Header Ads Widget

thalliki vandanam scheme details in telugu -2024

thalliki vandanam scheme details in telugu -2024

talliki vandanam scheme full details in telugu,talliki vandanam scheme telugu,thalliki vandanam scheme,talliki vandanam scheme,talliki vandanam scheme ap new scheme,nara lokesh about talliki vandanam scheme,tdp talliki vandanam scheme,talliki vandanam' program in all school,talliki vandanam scheme updates,talliki vandanam scheme rules,talliki vandanam scheme 2024,talliki vandanam,talliki vandanam 15000,alliki vandanam,thalliki vandanam song,‘thalliki vandanam’

 




thalliki vandanam -  ఈ రోజు మనం ఈ పేజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి అతిపెద్ద సంక్షేమ పథకం  తల్లికి వందనం.ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటివరకు సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు వస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం కానీ అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. కావున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నిన్న అంటే జూలై 10 వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ పేజీ నందు వివరించుకోబోతున్నాం.


గమనిక - తల్లికి వందనం (thalliki vandanam) పథకానికి సంబంధించి మరియు స్టూడెంట్ కిట్ సంబంధించిన విడుదల చేసిన G.O ని పేజీ చివరన ఇవ్వడం జరుగుతుంది కావున అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని వివరంగా చదువుకోగలరు.


ఇప్పుడు ఈ పేజీలో మనం thalliki vandanam పతాకానికి సంబంధించి ప్రస్తుతానికి కొన్ని విధివిధానాలను అయితే ఆ G.O లో మెన్షన్ చేయడం జరిగింది,కనుక వాటి గురించి కొంచెం వివరంగా అయితే ఈ పేజీ లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.




ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల 


1) తల్లికి వందనం కి సంబంధించి ప్రాధమిక ఆదేశాలు 

2) స్టూడెంట్ కిట్ కి సంబంధించి ఆదేశాలు

1) తల్లికి వందనం కి సంబంధించి ప్రాధమిక ఆదేశాలు (thalliki vandanam)

 

  • తల్లికి వందనం అనే పథకం ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థుల యొక్క తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు.

  • ఈ పథకానికి లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఆ విద్యార్థికి 75% హాజరు తప్పకుండా ఉండవలెను.
  • ఈ పథకం ద్వారా బడికి పంపించే తల్లులకు ఏటా 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ( గతంలో కుటుంబలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మనిషికి 15 వేల చొప్పున ఇస్తామని హామీలు ఇచ్చారు.కానీ ఈ G.O లో ప్రస్తుతానికి ఆ స్పష్టత కరువైంది.)
  • ఆ కుటుంభం దారిద్య్రరేఖకు దిగువున ఉండాలి,అంటే ఆ కుటుంబానికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండవలెను. 



ఆధార్ కార్డు తప్పనిసరి..? (thalliki vandanam)


  1.  పై రెండు పథకాలు లబ్ధి పొందాలంటే కచ్చితంగా ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. కనుక ఆధార్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని ఉండవలెను.
  2.  ఆ ఆధార్ కార్డు వచ్చే లోపు ఓటర్ కార్డు గుర్తింపు కార్డు గాని ఉపాధి పథకం కార్డు కానీ కిసాన్ పాస్బుక్ లేదా రేషన్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, పోస్ట్ ఆఫీస్ పాసు పుస్తకం, పాస్పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆ వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికార సంతకం చేసిన పత్రమైనా సరిపోతుంది లేదా మీ తాసిల్దార్ ఇచ్చే పత్రాలు కూడా మేము అనుమతిస్తాం అనేది తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆధార్ కార్డు వచ్చి అంతవరకే అని ఈ G.O లో మెన్షన్ చేయడం జరిగింది. కనుక త్వరగా మీరు చేయాల్సిందేంటంటే ఆధార్ కార్డు స్టూడెంట్ కి మరియు తల్లికి ఎవరికైతే లేదో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి అలా లేనివారికి ఇవ్వడం కుదరదు అని వాళ్ళు తెలియజేస్తున్నారు అప్పటివరకు దీని పైన తెలిపిన పత్రలను  తీసుకుంటాము అంటున్నారు.



2) స్టూడెంట్ కిట్ కి సంబంధించి ఆదేశాలు

ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుకునే పిల్లకు ఈ కిట్ ద్వారా అందించబడేటటువంటి వస్తువులు ఇవే..!

  1.  బ్యాగ్  
  2. మూడు జతల యూనిఫారం, 
  3. బెల్ట్ 
  4. ఒక జత షూలు 
  5. రెండు జతలు సాక్సులు 
  6. పాఠ్యపుస్తకాలు 
  7. నోటు పుస్తకాలు  
  8. వర్క్ బుక్కులు 
  9. ఆంగ్ల నిఘంటువు


     పైన తెలుపబడినవాటికి ఆధార్ కార్డుని ప్రామాణికంగా తీసుకోబోతున్నారు,కనుక  అది వచ్చే లోపు పైన తెలిపినటువంటి 10 డాక్యుమెంట్లు ఏదైనా ఒకటున్ననూ కూడా ప్రస్తుతానికి ఇవ్వండి, కానీ ఆధార్ కార్డుకి అయితే దరఖాస్తు చేసుకొని ఉండవలెను. అప్పటివరకు ఆ దరఖాస్తు చేసుకున్న ఆక్నాలెడ్జిమెంట్ ని కూడ జతపరచాల్సి ఉంటుంది.



Conclusion - (thalliki vandanam)

ఇక ఈ పథకానికి సంబంధించి అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా విధి విధానాలు అయితే ఇంకా రావాల్సి ఉంది, మరియుప్రజలకు చాల సందేహాలు కూడా వున్నాయి. కనుక దీనికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా వచ్చిన తర్వాత మాత్రమే తెలియజేస్తాము కావున మన YouTube Channel మరియు munirathnam updates అనే వెబ్సైటు ని ఫాలో అవుతూ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండగలరు


thalliki vandanam సంబంధించిన G.O - PDF డౌన్లోడ్ 

PDF DOWNLOAD




Post a Comment

0 Comments