Header Ads Widget

2000 rupees Notes are banned telugu-2023

2000 rupees Notes are banned Telugu -2023

rs 2000 notes,2000 notes,new 2000 notes,2000 rupee notes,rbi stops printing 2000 notes,rs 2000 note,2000 rupee note,2000 rs note,2000 note ban,2000 currency notes,rbi on 2000 notes,rs 2000 note ban,2000 notes ban,2000 note,rs 2000 notes ban,rbi stops printing rs 2000 notes,new rs 2000 currency notes,2000 rupees note ban,2000 notes ban news,2000 rupees note,2000 rupee notes in circulation,rbi stops printing of 2000 rupee notes,2000 note banned





Introduction

 నిన్న అంటే 19-05-2023 వ తేదీ సాయంత్రం రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. "క్లిన్ చిట్ పాలసీ " లో భాగంగా డిజిటల్ కరెన్సీ ని ఎక్కువగా వినియోగంలోకి తేవడానికి ఈ 2000 రూపాల నోట్లను మళ్ళీ తిరిగి బ్యాంకులకు ఇచ్చేయాలని ప్రకటన చేస్తూ,మరియు కేంద్ర ప్రభుత్వ ఆశయ సాధనలో భాగమైన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సధుద్దేశ్యంతో రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించింది. 


ప్రజల నానుడి: ప్రజా నానుడు ప్రకారం ఏమిటంటే ఈ 2000 రూపాయల నోట్లు అనేటివి సామాన్యుని కంట కరువై చాల కలం అయ్యింది.కాబట్టి RBI కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.ఎందుకంటే కొంతమంది బడా బాబుల చేతిలోనూ  మరియు రాజకీయ నాయకుల చేతిలోనూ నల్లధన రూపేణా ఈ 2000 రూపాయల నోట్లను దాచేసుకున్నారు. కనుక ఇప్పుడు ఈ నోట్లను బయటకు తీయడాని కోసమే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వాపోతున్నారు. మరియు ఇలాంటి నిర్ణయానికి సామాన్య జనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని మనం సామాజిక మాధ్యమాలలో చూస్తున్నాము.



ఈ నోట్ల ఉపసంహరణ పై ప్రజలకు వున్న15 రకాల సందేహాలు మరియు వాటికి అధికారులు ఇచ్చిన జవాబులు 


rs 2000 notes,2000 notes,new 2000 notes,2000 rupee notes,rbi stops printing 2000 notes,rs 2000 note,2000 rupee note,2000 rs note,2000 note ban,2000 currency notes,rbi on 2000 notes,rs 2000 note ban,2000 notes ban,2000 note,rs 2000 notes ban,rbi stops printing rs 2000 notes,new rs 2000 currency notes,2000 rupees note ban,2000 notes ban news,2000 rupees note,2000 rupee notes in circulation,rbi stops printing of 2000 rupee notes,2000 note banned

RBI Guidelines PDF




1) ఇప్పడు ఈ రెండు వేల నోట్లను సాధరణంగా ఉపయోగించుకోవచ్చా..లేదా? 


జ) ఈ 2000 రూపాయల నోటు ని పూర్తిగా రద్దు చేయలేదు.ఇది కేవలం ఉపసంహరణ మాత్రమే.కావున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని RBI అధికారికంగా ప్రకటన ప్రకారం ప్రజలు నిర్భయంగా వాడుకోవచ్చు.కానీ ఆ రెండు వేల నోటుని బ్యాంక్ లో ఇచ్చేసి దానికి తగిన విలువ కలిగిన డబ్బులను మార్చుకుని యథేచ్ఛగా వాడుకోవచ్చును.


2) ఈ రూ.2వేల నోట్లను RBI ఎందుకు ఉపసంహరించుకుంటోంది?


జ) RBI Act -1934 లోని Section 24(1) ప్రకారం 2016 వ సంవత్సరంలో ఈ రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. 2016 లో చేసిన నోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ 2000 రూపాయల నోటుని తీసుకొచ్చామని తరువాత మార్కెట్‌లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19 లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశామని RBI ప్రకటన చేసింది. కావున ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ మార్చి 2017కు ముందు ముద్రించినవే.కావున వాటి జీవితకాలం 4-5 ఏళ్లు మాత్రమేకాబట్టి ఇప్పుడు వాటిని వెననకకు తీసుకుంటున్నారు.



3) సాధారణ లావాదేవీలకు ఈ నోట్లను ఉపయోగించవచ్చా?


ఈ 2వేల రూపాయల నోటును సాధారణ లావాదేవీలకు ప్రజలు యధేచ్చగా ఉపయోగించుకోవచ్చు.వాటిని స్వీకరించవచ్చు కూడా అయితే, 2023 సెప్టెంబర్‌ 30 లోగా ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడం లేదా మార్చుకోవడం చేయాలి.


4) ఏ బ్యాంకులలో అయినా మార్చుకోవచ్ఛా ?


రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు సమాచారం ఇచ్చారు,అదేమిటంటే ఎక్కడ అకౌంట్ వున్నాకుడా పర్వలేదు కావున ఈ సదుపాయం 2023 సెప్టెంబర్‌ 30వరకు ఉంటుంది. కనుక అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.



5) బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేసుకోవడం కొరకు ఏమైనా పరిమితి పెట్టారా ?


జ) లేదు,మీ అకౌంట్ లలో డిపాజిట్ చేసుకోవడంపై ఎటువంటి ఆంక్షలూ లేవు.మీకు కేవైసీ, ఇతర నిబంధనలను అనుసరించి ఆ రెండు వేల రూపాయల నోట్లను ఎంతైనా డిపాజిట్‌ చేసుకోవచ్చును.


6) ఈ 2 వేల రూపాయల నోటుని మార్చుకునేందుకు ఏమైనా పరిమితులు విధించారా ?


జ) అవును ఇచ్చారు, అదేమిటంటే ప్రజలు ఒక్కసారికి రూ.20వేలు మాత్రమే బ్యాంకులో మార్చుకునే అవకాశం .

కలదు.


7) ఈ 2 వేల రూపాయల నోట్లను బిజినెస్‌ కరెస్పాండెంట్‌ (బీసీ)ల ద్వారా మార్చుకోవచ్చా?


జ) మార్చుకోవచ్చు.వారికీ కూడా అవకాశం ఇచ్చారు.అయితే బ్యాంకుల్లో ఉండే బిజినెస్‌ కరెస్పాండెంట్‌ల దగ్గర నుంచి రోజుకు కేవలం రూ.4వేలు మాత్రమే మార్చుకునే అవకాశం కలదు..



8) ఏ తేదీ నుండి ఈ 2000 రోపాయల నోట్లను మార్చుకునే అవకాశం కలదు?


జ) ఈ 2023 మే 23 వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తారీఖు వరకు మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వీలుకల్పించారు.కనుక ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ గడువు ఇవ్వడం జరిగింది.


9) ఎక్కడ అకౌంటు ఉందొ..అదే బ్రాంచీలోనే మార్చుకోవాలా?


జ) అదేమి లేదు.ఏ బ్యాంకులోనైనా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు.అయితే, ఒక బ్రాంచీలో ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.


10) ఎవరికైనా రూ.20 వేలకంటే ఎక్కువ అవసరమైతే ఏం చేయాలి?


జ) మీ ఆ 2000 రూపాయల నోట్లను బ్యాంక్ లో డిపాజిట్ చేయుటకు ఎటువంటి ఆంక్షలు లేవు. కనుక రూ.2వేల నోట్లు ఎన్ని ఉన్నా తమ అకౌంట్లో డిపాజిట్‌ చేసుకుని అనంతరం తమ అవసరానికి అనుగుణంగా వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.



11) ఈ 2000 నోట్లను మార్చుకోవడానికి అదనంగా సర్వీస్ చార్జీ ఏమైనా చెల్లించాలా?


జ) అలాంటిది ఏమి లేదు.ఇది నోట్ల మార్పిడి పూర్తిగా ఉచితం అనే విషయాన్నీ గమనించగలరు.


12) వికలాంగులు మరియు వయో వృద్దులకు కొరకు బ్యాంకు నందు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసివున్నారా ?


జ)రిజర్వుబ్యాంక్ సూచనల మేరకు వయోవృద్ధులుకు మరియు వికలాంగుల కొరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించడం జరిగింది..


13) ఈ 2 వేల రూపాయల నోటును వెంటనే డిపాజిట్‌ చేయకుంటే ఏమవుతుంది?


జ) వెంటనే చేయకున్నా పర్లేదు.ఎందుకంటే దాదాపు ఈ ప్రక్రియ పూర్తి అవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వడం జరిగింది. కనుక ఇచ్చిన గడువులోగా వాటిని మీరు బ్యాంక్ నందు డిపాజిట్‌ చేసుకోవడమా లేదా మార్చుకోవడమా చేయాలని సూచిస్తున్నాం.



14) ఈ 2 వేల రూపాయల నోటును తీసుకునేందుకు బ్యాంకు నిరాకరిస్తే ఏం చేయాలి..?


జ) ఇలాంటి సేవలలో ఏదైనా లోపం జరిగితే వినియోగదారుడు మొట్టమొదట బ్యాంకు అధికారులను సంప్రదించాలి.అక్కడ ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బ్యాంకు సిబ్బంది సరిగ్గా స్పందించకపోయినా లేదా బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాధానంతో మీరు సంతృప్తి చెందకపోతే రిజర్వు బ్యాంకు-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ (RB- IOS),2021 కింద ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.


CONCLUSION


పైన చెప్పిన మొత్తం కూడా RBI అధికారికంగా పెయిన్ ఇచ్చిన పిడిఎఫ్ లో చెప్పిన విధముగామరియు కొన్ని వార్త పత్రికల ఆధారంగా తీసుకుని ఈసమాచారం ని అందిచాను.కనుక

 ఇలాంటి లేటెస్ట్ సమాచారాలు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మన ఛానల్ లో SUBSCRIBE  అవండి.మరియు ఈ క్రింది ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి కూడా ఎప్పటికప్పుడు నూతన సమాచారాలు తెలుసుకుంటూ ఉండవచ్చును. 


WHATSPP  LINK 

 
             

Post a Comment

0 Comments