శ్రీకాళహస్తి పోలీసులకు రైన్ కోట్స్ వితరణ
MR News Telugu:
(రిపోర్టర్ - మద్దిమడుగు మునిరత్నం)
శ్రీకాళహస్తిలో యంగ్ ఎంప్లాయిస్ సోషల్ సర్వీస్ (YESS) వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం పట్టణం లోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందికి వర్షాకాలంలో ట్రాఫిక్ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన రైన్ కోట్స్ (జర్కిన్లు) మరియు 30 లాఠీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో వర్షం, ఎండ, పండుగలు, విపత్తులు ఏవైనా సరే ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలు అందిస్తున్నారని, కావున వారి అంకితభావం అభినందనీయమైనది” అని కొనియాడారు. ఇదివరకు నుండే పోలీస్ సిబ్బందికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే మా స్వచ్ఛంద సేవా సంస్థ గతంలో కూడా ట్రాఫిక్ సిబ్బందికి హెల్మెట్లు, రేడియం జాకెట్లు, లైటింగ్ బాటెన్స్ వంటి సామగ్రిని అందించామని గుర్తు చేసుకున్నారు. అదేవిదంగా పోలీస్ అధికారులు కూడ మాట్లాడుతూ, YESS వంటి సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి మాకు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమైనది. ఇలాంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో మరింత బలాన్ని ఇస్తాయి” అని పేర్కొన్నారు.
0 Comments