APSRTC లో అప్రెంటీస్ ఉద్యోగాలు -2025
ఈ పేజీలో వివరించిన ముఖ్యాంశాలు
- గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు
- విద్యార్హత
- దరఖాస్తు విధానము
- Website Link
- దరఖాస్తుకు ఫీజు
- వయస్సు, జీతం
- సమర్పించాల్సిన డాకుమెంట్స్
- సర్టిఫికెట్లు పంపాల్సిన చిరునామా
- నోటిఫికేషన్ PDF
- ఇంటర్వూ
- సందేహాలకు అధికారి మొబైల్ నెంబర్
Introduction: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (APSRTC) నుండి అప్రెంటీస్ లో నెల్లూరు జోన్ క్రింద వచ్చే 4 జిల్లాలలోని డిపోలలో ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. కావున దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ పేజీలో వివరించడం జరుగుతుంది.
అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ వెలువడిన తేదీ - 16-09-2025
- దరఖాస్తుకు ప్రారంభ తేదీ - 17-09-2025
- దరఖాస్తుకు చివరి తేదీ - 04-10-2025
- డాకుమెంట్స్ సమర్పణకి చివరి తేదీ - 06-10-2025 (దీనిపైన పంపితే అనుమతించబడవు)
విద్యార్హత APSRTC
ITI ఉత్తీర్ణత అయిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఇక్కడ చూపించిన జిల్లాలు వాళ్లే కాకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా ఈ జిల్లాల వాళ్ళు మాత్రమే అని ఎక్కడా యివ్వలేదు.
జిల్లాల వారీగా వున్న ట్రేడ్స్ / ఖాళీలు
దరఖాస్తు విధానము APSRTC
ఆసక్తి వున్న అభ్యర్థులు ముందుగా ఈ క్రింది వెబ్సైటులో Online లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Website - Click Here
Login - Click Here
Notification PDF - DOWNLOAD
దరఖాస్తుకు ఫీజు APSRTC
ఈ అప్రెంటీస్ దరఖాస్తు చేసుకున్నాక వెరిఫికేషన్ సమయాన - రూ118 లు చెల్లించాలి.
మరిన్ని వివరాలకు ఈ You tube ఛానల్ లో వివరించడం జరిగినది.
- Online దరఖాస్తు చేసుకోవాలంటే సంప్రదించగలరు - Cell - 9700565505
- మరిన్ని ఉద్యోగ సమాచారాలు కొరకు Watsapp Group - JOIN
వయస్సు APSRTC
ఈ APSRTC అప్రెంటీస్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ నందు ఎక్కడ కూడా వయస్సు తెలియజేయలేదు.
జీతం APSRTC
అప్రెంటీస్ లో ఎంపిక అయిన వారికి ముందుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా కాలంలో నెలకు స్టైఫండ్ రూపంలో ఇస్తారు, ఆ స్టైఫండ్ ఎంత అనే విషయం కూడా నోటిఫికేషన్ లో అయితే ఇవ్వలేదు. కానీ స్థానిక APSRTC డిపోలో అడిగి తెలుసుకున్న సమాచారం మాత్రం 8 వేల నుండి 10 వేల లోపు ఉండచ్చు అన్నారు. కానీ ఎంపికైన తరువాత అధికారికంగా అభ్యర్థులకు ఎంతనే విషయం తెలియజేస్తారు అన్నారు.
సమర్పించాల్సిన డాకుమెంట్స్ (Xerox )
- Online లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ప్రొఫైల్
- Apprenticeship Registration నెంబర్ (ARN)
- SSC మార్క్ లిస్ట్
- ITI మార్కులు
- NCVT సర్టిఫికెట్
- క్యాస్ట్ సర్టిఫికెట్ - SC/ST/BC వాళ్ళు 6 నెలల లోపు తెచ్చుకుని ఉండాలి.
- వికలాంగులైతే ధ్రువీకరణ సర్టిఫికెట్
- NCC మరియు Sports సర్టిఫికెట్లు ఉన్నచో
- ఆధార్ కార్డు
- RESUME (నోటిఫికేషన్ చివరి పేజీలో వుంది )
సర్టిఫికెట్లు పంపాల్సిన చిరునామా
ఇంటర్వూ
Conclusion
APSRTC లో అప్రెంటీస్ కి దరఖాస్తు చేసేటప్పుడు గానీ, లేదా నోటిఫికేషన్ కి సంబంధించిన గానీ సందేహాలు వున్నచో Cell - 9154291408 నెంబర్ కి ఆఫీస్ పని వేళలో (10.30AM నుండి 5.00 PM ) సంప్రదించవచ్చును.
లేదా మరిన్ని సందేహాలు వున్నచో మీ దగ్గర్లోని RTC డిపో మేనేజర్ ని సంప్రదించగలరు.
0 Comments