Header Ads Widget

శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో విషాదం – చిన్నారి మృతి

 శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో విషాదం – చిన్నారి మృతి



శ్రీకాళహస్తి, MR News Telugu:


     శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఆరుగురు చిన్నారులు ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో స్వర్ణముఖి నదిలో ఈత కొడుతుండగా దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా షేక్.హరూన్ (8), గుణ (14), కార్తీక్ (12), అనిల్ (11) తో పాటు మరో ఇద్దరు గుర్తు తెలియని పిల్లలు కలిసి మొత్తం ఆరుగురు కలిసి ఈతకు దిగారని, ఈ క్రమంలో షేక్.హరూన్, గుణ అనే బాలలు నదిలో పెరిగిన ప్రవాహానికి కొట్టుకుపోయారు. వారిని చూసి మిగతా పిల్లలు భయంతో కేకలు వేయగా, అక్కడే ఉన్న మున్సిపాలిటీ శానిటరీ కార్మికుడు అరుణ్ వెంటనే స్పందించి నీటిలోకి దూకి హరూన్‌ను బయటకు తీశాడన్నారు. అయితే అప్పటికే షేక్.హరూన్ అపస్మారక స్థితిలో ఉండడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి షేక్. హరూన్ మృతి చెందాడని ప్రకటించారు. ఇక గల్లంతైన వాళ్లలో ఎల్.గుణ (14) తండ్రి రామచంద్రారెడ్డి, తల్లి పల్లెరెడ్డి ముత్యాలమ్మ గుడి వీధి, దోబి ఘాట్ సచివాలయం పరిధిలో నివాసులు అని పోలీసులు తెలిపారు. అయితే గల్లంతు అయిన అతడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.ఈ ఘటనపై శ్రీకాళహస్తి పట్టణం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మున్సిపల్ సిబ్బంది మాట్లాడిన వీడియో





Post a Comment

0 Comments