Jagananna house site patta status checking -2023
ఈ పేజీలో మనం చెప్పుకుంటున్న ప్రధానాంశాలు
1) Jagananna house site - Introduction (పరిచయం)
2) ఆధార్ కార్డు తో మీ ఇంటి స్టేటస్ చెక్ చేసుకునే పద్ధతి
3) ప్రభుత్వ అధికారులను ఎప్పుడు సంప్రదించాలి
1) Jagananna house site - Introduction (పరిచయం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మొదటి నుండి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో గ్రామ/వార్డ్ వాలంటీర్స్ సహాయంతో 2019 వ సంవత్సరం నుండే ఇంటిటి సర్వే చేయించి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 31 లక్ష ఇళ్లపట్టాలు అయితే ఇవ్వడం జరిగిందని చెబుతూ వుంటారు.అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా పదే పదే చెప్పే మాటలు మనం కట్టించేది ఇల్లులు కాదు,ఊర్లు కడుతున్నాము అని చెబుతూనే వుంటారు మరియు రాష్ట్రంలో అర్హత ఉండి ఇల్లు లేని నిరుపేద అనేది ఉండకూడదు అని కూడా చెబుతూ వుంటారు.అలా ఎవరైనా వున్నట్లతే సచివాలయం లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి పట్టా కూడా ఇస్తాము అని కూడా అంటున్నారు,కాబట్టి ఇలాంటి అవకాశాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోగలరు.
2) ఆధార్ కార్డు తో మీ ఇంటి స్టేటస్ చెక్ చేసుకునే పద్ధతి
మీకు ఇచ్చిన ఇంటి పట్టా online లో ఉందా లేదా క్యాన్సిల్ చేసారా అనే విషయాన్ని మరియు మీరు క్రొత్తగా ఇంటి స్థలం కొరకు దరఖాస్తు పెట్టుకుని ఉంటే అది sanction అయిందా లేదా అనే విషయాన్నీ మీరే ఏ అధికారులను అడగాల్సిన అవసరం లేకుండా మీ ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చును.కావున ఈ క్రింది ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకోగలరు.
Step 1- పై లింకు మీద క్లిక్ చేసుకున్నాక ఈ క్రింది విధంగా వెబ్సైటు ఓపెన్ అవుతుంది.ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కానీ అదే విధంగా ఆధార్ కార్డు నెంబర్ కానీ ఎంటర్ చేసుకుని వివరాలు చెక్ చేసుకోవచ్చును.
Step 2 - ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాక ఈ క్రింది విధముగా చాలా రకాల లబ్ధిదారుల వివరాలు చూపిస్తాయి.
A ) జగనన్న ఇళ్ల పట్టాల వివరాలు
B) TIDCO లబ్ది దారుల యొక్క వివరాలు
A) జగనన్న ఇళ్ల పట్టాల వివరాలు
Status - Beneficiary status దగ్గర Eligible అని ఉంటే మీ పట్టా ఉన్నట్టు, అలా కాకుండా In-eligible అని ఉన్నట్లయితే మీ పట్టా క్యాన్సిల్ అయిందని అర్ధం.ఇక్కడ కూడా చాల మందికి క్యాన్సిల్ అయిందనే విషయమే కూడా పాపం తెలియదు,అసలు అధికారులు క్యాన్సిల్ చేసున్నప్పుడు కారణాన్ని కూడా తెలపకుండా చేయడం మాత్రం విచారకరమే.
B) TIDCO లబ్ది దారుల యొక్క వివరాలు
పైన Beneficiary స్టేటస్ మరియు చివరన status మరియు Remarks దగ్గర మీ పట్టా ఏమైందో కూడా అక్కడే తెలుసుకోవచ్చు.
3) ప్రభుత్వ అధికారులను ఎప్పుడు సంప్రదించాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందరికి ఇంటి స్థలాలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం.కానీ కొన్ని చోట్ల అక్కడ అక్కడ అధికారులు మరియు స్థానిక రాజకీయ నాయకులు కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి కూడా Ineligible చేసి వున్నారు.కనుక ఇక్కడ చెక్ చేసుకుని అర్హత వుండి ఇంటి పట్టా రాకుంటే మాత్రం కచ్చితంగా 1902 అనే నెంబర్ కి కాల్ చేయవచ్చును.
1902 కి కాల్ చేయు పద్దతి
1) ఆ నెంబర్ కాల్ చేస్తే అక్కడున్న ఉద్యోగులు మీ సమస్య వింటారు.వీలైతే సమస్య తీవ్రత ఎక్కువ అనిపిస్తే స్పందన లో రిజిస్టర్ చేస్తారు.లేదా కొంతమందికి ఎక్కువ శాతం మందికి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో అక్కడే అంటే సచివాలయం కి వెళ్లి చెప్పమంటారు.ఇలా కూడా కొంత మందికి జరుగుతుంది.
2) ఈ 1902 నెంబర్ కి కాల్ చేసి ఆ ఉద్యోగి దగ్గర మేము ముఖ్యమంత్రి గారికి తెలియాలని చెబితే connect చేస్తారు.అక్కడ connect చేసిన తరువాత 1 నిమిషం పాటు సైలెంట్ గా ఉంటుంది.అక్కడ మీరు చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది.
3) మీ జిల్లా కలక్టరేట్ లో కూడా ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో కూడా మీ సమస్యని తెలియజేయవచ్చును.
4) ఆన్లైన్ లో కూడా మీ సమస్యని రిజిస్టర్ చేయవచ్చును.
0 Comments