CCRC కార్డ్స్అంటే ఏమిటి? CCRC full form
CCRC - రెవెన్యూ శాఖ జారీ చేసే పంట సాగుదారు హక్కు పత్రం (Crop Cultivator Rights Cards) అనేది SC,ST,BC వర్గాలకు చెందినవారై ఉండి, వాళ్లకు స్వంతంగా భూమి వున్నా, లేకపోయినా మరొకరి దగ్గర భూమిని కౌలుకి ఒప్పందంతో తీసుకుని పెట్టుబడి పెట్టి పంటలు వేస్తుంటారు.అలాంటి వారినే "కౌలు రైతులు" అంటారు. అలాంటి కౌలు రైతులును కూడా ప్రభుత్వాలు గుర్తించి ఆర్ధిక సాయం చేస్తుంటారు.
also Read - తల్లికి వందనం కి సంబంధించి న్యూ G.O
CCRC వలన కలుగు లాభాలు ఏమిటి ?
ఈ CCRC కార్డ్స్ కలిగి ఉండడం వలన ఈ క్రింది ఉపయోగాలు ఉంటాయి.
- పండించే పంటను ప్రభుత్వ రికార్డులలో నమోదు చేస్తుంటారు.
- ఈ CCRC కార్డ్స్ పైన అధికారులు,రైతులకు అవగాహనా కల్పిస్తారు.
- ఈ CCRC కలిగి ఉండడం వలన ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం సంభవించినప్పుడు పంటలకు భీమాను వర్తింప చేస్తారు.
- వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్ సబ్సిడీని వర్తింప చేస్తారు.
- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటవంటి అన్నదాత సుఖీభవ మరియు PM kisan లాంటి పథకాలలో పంటలకు పెట్టుబడి సహాయాలు అందుతాయి.
- పంట రుణాలు పొందే అవకాశం కలదు.
- సబ్సిడీ తో విత్తనాలు,మందులు పొందవచ్చును.
- కనీస మద్దతు ధరతో పండించిన పంటను అమ్ముకొనుటకు ఉపయోగపడును.
ఈ CCRC కార్డ్స్ కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
How to apply for ccrc cards in telugu
- ఈ CCRC కార్డు ని VRO లాగిన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చును.
- దరఖాస్తు చేసిన రెండు లేదా మూడు రోజుల లోపు మాత్రమే ఏ కార్డ్స్ ఇస్తారు.
- ఈ CCRC కార్డు దరఖాస్తు చేయడానికి పూర్తిగా ఉచితం.
- ఈ CCRC కార్డ్స్ దరఖాస్తు అనేది ప్రతి సంవత్సరం మే నెల నుండి ఆగష్టు మధ్యలో ఇస్తారు.
- ఇందులో భూ యజమానికి మరియు కౌలుకి తీసుకున్నా వ్యక్తికి ఇద్దరికీ లాభం ఉంటుంది.తద్వారా పైన తెలిపిన ప్రభుత్వ ప్రయోజనాలు అన్నీ కూడా ఇద్దరికీ ఒకే సారి లబ్ది పొందే అవకాశం కలదు.
- ఈ CCRC పొందిన కౌలు రైతుకి ఆ భూమి పై ఎటువంటి యాజమాన్యపు హక్కులు వుండవు.కేవలం ఆ భూమిలో 11 నెలల కాలంకి లోపల కౌలుకి,పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయడం వలన ప్రభుత్వాలు ప్రభుత్వాలు అలాంటివారికి కూడా సాయం చేస్తుంటారు.
- మీ VRO లాగిన్ లో కార్డు తీసుకున్నాక ఒక కాపీ ని మీ గ్రామ రైతు సేవా కేంద్రాలలో వుండే వ్యవసాయ సహాకులకు అందజేయాలి.
ఈ CCRC కార్డ్స్ దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి?
- భూమి యజమాని పాస్ పుస్తకం జెరాక్స్
- భూమి యజమాని ఆధార్ కార్డు జెరాక్స్
- కౌలు దారుని ఆదార్ కార్డు జెరాక్స్
- కౌలు దారుని బ్యాంక్ అకౌంట్ జెరాక్స్
- కౌలు దారుని పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్
- భూ యజమాని యొక్క మొబైల్ నెంబర్
- రూ 10 రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలల కాలానికి పంట పండించుకొనుటకు ఒప్పంద పత్రం వ్రాసుకుని రావాలి.
CCRC card Application pdf download
Application PDF - DOWNLOAD
CCRC కార్డ్స్ కొరకు దరఖాస్తు విధానము PDF - CLICK HERE
CCRC New Website - CLICK HERE
రాష్ట్రం లో పండించే 18 రకాల పంటలు - Click Here
CCRC Card Status - Click Here
- ఏదైనా సలహాలకు, సమస్యలకు Contact - Click Here
- 1902 నెంబర్ కి కాల్ చేసి కూడా సందేహాలు - సమస్యలను అడగవచ్చును.
Related News
IIIT కి సంబధించి కాల్ లెటర్ డౌన్లోడ్ మరియు కౌన్సిలింగ్ విధానము
CCRC cards in telugu online
CCRC cards in telugu download
CCRC full form in agriculture
#ccrccards
0 Comments