voter slip download ap
voter slip - VOTER SLIP అనగా ఎన్నికల కొరకు పోలింగ్ తేదీ నాడు ముందే ప్రతి ఓటరు కి అందించే స్లిప్. దీనినే Voter Information Slip (VIS) అని కూడ అంటారు.దీని సహాయంతో పోలింగ్ బూత్ వద్ద అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చును.
Voter Slip ని ఎక్కడ తీసుకోవాలి ?
ప్రతి పోలింగ్ స్టేషన్ కి సంబంధించి ఒక విభాగానికి (PART) ఎలక్షన్ కమీషన్ ఆ విభాగం లో వున్న జనాభాకి ఓటరు కార్డు కి సంబంధించిన సర్వీసులను అందిచడానికి Booth Level Officer ని నియమిస్తారు.
ఇదే విధంగా మీ B.L.O ఎన్నికలప్పుడు పోలింగ్ తేదీ కి 10 రోజుల ముందు నుండి వారి పరిధిలో వున్న ప్రతి ఒక్క ఓటరుకి ఈ Voter Slip లను అందిస్తారు.కనుక మీ B.L.O ని సంప్రదించాల్సి ఉంటుంది.
గమనిక - ఈ Voter Slip ని Online లో Download చేసుకునే వెసులుబాటు మాత్రం లేదు.
Voter Slip ఇంకా అందక పోతే ఏమి చేయాలి ?
ఇంకా కనుక మీకు Voter Slip అందకుండా ఉంటే మీరు చేయాల్సింది మీ B.L.O ని సంప్రదించాల్సి ఉంటుంది. కనుక మీకు మీ B.L.O ఎవరో తెలియదు అనుకుంటే ఈ క్రింది ఇచ్చిన link ని ఓపెన్ చేసుకుని మీ B.L.O యొక్క మొబైల్ నెంబర్ తెలుసుకోవచ్చును.తద్వారా వారికి కాల్ చేసి మీ Voter Slip ని పొందవచ్చును.
- Enter Your Polling Station & Officer అనే ఆప్షన్ ని మొదటి ఓపెన్ చేసుకోవాలి.
- అక్కడ EPIC నెంబర్ ఎంటర్ చేయాలి.అంటే ఓటర్ కార్డు నెంబర్ అని అర్ధం.
- ఆ తరువాత CAPTCHA ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.
- ఇక్క మీ B.L.O పేరు,మొబైల్ నెంబర్ వస్తుంది.కనుక అక్కడ నుండి వాళ్ళకి కాల్ చేసి Voter Slip ని తీసుకోవచ్చును.
సమస్యలను ఎన్నికల ఉన్నతాధికారులకు ఎలా తెలియపరచాలి ?
రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు వున్నా 1950 అనే నెంబర్ కి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య కాల్ చేసి తెలుపవచ్చును అని ఆఫీషియల్ వెబ్సైటు లో తెలిపివున్నారు.
Related Links
ఉచితంగా ఓటర్ కార్డు డౌన్లోడ్ - CLICK HERE
0 Comments