నమో యువ 3K రన్ లో పాల్గొన్న కోలా ఆనంద్
శ్రీకాళహస్తి, MR News Telugu :
తిరుపతి పట్టణంలో నమో యువ 3కె రన్ ఘనంగా నిర్వహించారు. డ్రగ్స్ రహిత భారతదేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, బీజేపీ సంఘటనా మంత్రి మధుకర్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సునీల్, శాప్ చైర్మన్ అనిమిని రవి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా, పౌష్టిక అభియాన్ కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. నేటి యువత అన్ని రంగాలలో రాణించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరమని సూచించారు.
0 Comments