Header Ads Widget

Scheme Eligibility Check in ap-2022

Scheme Eligibility Check in Ap-2022




ఎలిజిబులిటీ చెకింగ్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతున్న మాట ఏమనగా వివిధ సంక్షేమ పథకాలలో అర్హత ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లో లబ్ది పొందకుండా ఉండిపోకూడదు అనే మాట చెబుతూనే వుంటారు. అదే క్రమంలో ప్రతి 6 నెలలకి ఒకసారి సోషల్ ఆడిట్ చేస్తూ అనర్హత ఉన్న వారిని ఖచ్చితంగా పథకాలు లబ్ధి పొందకుండా కూడా చూసుకోవాలి.కాబట్టి ప్రతీ సిటీజన్ కూడా ఏ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోదలచారో ముందుగానే ఆ పథకానికి నేను అర్హుడినా కాదా అని ముందుగానే సచివాలయం లో చెక్ చేసుకునే సౌకర్యం కలదు.అయితే ఇంకా సులువుగా ప్రతి సిటిజన్ కూడా ఎటువంటి లాగిన్ లేకుండా మన మొబైల్ లోనే స్కీం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చును.దానిని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


Scheme Eligibility Checking 



Scheme Eligibility Checker 



 కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అవగలరు.


WATSAPP & TELEGRAM


ముందుగా వివిధ పథకాలకు సాధారణ అర్హతలు ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ఓపెన్ చేయగలరు.

ఏ పథకానికి అయినా అర్హతలు చేసుకునే లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు.

  

Eligibility


గమనిక: మొబైల్ లో ఓపెన్ చేసే వారు మాత్రం Desktop Site "On" చేసుకుంటే సైట్ బాగా కనిపిస్తుంది.





STEP 1: పై లింక్ ఓపెన్ చేయగా మొదటి పేజీ ఈ క్రింది విధంగా వస్తుంది.



STEP 2: ఇక్కడ మొదట ఎవరి మీద అయితే స్కీం కొరకు దరఖాస్తు చేయదలచారో వారి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి, అక్కడే దాని క్రింద ఏ స్కీం కొరకు ఎలిజిబులిటీని చెక్ చేసుకోదలచారో ఆ స్కీం ని ఎంచుకోవాలి.తరువాత సంవత్సరం ని ఎంపిక చేసుకోవాలి.ఆ తరువాత GET DETAILS అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.



STEP 3: ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP కూడా ఇవ్వాల్సి వస్తుంది.అక్కడ Verify పై క్లిక్ చేయగా విజయవంతంగా లాగిన్ అవుతారు.





STEP 4: మొదట Geographical Data వస్తుంది.ఆ తరువాత మీ వాలంటీర్ దగ్గర హౌస్ మాపింగ్ వివరాలలో ఉన్న మీ కుటుంబ సభ్యుల వివరాలు వస్తాయి.కావున ఒకసారి చెక్ చేసుకోగలరు.



STEP 5: ఇక్కడ చివరిన ప్రభుత్వం సూచించిన 6 దశల వెరిఫికేషన్ కి సంబంధించి అన్నీ Satisfied అని రావాలి.అక్కడ ఏ ఒక్కటి Not Satisfied అని వచ్చినా ఆ పథకానికి అర్హులు కారు.కావున అక్కడ ఏదైనా అనర్హత వస్తే దానిని మొదట క్లియర్ చేసుకున్నాకే పథకానికి పెట్టుకోవాలి.





Post a Comment

0 Comments