ఈ రోజు ఈ పేజీ లో చర్చించుకోబోయే అంశాలు ఇవే
1) సురక్షా చక్ర కార్యక్రమం
2) నేతన్న నేస్తం అర్హుల జాబితా టైం లైన్
3) మీ సందేహాల నివృత్తి కొరకు
Introduction
మీ పేజీ నందు రాష్ట్రము లో ప్రస్తుతం ప్రధానంగా వున్న కొన్ని ముఖ్యమైన సమాచారాలను చర్చించుకుందాం.కనుక అందులో భాగంగా ఈ రోజున అంటే 09-06-2023 తేదీ నాటికీ ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రధాన అప్డేట్స్ గురించి కొంచెం వివరంగా చర్చించుకుందాం.అందులో వాలంటీర్స్ మరియు గృహ సారధులు కి సంభందించి సురక్షా చక్ర కార్యక్రమం అదేవిధంగా,ఈ సంవత్సరం కి సంబంధించి నేతన్న నేస్తం విడుదల కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇలా 2 విషయాల గురించి చెప్పుకుందాం.
1) సురక్షా చక్ర కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ లో అర్హత వున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయన ప్రమాణ శ్వీకారం చేసిన మొట్టమొదటగా వాలంటీర్ వ్యవస్థను ప్రతి 50 ఇళ్లకు ఒకరిని ఏర్పాటు చేసి తాను ప్రజలకు ఇవ్వాలనుకున్న సంక్షేమాన్ని కులం,మతం,పార్టీలు,రాజకీయాలు,అవినీతి అనే తేడా లేకుండా ప్రజలకు DBT సిస్టమ్ ద్వారా ఆర్ధిక ప్రొత్సహం ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇపుడు ఇంత పారదర్శకంగా పథకాలను ప్రజల ముంగిట్లోకి ఇస్తున్నాకూడా అక్కడక్కడా కొన్నిచోట్ల కొంతమంది చేసే రాజకీయాల వలన అర్హత వున్నా కూడా పథకాలు అందడం లేదు.కనుక ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఇప్పటికే మ్యానిపిస్టో లో చెప్పిన హామీలను 99% అమలు చేశాను అని ముఖ్యమంత్రి గారు క్యాబినేట్లో చెబుతూ ఇంకా ఎక్కడికైనా అర్హులు మిగిలిపోయివుంటే అట్టి వారిని ఈ నెల అంటే 15-06-2023 నుండి ఈ మధ్య నియామకం అయిన గృహ సారధులు మరియు వాలంటీర్స్ గుర్తించి వారికీ పథకాలు అందేట్టు చేయాలనీ క్రొత్తగా ఈ "సురక్షా చక్ర" అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.కనుక ఈ కార్యక్రమం గురించి ఇంకా మరిన్నినూతన అప్డేట్స్ రానున్నాయి.కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.
అర్హత ఉండి మా సమస్య తీసుకోకపోతే ఎవరికీ చెప్పాలి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదట నుండి చెబుతున్నవిధముగా అర్హత వున్న వారికీ వారి ఇంటివద్దకె అన్ని పథకాలు కూడా హక్కుగా చేరాలి అని చెబుతూనే ఉంటాయి.కనుక ఇప్పుడు కూడా సురక్ష చక్ర అనే పథకం ద్వారా అలంటి లబ్ది దారుల వివరాలు సేకరిస్తున్నారు,కనుక ఇక్కడ కూడా మీ వివరాలు తీసుకోకపోతే "జగనన్నకి చెబుతాం" అనే కార్యక్రమం నెంబర్ అయినా 1902 కి కాల్ చేసి తెలియజేయగలరు.ఇక్కడ ఒక్కసారి మీరు ఏ పథకంకి అయినా అర్హులా కాదా అనే విషయాన్నీ మీరే మొదట చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు అర్హులు అని భావించిన తరవాత Scheme Eligibility లో కూడా అనర్హత అని వస్తే అప్పుడు కూడా మేము అర్హులమే కానీ ఇక్కడ online లో తప్పుగా చూపిస్తుంది.అని అలాంటప్పుడు పై నెంబర్ కి కాల్ చేసి తెలుపవచ్చును.
ఏ పథకానికి అయినా ఆధార్ తో అర్హులమా..అనర్హులమా అని చెక్ చేసుకోండి
2) నేతన్న నేస్తం అర్హుల జాబితా టైం లైన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వృత్తి చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్న కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయలు ను డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆర్ధిక సహాయం చేయడం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.అదే విధముగా ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 2023-24 లో నేతన్న నేస్తం కి టైం-లైన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.కనుక అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1) క్రొత్తగా నమోదు చేయుటకు సచివాలయం లో చివరి తేది 20-06-2023
2) పాత మరియు క్రొత్త లబ్ధిదారులను వెరిఫికేషన్ చేయుటకు తేదీలు - 21-06-2023 -23-06-2023
3) MPDO / MC లు అప్లికేషన్స్ ని Approved /Reject చేయుటకు తేదీలు: 21-06-2023- 25-06-2023
4) డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ / టెక్సటైల్ ఆఫీసర్ (DHTO) దగ్గర Approved /Reject చేయుటకు తేదీలు: 21-06-2023- 27-06-2023
5) తాత్కాలిక అర్హుల / అనర్హుల జాబితా ప్రకటన : 28-06-2023 - 29-06-2023
6) పై లిస్ట్ నందు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరిచేసుటకు : 30-06-2023 - 05-07-2023
7) ఫైనల్ అర్హుల జాబితా : 08-07-2023
8) నేతన్న నేస్తం విడుదల కార్యక్రమమం: ఇంకా తేదీ ప్రకటన చేయలేదు.
3) మీ సందేహాల నివృత్తి కొరకు
కేంద్ర,రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించి మరియు జాబ్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ నందు తెలియపరుస్తూ వుంటాను.కనుక మీకు ఏ సందేహం వచ్చినా ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి నన్ను సంప్రదించవచ్చును.
0 Comments