంలో మీరు ఇప్పటివరకు ఏదైన సర్వీస్ కొరకు దరఖాస్తు చేసుకుంటే ఆ స్టేటస్ వివరాలు చూసుకోవడానికి Online లో లింక్ ఉండేది.కానీ దానికి అప్లికేషన్ నెంబర్ కావల్సివచ్చేది.కానీ ఇప్పుడు దానిని కూడా మార్చి ప్రజలకు ఇంకా సులువుగా ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

  

         ఇప్పడు దానిని ఏవిధముగా చెక్ చేసుకోవాలో వివరంగా చుద్దాం.దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఈ పేజీ క్రింద చివరన ఇవ్వడం జరిగింది.





కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవగలరు.


WATSAPP



STEP 1: క్రింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగా మొదట పేజీ ఈ క్రింది విధంగా వస్తుంది.




STEP 2: ఇక్కడ మనకు (1) Enter Your Adhar (2) Preview AP Seva Certificate అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.ఇక్కడ దరఖాస్తు దారుని యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.




STEP 3: ఇక్కడ ఇప్పటి వరకు సచివాలయంలో ఎన్ని సర్వీసులు దరఖాస్తు చేసిన పేరు,అప్లికేషను నెంబర్,స్టేటస్ అని మూడు రకాల వివరాలు కనిపిస్తాయి.కావున అక్కడ చివరన ఉన్న Status దగ్గర Approved అని ఉంటే మీరు ఇక డైరెక్ట్ గా సచివాలయంలో ప్రింట్ తీసుకోవచ్చు.ఒకవేళ Pending అని చూపిస్తే Application నెంబర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.అప్పడు అక్కడ మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ అధికారి దగ్గర పెండింగ్ వుందో మీరే తెలుసుకోవచ్చు.



WEBSITE LINK : CLICK HERE

పై విధంగా ఆంద్రప్రదేశ్ ప్రజలు మీ దరఖాస్తుని మీరే స్టేటస్ చెక్ చేసుకునేలా ప్రభుత్వం క్రొత్త వెబ్సైట్ అందుబాటులో వుంచింది.

Post a Comment

0 Comments