Chandranna bima Details - 2024
గమనిక - ఈ పేజీలో ఇచ్చే Chandranna Bima సమాచారం పూర్తిగా ఈనాడు పేపర్ లో వేసిన సమాచారం ఆధారంగానే ఇవ్వబడుతుంది.కానీ ప్రభుత్వం అధికారిక G.O విడుదల చేసిన తరువాత మన YouTube ఛానల్ నందు వివరంగా తెలియజేస్తాను.
ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయనున్న Chandranna Bima పతకం -2024 గురించి అధికారుల కమిటీ ప్రతిపాదనను వివరంగా చెప్పుకుందాం. కానీ ఇది ప్రతిపాదన మాత్రమే,ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రిగారు పరిగణలోకి తీసుకుని కొంచెం మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదు.
ఈ బీమా కి ఎవరు అర్హులు ?
అధికారుల కమిటీ నివేదికలో వున్న సమాచారమని ఈనాడు పేపర్లో వేసిన సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో దారిద్యరేఖకు దిగువున వున్న 1.21 కోట్ల కుటుంబాలకు వర్తింపజేయనున్నట్లు సమాచారం. అంటే తద్వారా 1.21 కోట్ల కుటుంబాలలో 3.07 కోట్ల మంది సభ్యులకు Chandranna Bima ప్రయోజనం కలిగేలా ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే రేషన్ కార్డు వున్న పేదలందరికీ వర్తింపజేయనున్నారు.
ఈ Chandranna Bima లో ఎంత వయస్సు వరకు తీసుకుంటారు ?
ఈ చంద్రన్న బీమా లో కుటుంభంలో సంపాదనపరుడికే కాకుండా కుటుంబంలో 18 నుండి 70 సంవత్సరాల వయస్సు వారికందరికి ఈ Chandranna Bima లబ్ది చేకూరనుంది.
Chandranna Bima లో ఎంత ఇన్సురెన్స్ డబ్బులు వస్తాయి ?
ఈ Chandranna Bima పైన తెలిపిన వయస్సు ప్రామాణికంగా సహజ మరణానికి - 2 లక్షలు ఇవ్వనున్నారు, అదేవిధముగా ప్రమాద వశాత్తు మరణిస్తే -10 లక్షలు వర్తింపజేయనున్నట్లు పత్రికలో ఇచ్చిన సమాచారం.
ఈ Chandranna Bima పథకం ద్వారా ఎంత ఖర్చు కానున్నది ?
ఈ Chandranna Bima పథకానికి పైన తెలిపిన వయస్సు ప్రామాణికంగా తీసుకుని ఈ భీమా ని వర్తింప జేస్తే గత సంవత్సరాల మరణాల ఆధారంగా డేటా ప్రకారం అయితే సంవత్సరానికి 2,800 కోట్లు ఖర్చు అవుతుతోందని అంచానా వేయడం జరుతుగుతుంది.
Chandranna Bima కి ysr బీమా కి మధ్య తేడా ఏమిటి ?
- వైస్సార్ బీమా నందు కుటుంభంలో సంపాదించే వ్యక్తికి మాత్రమే బీమా సౌకర్యం ఉండేది. కానీ ఇప్పడు Chandranna Bima లో కుటుంబంలో సంపాదన పరుడికే కాకుండా వయస్సు 18 నుండి 70 సంవత్సరాల వయస్సు వున్న వారందరికీ వర్తింపజేయనున్నారు .
- వైస్సార్ బీమా నందు భీమా చేసుకున్న వ్యక్తి వయస్సు 50 సంవత్సరాలు దాటితే సహజ మరణానికి ఇచ్చే లబ్ది అందేది కాదు, కేవలం 50 దాటిన వారికి ప్రమాద బీమా మాత్రమే వర్తించేది. కానీ ఇప్పుడు చంద్రన్న బీమాలో వయస్సు 18 నుండి 70 సంవత్సరాల లోపు వారందరికీ కూడ సహజ మరణానికి ఈ చంద్రన్న బీమా వర్తింప జేయనున్నారు.
- వైస్సార్ బీమాలో సహజ మరణానికి 1 లక్ష రూపాయలు, ప్రమాద మరణానికి 5 లక్షల బీమా వర్తించింది. ఇప్పడు Chandranna Bima నందు సహజ మరణానికి బీమా సొమ్ము 2 లక్షలు అదేవిధంగా ప్రమాద బీమాకి 10 లక్షలు లబ్ది చేకూర్చేటట్లు అధికారుల కమిటీ నివేదికలో ఉన్నట్లు ఈనాడు దినపత్రికలో వేయడం జరిగింది.
ఈ Chandranna Bima పథకానికి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి ?
ఈ చంద్రన్న బీమా లో లబ్ది పొందడానికి అధికారికంగా కావాల్సిన పత్రాల వివరాలును ఈ అక్టోబర్ 16 వ తేదీ నాటికీ వరకు అయితే తెలుపలేదు.
- కానీ వారు పరిగణలోకి తీసుకునే అంశాలను మనం నిశితంగా పరిశీలిస్తే దారిద్ర్యరేఖకు దిగువ కుటుంబాలకి వర్తింపజేస్తాము అంటున్నారు అంటే రేషన్ కార్డు తప్పకుండ ఉండాలి.
- ఇక వయస్సు ప్రమాకికంగా ఆధార్ కార్డు అడగవచ్చును .
- డబ్బులు వేయడానికి నామినీ యొక్క బ్యాంక్ వివరాలు అడగవచ్చును .
- పాలసీదారుడి పై ప్రభుత్వమే ఇన్సురన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించాలి అంటే మాత్రం పాలసీదారుని బ్యాంక్ ఖాతా కూడా అడగవచ్చును .
- అప్లికేషన్
- మరణ ధ్రువీకరణ పత్రం
ఈ చంద్రన్న పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
ఈ Chandranna Bima పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం అనేది ఇంకా ఎక్కడ ఇవ్వలేదు, బహుశా మీ హాబిటేషన్ లో వున్న సచివాలయాలల్లోనే ఇచ్చే అవకాశాలు ఎక్కువుగా వున్నాయి.
How To Check Chandranna Bima Status
- పై లింక్ ఓపెన్ చేసుకున్న తరువాత మీరు దరఖాస్తు చేసుకున్న ఆర్ధిక సంవత్సరంని సెలెక్ట్ చేసుకుని అక్కడ పాలసీ దారుని ఆధార్ నెంబర్ లేదా రైస్ కార్డు నుంబర్ లేదా కుటుంభం సభ్యుల పేరుతో కూడా చెక్ చేసుకోవచ్చును .
- అక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చూపిస్తుంది .
Conclusion (Chandranna Bima)
ఈ పేజీలో మనం తెలిపి Chandranna Bima సమాచారం పూర్తిగా ఈనాడు దినపత్రిక లో వేసిన సమాచారాన్ని ఆధారంగా మాత్రమే చెప్పుకున్నాము.ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము అంటే ఈ పేపర్ అనుభవము గల దిన పత్రిక మరియు అందరూ అనుకున్న విధంగానే టీడిపి పార్టీకి అనుకూల పత్రికగా,కొంచెం దగ్గరగా లీకులు పొందే అవకాశం ఉంటుంది కనుక మనం కూడా నమ్మి ఈ ఆర్టికల్ వ్రాయడం అయితే జరుగుతుంది.
ఈ Chandranna Bima పథకం 2024 లో అధికారిక ప్రకటన వచ్చాక మరిన్ని వివరాలను మన యూట్యూబ్ ఛానల్ నందు మరియు ఈ మునిరత్నం అప్డేట్స్ వెబ్సైటు నందు కేటగిరీ లో ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది.
0 Comments