pm kisan payment status -2024
PM-Kisan Payment Status 2024 – వివరాలు మరియు చెకింగ్ విధానం
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం 2024లో కూడా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ పథకం కింద, అర్హత గల రైతుల కుటుంబాలకు రూ.6,000 మూడుసార్లు సమానంగా ప్రతి సంవత్సరానికి చెల్లిస్తారు. ఈ మొత్తం రూ.2,000 చొప్పున మూడు సమానమైన భాగాలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. 2024లో 18 వ విడత లో భాగంగా అక్టోబర్ 5 వ తేదీన మహారాష్ట్రలో ఈ విడత అమౌంట్ ని ప్రధాన మంత్రి గారు విడుదల చేసారు. చెల్లింపులను చెక్ చేసుకునే విధానం ఎంతో సులభతరం చేయబడింది.
PM-Kisan పథకం యొక్క ముఖ్యాంశాలు
PM-Kisan పథకం ద్వారా రైతులకు వారికి అవసరమైన సమయాల్లో ఆర్థిక సాయం అందించటం లక్ష్యం. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి మూడుసార్లు మొత్తాలు పంపబడతాయి. ఈ సాయం రైతులు తమ సాగులో పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద ఉన్న రైతుల వివరాలను జాతీయ స్థాయి డేటాబేస్‌లో నమోదు చేయడం జరుగుతుంది.
PM-Kisan 2024 Payment Status Checking
1. అధికారిక వెబ్సైట్ : PM-Kisan పథకం చెల్లింపులు చెక్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
Payment Link - CLICK HERE
- పై లింక్ ఓపెన్ చేసుకున్న తరువాత ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది .
- అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, CAPTCHA ,OTP ఇచ్చి పేమెంట్ చెక్ చేసుకోవచ్చును.
- ఇక్కడ చాలా మందికి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే Know Your Registration no పై క్లిక్ చేసుకున్నాక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ లేదా ఆధార్ కార్డు నెంబర్ కానీ తద్వారా వచ్చే OTP ఎంటర్ చేసి Registration Number తెలుసుకోవచ్చును.
- ఆ నెంబర్ తెలుసుకున్నాక మళ్ళీ పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకుని రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయగా OTP వస్తుంది , ఆ తరువాత ఈ క్రింద చూపించిన విధంగా పేమెంట్ ఏ బ్యాంకులో , ఏ తేదీన జమ అయిందో అక్కడ చూడవచ్చును . ఒకేవేళ అక్కడ పేమెంట్ ఫెయిల్ అయితే దానికి గల కారణాలను Reason for failed transaction / FTO అనే ఆప్షన్ దగ్గర చూపిస్తుంది . కావున అలాంటి వాళ్ళు మీ దగ్గర్లోని అగ్రికల్చరల్ ఆఫీస్ కి వెళ్లి కలవాల్సి ఉంటుంది.
Pm Kisan డబ్బులు పడకపోవడానికి గల కారణాలు?
మీ చెల్లింపు రావడం ఆలస్యం అవుతుంటే, అనేక కారణాలు ఉండవచ్చు.
- వివరాల్లో పొరపాట్ల: మీ ఆధార్ లేదా బ్యాంక్ వివరాలు తప్పుగా ఉన్నాయా లేదా అప్‌డేట్ చేయకపోవడం వల్ల చెల్లింపు నిలిపివేయబడవచ్చు.
- కేవైసీ పూర్తి చేయకపోవడం: రైతులు వారి ఖాతాల కేవైసీ పూర్తి చేయకపోతే కూడా చెల్లింపులు నిలిపివేయబడే అవకాశం ఉంది.
-NPCI Link - మీ బ్యాంక్ అకౌంట్ ఏ ఆధార్ కే లింక్ కాకపోవడం వలన కూడా అర్హుల జాబితాలో ఉనన్నూ డబులు పడకపోవచ్చును .
కేవైసీ ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?
మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం:
- వెబ్‌సైట్‌లోని ‘Farmer’s Corner’లోని ‘e-KYC’ ఆప్షన్ పై క్లిక్ చేసి, మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్
ఎటువంటి సమస్యలు వచ్చినా, మీరు PM-Kisan టోల్ ఫ్రీ నంబర్ 155261 లేదా 1800-115-526 ద్వారా కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు.
0 Comments