మీ మొబైల్ నెంబర్ కి ఎన్ని ఓటు కార్డులు లింక్ అయ్యాయో చెక్ చేసుకోండి
ఈ పేజీ లో మనం చెప్పుకోబోతున్న ప్రధాన అంశాలు
1) Introduction
2) మీ మొబైల్ నెంబర్ కి ఎన్ని ఓటు కార్డులు లింక్ అయ్యాయో చెక్ చేసుకునే విధానము
3) వేరేవాళ్ళ ఓటరు కార్డు కి మన మొబైల్ నెంబర్ లింక్ అయివుంటే ఎమీ చేయాలి ?
4) ఓటరు కార్డు కి సంబంధించిన మరిన్ని సర్వీసులు మీ కోసమే
1) Introduction (Vote Card)
కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు ఈ ఓటరు కార్డు లకు సంబంధించి చాలా సర్వీసులను అంధుబాటులోకి తెచ్చింది.అవన్నీకూడా ప్రజలే చాలా సులభంగా ఏ ఆఫీస్ ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాళ్ళ మొబైల్ లోనే పొందే అవకాశాన్ని లభించింది, కనుక అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే వెసులుబాటు ప్రజలకే ఇచ్చింది.అదేవిధంగా ఇప్పుడు మనకు ఉపయోగ పడే మరో సర్వీసు ఏమిటంటే మన మొబైల్ నెంబర్ కి మనం లింక్ చేసుకున్న ఓటు కార్డు కి కాకుండా తెలియని ఓటరు కార్డులకు ఏదైనా లింక్ అయిందేమో అని చెక్ చేసుకుని మనది కానీవి ఉంటే ఎలా తొలగించుకోవాలి కూడా చూద్దాం.ఎందుకంటే ఇలాంటి సమస్య నాకే ఎదురైంది. అంటే నాకు సంబంధం లేని ఓటరు కార్డు లకు పొరపాటున నా మొబైల్ నంబర్స్ లింక్ అయి వున్నాయి.కనుక ఈ విషయాన్నీ మీ అందరికి అవగాహన పరుస్తున్నాను.
2) మీ మొబైల్ నెంబర్ కి ఎన్ని ఓటు కార్డులు లింక్ అయ్యాయో చెక్ చేసుకునే విధానము
Step 1- ముందుగా ఈ సర్వీసుకు సంబధించిన వెబ్సైటు లింక్ ని ఈ క్రింద ఇవ్వబడింది.కనుక సిటిజన్స్ ఆ లింక్ మీద లిక్ చేసుకోవాలి.
Website Link - Click Here
Step 2 - పై లింక్ ఓపెన్ చేసుకున్నాక అక్కడ Search in Electoral Roll అనే ఆప్షన్ ని ఓపెన్ చేసుకోండి.అక్కడ ఈక్రింది ఫోటో లో మార్కింగ్ చేసిన విధంగా Search by Mobile అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Step 3 - ఇక్కడ మన వివరాలు అంటే రాష్ట్రం,మొబైల్ నెంబర్,captcha ఇచ్చాక SEND OTP పై క్లిక్ చేసుకోవాలి.ఆ తరువాత ఆ Otp ఇచ్చాక ఈ క్రింది విధంగా మన మొబైల్ నెంబర్ కి లింక్ అయిన ఓటరు కార్డు నంబర్స్ అన్ని చూపిస్తాయి.
గమనిక - ఈ విధంగా చెక్ చేసుకోవాలంటే మీ ఓటరు కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాల్సిన అవసరం లేదు.
3) వేరేవాళ్ళ ఓటరు కార్డు కి మన మొబైల్ నెంబర్ లింక్ అయివుంటే ఎమీ చేయాలి ?
ఇప్పుడు నేను నా మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకుంటే నాకు తెలియని 2 ఓటరు కార్డులకు నా మొబైల్ నెంబర్ లింక్ అయి వుంది.దీనివలన ఈ ఓటరు కార్డు దారులు ఏదైనా సిటిజెన్ సర్వీసులు పొందాలంటే ఇబ్బంది పడాల్సివస్తుంది.కనుక అలాంటి సందర్బంలో పై ఫోటో లో చూపించిన విధంగా ఎవరి ఓటరు కార్డు కి అయితే మీ మొబైల్ నెంబర్ లింక్ అయిందో దాని కెదురుగా View Details పై క్లిక్ చేసుకుంటే ఆ సంబంధిత ఓటరు కార్డు యొక్క BLO పేరు మరియు వారి మొబైల్ నెంబర్ చూపిస్తాయి. కనుక అక్కడనుండి వారిని సంప్రదించి మీ మొబైల్ నెంబర్ ని Un-link చేసుకోగలరు.
4) ఓటరు కార్డు కి సంబంధించిన మరిన్ని సర్వీసులు మీ కోసమే
Conclusion
ఈ పేజీ లో మనం మన మొబైల్ నెంబర్ కి ఎయె ఓటరు కార్డ్స్ లింక్ అయ్యాయో చెక్ చేసుకునే విధానము తెలుసుకున్నాము.అదే విధముగా ఓటు కార్డు గురుంచి మరిన్ని సర్వీసులు సిటిజెన్ యే చేసుకునేలా ఈ పేజీలో ఇవ్వడం జరిగింది కనుక వాటిని కూడా ఒకసారి తెలుసుకుని ఉపయోగించుకోండి.
0 Comments