Header Ads Widget

YSRCP లో క్రొతగా గ్రామ సారథులు మరియు సచివాలయ పరిధి కన్వీనర్లు నియామకం
ఈ రోజు ఈ పేజీ నందు YSRCP పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు పార్టీ బలోపేతం లో భాగంగా ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ని ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా వున్నాయి.


1) క్రొత్తగా గ్రామ సారథులు నియామకం-వారి విధులు

2) సచివాలయ పరిధిలో క్రొత్తగా  కన్వీనర్లు నియామకం-వారి విధులు

3) గ్రామ సారథులు/కన్వీనర్లు కి పార్టీ తరుపున ఉపయోగం ఏమిటి ?


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అయి అప్డేట్స్ తెలుసుకోగలరు.


WATSAPP & TELEGRAMనేపథ్యం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆశయం ప్రకారం ఈ 2024 వ సంవత్సరం లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పూర్తిగా 175 స్థానాలలో YSRCP విజయం సాధించే దిశగా అడుగులు వేస్తూ దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తూ, నూతన మార్గదర్శకాలుని ముఖ్యమంత్రి వివరించడం జరిగింది.


      ఈ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ప్రాంతీయ సమన్వయకర్తలు మరియు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనర్ల తో మాట్లాడుతూ మన ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో పట్టణ ప్రాంతాలలో 84%, గ్రామీణ ప్రాంతంలో 92% కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల రూపాలలో లబ్ది చేకూర్చాము.కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.అదేవిధంగా ఇంతకుముందు అంతా రాజకీయ నాయకులు గ్రామాల్లో/పట్టణాలలో తిరగాలి అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది.కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.దైర్యంగా ప్రతి గ్రామానికి వెళుతున్నారు.వారికి ఎంత లబ్ది చేకూర్చమో మీరే వివరిస్తున్నారు.కావున రాజకీయ వ్యవస్థ పూర్తిగా మర్చేసినట్టు పేర్కొన్నారు.కనుక ప్రభుత్వం చేయాల్సిన పనిని 100% చేసాము.ఇక మీరు దైర్యంగా మీ నియోజకవర్గ ప్రజలతో కలవండి.మీరు అలా ప్రతి కుటుంబాన్ని మల్లీ వెళ్లి పలకరిస్తేనే మనం అనుకున్న 175 సీట్లు కైవసం చేసుకోగలము.కావున మీతో పాటు ఇంకా గ్రౌండ్ స్థాయి నుండి మరికొంత మందిని గ్రామ సారధుల్ని  నియమించి మరింత పటిష్టం చేయనున్నట్లు పేర్కొన్నారు.


1) క్రొత్తగా గ్రామ సారథులు నియామకం - వారి విధులు
 

ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ప్రతి కుటుంబానికి  ప్రభుత్వం అందిచిన సంక్షేమాన్ని మరలా ఒకసారి ఆ కుటుంబాలకు వివరించేలా ప్రణాళిక చేస్తూ,మరియు గ్రామ స్థాయి నుండి ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గ్రామ సారధులుగా రాష్ట్ర వ్యాప్తంగా 5,20 లక్షల మందిని నియమించనున్నారు.ఈ నియామకం లో ఖచ్చితంగా ఒకరు పురుషులు మరొకరి మహిళలు అయి ఉండాలి.వీరు పార్టీ ఇచ్చే సందేశాలను ఆ 50 కుటుంబాలకు చేరవేయడం,అదేవిధంగా పార్టీ తయారుచేసిన పబ్లిసిటీ మెటీరియల్ ని ప్రజలకు అందించడం లాంటివి చేయాల్సి వుంటుంది. మరియు అందులో ముఖ్యంగా ఆ ఇద్దరు గ్రామ సారథులు అనేవారు ఆ 50 ఇళ్లలో ఉండేవాళ్ళు ఉండాలని ఆదేశించారు.వీరి పనితీరుని గ్రామ/వార్డ్ స్థాయి కన్వీనర్లు పర్యవేక్షిస్తూ వుంటారు.


2) క్రొత్తగా గ్రామ /వార్డ్ కన్వీనర్లు నియామకం-వారి విధులు:


పార్టీ అధ్యక్షులు యొక్క ఆదేశాల మేరకు ప్రతి గ్రామ/వార్డ్ సచివాలయ పరిధిలో ముగ్గురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల మంది కన్వీనర్ల ని నియమించబోతున్నారు.వీరిలో ఒకరు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి.వీరందరూ కూడా స్థానికులు అయి ఉండాలి.వీరు పార్టీ  అందించిన ఆదేశాలు పాటించడం మరియు పబ్లిసిటీ మెటీరియల్ ని గ్రామ సారధులకుకి అందించి అవి ప్రజలకు అందేట్టు చేయడం వీరి యొక్క ప్రధమ కర్తవ్యం. ఈ కన్వీనర్ల నియామక ప్రక్రియ మొత్తం ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని పార్టీ అధ్యక్షులు ఆదేశించారు.


3) గ్రామ సారథులు/కన్వీనర్లు కి పార్టీ తరుపున ఉపయోగం ఏమిటి ?

జ) ప్రతి సచివాలయ పరిధిలో పార్టీ కన్వీనర్లు గా మరియు గ్రామ సారధులుగా పనిచేసే వారికి ఉచిత భీమా సౌకర్యం వుంటుంది అని మరియు పార్టీ జరుపుకునే విస్తృత స్థాయి సమావేశాలకు ఆహ్వానితులుగా కూడా పిలవబడుతుంది.

Post a Comment

0 Comments