Volunteer Status Checking at new method 2024
ఈ పేజీలో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామ/వార్డ్ వాలంటీర్స్ కి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకునే నూతన విధానాన్ని గురుంచి చెప్పుకుందాం.
1) ఎటువంటి వివరాలు లేకుండా వాలంటీర్ స్టేటస్ చెక్ చేసుకునే నూతన విధానము.
2) పాత పద్దతిలో వాలంటీర్ యొక్క ఆధార్ లేదా CFMS తో తెలుసుకునే విధానము.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ యొక్క భవిష్యత్ పైన ఎలాంటి భరోసా లేకపోవడం వలన చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నమాట అయితే వాస్తవం.బహుశా రాజీనామా చేయని వాలంటీర్స్ ఈ ఆగస్టు 15 పైన ప్రభుత్వం నుండి సానుకూలమైన ప్రతిపాదనవస్తుందనే ఆశతో వున్నారు.అదేవిధంగా అప్పటి అధికారిపార్టీ నాయకుల బెదిరింపులతో బలవంతంగా రాజీనామా చేయించబడిన వాలంటీర్స్ కి కూడా ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా ఆలోచించి న్యాయం చేస్తారని గంపెడు ఆశలతో అయితే ఎదురు చూస్తున్నారు.
Volunteer Status Checking - New
1) ఎటువంటి వివరాలు లేకుండా వాలంటీర్ స్టేటస్ చెక్ చేసుకునే నూతన విధానము.
దీనికి సంబంధించిన LINK ఈ క్రింద ఇవ్వబడినది.కనుక దాని మీద క్లిక్ చేసుకోగలరు.దీనిలో ఎటువంటి లాగిన్లేకుండాచెకే చేసుకోవచ్చును.
LINK - CLICK HERE
- పైన ఫోటో లో మార్క్ చేసిన దగ్గర ఈ రోజునాటి వరకు Active లో వున్న మొత్తం వాలంటీర్స్ వివరాలు చూపిస్తుంది.అంటే ఈ రోజు నాటికి 50,050 మంది మాత్రమే active వున్నారు.
- అక్కడే క్రింద మీ జిల్లాను ఎంచుకోవాలి.
- మీ జిల్లాను ఎంచుకున్నాక మీ మండలాన్ని ఎంచుకోవాలి .
- మీ మండలాన్ని ఎంచుకున్నాక మీ సచివాలయాన్నికూడా ఎంచుకోవాలి .
- మీ సచివాలయాన్ని ఎంచుకున్నాక ఈ క్రింది ఫోటో లో చూపించిన విధంగా చివరన Total Volunteers అనే అనే ఆప్షన్ దగ్గర వున్న నెంబర్ పై క్లిక్ చేసుకోవాలి.అక్కడ ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ప్రభుత్వ రికార్డులలో పేర్లు ఉన్నాయో,వారి పేర్లు మాత్రం చూపిస్తున్నాయి .
- అక్కడే చివరన 0 ఉన్నట్లయితే ఆ సచివాలయ పరిధిలో అందరూ వాలంటీర్స్ యొక్క రాజీనామాలు ఆమోదం పొందినట్టు భావించుకోవాలి.
2) Volunteer Status Checking - old method
2) పాత పద్దతిలో వాలంటీర్ యొక్క ఆధార్ లేదా CFMS తో తెలుసుకునే విధానము
- ఈ లింక్ ద్వారా వాలంటీర్ యొక్క వర్కింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఆధార్ నెంబర్ కానీ లేదా CFMS నెంబర్ కానీ తప్పక ఉండాలి.
- దీనికి సంబంధించిన లింక్ ఈ క్రింద ఇచ్చాను,చెక్ చేసుకోగలరు.
Website - Link
- పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది ఫొటోలో చూపించిన విధంగా వస్తుంది .అక్కడ వాలంటీర్ యొక్క వివరాలు ఇవ్వాలి .
గమనిక - ఆ పైన మార్క్ చేసిన దగ్గర Volunteer Status దగ్గర Working ఉంటే ఆ వాలంటీర్ ఇంకనూ ప్రభుత్వ రికార్డులలో ఉన్నట్లు బావించబడును.అదే విధంగా Volunteer Status దగ్గర Terminated అని ఉంటే,అట్టి వాలంటీర్ ప్రభుత్వ రికార్డుల నుండి అతని పేరుని తొలగించినట్లు భావించవచ్చును .
Related Links
Conclusion
ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం పొందుటకు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అయి పొందవచ్చును .
0 Comments