AP లో ఈ పేజీ నందు ప్రస్తుతం వివరించుకోబోతున్న ప్రధాన అప్డేట్స్ ఇవే
- 1) YSR నేతన్న నేస్తం అప్డేట్
- 2) Bi-Annual
- Acknowledgement
- 3) జగనన్న అమ్మఒడి క్రొత్త G.O
- 4) YSR పెన్షన్ ఎలక్ట్రిసిటీ యాప్ అప్డేట్
- 5) జగనన్న సురక్షా కార్యక్రమం
- 6) వాలంటీర్స్ కి Consistent Rhythms App
- 7) వైస్సార్ బీమా మళ్ళీ తేదీ పొడిగింపు
Introduction
ఈ పేజీ నందు ప్రస్తుతం ఉన్న Weekly Updates Round Up అంటే ఈ వారానికి 17-06-2023 నాటి వరకు ఉన్నటువంటి క్రొత్త అప్డేట్స్ అనేవి ప్రజలకు మరియు సచివాలయ ఉద్యోగులకి,ఇటు వాలంటీర్స్ కి అందరికి ఉపయోగపడే సమచారాన్ని అందజేస్తున్నాను.కనుక ఈ Weekly Updates Round Up ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే వారం చివరలో ఒక్కసారి Munirathnam Updates వెబ్సైట్ లో Weekly Updates Round Up లో చెక్ చేస్తూ ఉండండి.ఇందులో ప్రధానంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని updates గురించి వివరిస్తూ ఉంటాను.కావున ఇందులో మీకు ఎలాంటి సందేహాలు ఉన్ననూ పేజీ చివరన Comment అనే ఆప్షన్ ద్వారా మీ సందేశాల్ని నాకు తెలుపగలరు.లేదా Direct గా నాతో మాట్లాడాలి అనుకున్నా లేదా ఈ సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు మీరు కూడా updated గా ఉండాలి అనుకుంటే ఈ క్రింది Whats app లో Join అవగలరు.
YSR నేతన్న నేస్తం అప్డేట్
ఈ 2023-24 సంవత్సరానికి సంబందించి మీ సచివాలయం పరిధిలో నేతన్న నేస్తం పథకానికి ఎవరైనా లబ్దిదారులు కొత్తగా అర్హత కలిగి వుంటే అటువంటి లబ్దిదారులు నేతన్న నేస్తం పథకానికి కొత్తగా దరఖాస్తు చేయుటకు, NBM portal లో DA / WEDPS login నందు New Application" option enable లో కలదు. కావున,, మీ సచివాలయం పరిధిలో నేతన్న నేస్తం కి New Apply చేయగలరు.
గమనిక: గత సంవత్సరం వివిధ కారణాల వలన Ineligible అయిన లబ్ధిదారులలో, ఎవరైనా అర్హత కలిగి వుంటే అటువంటి వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
New Application చివరి తేదీ: 20th June 2023.
మత్యకార భరోసా
ఈ మత్యకార భరోసా అనేది గత విడతలో డబ్బులు ఎవరెవరికి పడ్డాయో అట్టి వారికి సంబంధించి లబ్ధిదారుల దగ్గర నుండి అవును మా అకౌంట్ లోనే డబ్బులు పడ్డాయి అని బయోమెట్రిక్ వేసి,సచివాలయ ఉద్యోగి తెచ్చే రసీదు పై కూడా సంతకం చేసి BOA యాప్ లో నమోదు చేస్తారు.
2) Bi-Annual Acknowledgement
ఈ Bi-Annual Acknowledgement గత డిసెంబర్ నెలలో అంతకుముందు వరకు అన్ని రకాల సంక్షేమ పథకాలలో అర్హత ఉండి డబ్బులు పడకుండా ఉన్నాయో అలాంటివారి Bi-Annual పేరుతో ప్రభుత్వం డబ్బులు వేసింది. కనుక ఇప్పుడు BOA యాప్ లో ఆ లబ్ధిదారులనుండి అవును మా అకౌంట్ లోనే డబ్బులు పడ్డాయి అని బయోమెట్రిక్ వేసి,సచివాలయ ఉద్యోగి తెచ్చే రసీదు పై కూడా సంతకం చేసి BOA యాప్ లో నమోదు చేసుకోవాలి.
ఈ సంవత్సరం జగనన్న అమ్మఒడి కి సంబంధించి 16-06-2023 న క్రొత్త G.O విడుదల చేశారు.అందులో గత విద్యా సంవత్సరంలో పాఠశాలకు హాజరు అయిన వారికి ఈ ఆర్ధిక సంవత్సరం JUNE 28 న డబ్బులు వేయనున్నానరని తెలియజేస్తూ.. దానితోపాటు ఆ అమ్మఒడి పొందాలంటే ఈ క్రింది అర్హతలు ను పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది.
తరచూ అడిగే సందేహం - ఈ వారానికి ఇంకా అర్హుల జాబితా అయితే ఇంకా రిలీజు కాలేదు.
YSR పెన్షన్ ఎలక్ట్రిసిటీ యాప్ అప్డేట్
ఈ వైస్సార్ న్యూ పెన్షన్ లకు సంబంధించి ఈ జూన్ నెలలో క్రొత్త పెన్షన్స్ రిలీజు చేయనున్న విషయం మనకు తెలిసిందే..అందులో భాగంగా అంతకంటే ముందు సచివాలయ ఉద్యోగలకు ఒక YSR PENSION KANUKA 2.7.3 యాప్ ఇచ్చారు. అందులో పెన్షన్ కి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఎలక్ట్రిసిటీ వెరిఫికేషన్ చేయనున్నారు.ఇక్కడ వారికి స్వంత కరెంట్ మీటరు వున్నా లేకున్నా,కూడా వారు ప్రస్తుతం వాడే కరెంట్ యూనిట్లను లెక్కించి ఆ యాప్ లో పొందుపరుస్తారు.కనుక ఈ వెరిఫికేషన్ అయిన తరువాత క్రొత్త పెన్షన్ష్స్ లిస్ట్ వస్తుంది.
5) జగనన్న సురక్షా కార్యక్రమం
ఈ జగనన్న సురక్షా కార్యక్రమంని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించి ప్రతి ఇంట్లో అర్హత ఉండి ఇంకా ఏమైనా పథకాలు అందలేదా అని తెలుసుకుని వారికి కూడా వెంటనే Sanctions చేసేటట్టు ఈ కార్యక్రమంని రూపొందించారు.కనుక ఈ కార్యక్రమం ని తొలిదశలో గ్రామ సచివాలయ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు,వాలుంటీర్లు,గృహసారధులు వీళ్లందరూ ఈ జూన్ 23 నుండి జులై 23 వ తేదీ వరకు సమస్యలను జల్లెడ పట్టి సచివాలయ ఈ క్రింది చెప్పిన విధంగా నమోదు చేస్తారు.వీరిలో అర్హులైన వారికి ఆగస్ట్ 1వ తేదీన లబ్దిచేకూరుతుంది.
ఇది జగనన్నకు చెబుదాం'కి అనుబంధంగా నెల రోజుల పాటు నిర్వహణ
▪️మిగిలిపోయిన అర్హులు, సమస్యలను గుర్తించేందుకు ప్రతి ఇల్లూ జల్లెడ
▪️ ప్రతిగడపకూ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ప్రజాప్రతినిధులు, గృహ సారథుల బృందాలు
▪️వివిధ సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆరా తీయనున్న బృందాలు
▪️సమస్యలేమీ లేకుంటే కుశల ప్రశ్నలతో ఆశీస్సులు తీసుకుని మరో ఇంటికి..
▪️నిర్దేశిత తేదీల్లో సచివాలయాలకు మండల, మునిసిపల్ అధికారులు
▪️అదే రోజు సర్టిఫికెట్లు మంజూరు చేయనున్న అధికారులు
▪️జగనన్న సురక్షలో అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు ఒకటిన లబ్ది చేకూర్చేలా ఏర్పాట్లు
▪️స్పందన సమీక్షలో అధికార యంత్రాంగానికి సీఎం జగన్ దిశా నిర్దేశం
జగనన్న సురక్ష కోసం సవరించిన సమయపాలన:
దయచేసి గమనించండి - జగనన్న సురక్షకు HCM సూచనల మేరకు కొన్ని మార్పులు చేయబడుతున్నాయి
1. ఇంటింటికి స్వచ్ఛంద సందర్శన - నిన్నటి వీసీలో 20వ తేదీ నుంచి సందర్శిస్తారని చెప్పారు. ఇప్పుడు అది జూన్ 24 నుండి
2. క్యాంపుల షెడ్యూల్ - జూన్ 24 నుండి సచివాలయాల వారీగా క్యాంపుల షెడ్యూల్ ప్రారంభించాలని సూచించబడింది. కానీ ఇప్పుడు, మొదటి శిబిరం జూలై 1 నుండి ప్రారంభమవుతుంది
3. శిబిరం కోసం అవగాహన వ్యవధి - క్యాంపు కోసం అవగాహన వాస్తవ శిబిరం తేదీకి 4 రోజుల ముందు ప్రారంభించాలని ముందుగా సూచించబడింది. అయితే, ఇప్పుడు, జూన్ 24 నుండి అన్ని గృహాలకు అవగాహన ప్రారంభమవుతుంది
4. మునుపటి చర్చకు చేర్పులు: జగనన్నకు చెబుదాం - JKCలో లేవనెత్తిన ఏవైనా ఫిర్యాదులను సంబంధిత సెక్రటేరియట్ అధికారి పౌరుల ఇంటికి సందర్శించి, తీసుకున్న చర్యలను వివరించాలి.
6) వాలంటీర్స్ కి Consistent Rhythms App
ఈ Consistent Rhythms App అనేది వాలంటీర్స్ కి ఇచ్చారు.దీనిలో 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వారి యొక్క విద్య కి సంబంధించిన సర్వే ని చేపట్టనున్నారు.
Username:సచివాలయం కోడ్ + క్లస్టర్ నెంబర్
Password మీరు గతంలో పెట్టుకున్న Password సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉంటే Forgot ఆప్షన్ ద్వారా మళ్లీ Set చేసుకోవచ్చు.
వైస్సార్ బీమా మళ్ళీ తేదీ పొడిగింపు
రెన్యువల్ రైస్ కార్డులుకు eKYC పూర్తి చేయుటకు చివరి తేదీ ను జూన్ 18 వ తేదీ వరకు పొడిగించటం జరిగినది. లబ్ధిదారుల eKYC అవసరం లేకుండా WEA / WWDS వారి తరుపున eKYC తో రెన్యువల్ పూర్తి చెయ్యవచ్చు. రైస్ కార్డు లేని వారికి కూడా బీమా నమోదు కు అవకాశం.
Full Information - CLICK HERE
Nominee Change Process : Click Here
0 Comments