Praja Palana Programme Full Information
ఈ పేజీ లోని ముఖ్యమైన అంశాలు
1) ప్రజా పాలన కార్యక్రమం ఉదేశ్యం ఏమిటి ?
2) ప్రజా పాలన లో ఏయే పథకాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు ?
3) ప్రజా పాలన కార్యక్రమం జరుగు విధానము ?
4) ప్రజా పాలన కార్యక్రమం యొక్క అప్లికేషన్ నమూనా మరియు PDF
5) రేషన్ కార్డ్ అప్లికేషన్ PDF
ప్రజా పాలన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం
Praja Palana - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో క్రొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపటైనప్పటి నుండి పరిపాలన అనేది జవాబుదారీతనంగా ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశ్యంతోనే తొలి అడుగగా ప్రజా సమస్యలను తెలియజేయుటకు నేరుగా ఎటువంటి షరతులు లేకుండా ప్రజా భవన్ కి వచ్చి సమస్యలును చెప్పుకునేలా కార్యరూపం దాల్చడం జరిగింది.
అక్కడకి వచ్చే సమస్యలను ప్రజలకు ఇంకా ఇబ్బంది లేకుండా ఉండాలంటే వారి గ్రామం / వార్డ్ లోకే అధికారులు వెళ్లి తెలుసునే లాగా మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలలో ముఖ్యంగా మొదటి విడతలో ఒక 5 పథకాలకు సంబంధించిన దరఖాస్తులును ప్రజల ఇళ్ల దగ్గర నుంచే నేరుగా తీసుకోవాలనే ఉద్దేశ్యం తో చేసే కార్యక్రమమే ఈ "ప్రజా పాలన కార్యక్రమం". కావున ఈ పేజీలో ప్రజా పాలన కార్యక్రమం యొక్క విధి విధానాలు మరియు వాటిని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలని చాలా వివరంగా చెప్పుకోబోతున్నాము.కనుక ఈ సమాచారాన్ని అట్టడుగున వారందరికి చెరువయ్యేలా మీవంతు కూడా ప్రయత్నం చేయగలరు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన సంక్షేమ పథకాల నూతన అప్డేట్స్ కొరకు ఈ క్రింది గ్రూప్ లలో జాయిన్ అయ్యి పొందగలరు.
Whatsapp - Join Here
Telegram Groups - Join Here
ప్రజా పాలనలో ఏయే పథకాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు..?
ప్రజల దగ్గర నుంచి ఈ క్రింది తెలువుబడిన 5 పథకాలకు సంబంధించి ఈ ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు తీసుకొనున్నారు
1) మహాలక్ష్మి పథకం - మహిళలకు నెలకు రూ.2500 నగదు బదిలీ
2) గృహజ్యోతి - రూ.500 లకే గ్యాస్ సిలిండర్
3) ఇందిరమ్మ ఇళ్ళు - అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి 5 లక్షలతో ఇంటి నిర్మాణం
4) చేయూత - ఈ పథకం నందు పింఛను రూ 4000 పొందడం కొరకు
5) రైతు భరోసా - అర్హత కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి సంవత్సరానికి రూ15 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిచడం కొరకు
ప్రజా పాలన కార్యక్రమం ఎలా జరగనుంది..?
- ఇందులో ప్రభుత్వ అధికారులు 2 టీం లుగా ఏర్పడి గ్రామాలు లేదా వార్డు లలో గ్రామ సభలు నిర్వహిస్తారు.
- ఈ కార్యక్రమం డిసెంబరు 28 వ తారీఖు నుండి జనవరి 6 వతేదీ వరకు నిర్వహిస్తారు.(డిసెంబరు 31,జవవరి1 వ తేదీన సెలవు దినం)
- ఒక్కో గ్రామంలో / వార్డు లలో 100 కుటుంబాలకు ఒక్క చోట ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ఉండి, ప్రజల దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు.అక్కడ నుండి మద్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరొక గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటారు.
- స్త్రీ,పురుషులకు విడివిడిగా కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
- ఒక్కో కుటుంబానికి ఈ 5 పథకాలలో ఎన్నింటికి అర్హులు అవతారో వాళ్ళు అన్నింటికీ కలిపి ఒకే దరఖాస్తు ఇస్తే సరిపోతుంది.
- దరఖాస్తు తీసుకున్న తర్వాత ప్రజలకు రసీదు కూడా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఉన్నాయి.
- ఈ కార్యక్రమంలో 6 గ్యారెంటీల పథకాలకే కాకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మీకు ఎలాంటి సమస్య వున్నా, అంటే రేషన్ కార్డ్,భూమి సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ కౌంటర్లు నందు దరఖాస్తు చేసుకుని రశీదు పొందవలెను.
- ఒకవేల ఈ ప్రత్యేక డ్రైవ్ లో బహుశా ప్రజలు దరఖాస్తు చేసుకోలేకపోతే నిరంతరం ఎప్పుడైనా మీ మండల రెవెన్యూ ఆఫీసులలో వెళ్లి దరఖాస్తు చేసుకుని,రసీదు కూడా పొందవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన అప్లికేషన్ లాంచింగ్ ప్రోగ్రాం లో తెలియజేశారు.
ప్రజా పాలన కి సంబంధించిన అప్లికేషను PDF Download
నమూనా
0 Comments