ఆంధ్రప్రదేశ్ లో 5 న్యూ అప్డేట్స్ - ఆగష్టు 2024
ఈ పేజీలోని ముఖ్యాంశాలు (21/8/2024)
- సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ ఫోటోలు తీసే బాధ్యతలు
- జన్మభూమి 2.0 కార్యక్రమం
- ట్రాన్సజెండర్లకు ప్రత్యేక రేషన్ కార్డ్లులు
- ఆధార్ క్యాంపులు తేదీలు మార్పు
ట్రాన్సజెండర్లకు ప్రత్యేక రేషన్ కార్డ్లులు
ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నటువంటి ట్రాన్సజెండర్ లకు ప్రత్యేకంగా రేషన్ కార్డ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయులు స్వామి గారు తెలియజేసినారు.
సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ ఫోటోలు తీసే బాధ్యతలు
సచివాలయం లో పని చేస్తున్నటువంటి వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ సెక్రెటరీ గార్లకు అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో వారానికి 2 సార్లు అనగా సోమ , గురువారాలు ఆ పాఠశాలలను సందర్శించి టాయిలెట్లు ను పరిశీలించి,ఫొటోలో తీసి పెట్టాలి. అదేవిధముగా అక్కడ ఏదైనా రిమార్కులు ఉన్నచో వారికీ ప్రత్యేకంగా ఇచ్చిన IMMS / GR app నందు ఉన్నత అధికారులకు తెలియజేయాలి.
గత ప్రభుత్వం లో ఇదే పనిని పాఠశాల ఉపాద్యాయులకు ఇచ్చారు, ఆ సమయంలో ఉపాద్యాయులు తీవ్ర అసంతృప్తి ని కూడా కనపరచడం జరిగింది.
జన్మభూమి 2.0 కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అధికారంలో వున్నా ఈ జన్మభూమి కార్యక్రమాన్ని అయితే నిర్వహించేవాళ్ళు. అదే విధంగా ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని జనవరి /2025 న జన్మభూమి 2.0 గా క్రొత్తగా ప్రవేశ పెట్టనున్నట్లు ముఖ్యంమత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసారు .
ఆధార్ క్యాంపులు తేదీలు మార్పు
ఆంధ్రప్రదేశ్ లో మీ దగ్గరలోని సచివాలయాలు,పాఠశాల,అంగన్వాడీ సెంటర్లలో ప్రజల సౌకర్యార్ధం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి ఆధార్ సర్వీసులను నిర్దేశించిన ధరలకు అందిస్తుంటారు.అందులో భాగంగానే ఈ ఆగస్ట్ 20 వ తేదీ నుండి, 24 వ తేదీ వరకు ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేసారు. కానీ ఆ తేదీలను మళ్ళీ మార్చడం జరిగినది.
కారణం - సచివాలయ సిబ్బంది చేస్తున్న ఆధార్ సర్వీసులు ఎక్కువ శాతం Online లో రిజెక్ట్ అయినా కారణంగా వాళ్లకు శిక్షణ ఇవ్వదలచి, పైన తెలిపిన క్యాంపు తేదీలలోనే ట్రైనింగ్ ఇస్తారు.ఆ తదుపరి ఆధారక్యాంప్ ల క్రొత్త తేదీలను తెలియపరుస్తారు.
ఆధార్ సర్వీసులు వాటికీ చార్జీలు గురించి - Full Details
0 Comments