ఆర్టీసీ బస్సు ఢీ - డెలివరీ బాయ్ మృతి
MR News Telugu
శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 22 : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ముని రెడ్డి (55) శ్రీకాళహస్తిలో గత 12 ఏళ్లుగా నివాసం ఉంటూ ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ మరోవైపు డెలివరీ బాయ్ గా పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు.విధుల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని అమర జ్యోతి కళ్యాణమండపం ఎదురుగా రాత్రి 10:50 - 11:00 నిమిషాల సమయంలో ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి తన ద్విచక్ర వాహనం లో ఎస్కే ఫుడ్ రెస్టారెంట్ కి క్రాస్ చేసే సమయంలో గూడూరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో మునిరెడ్డి కి తీవ్ర గాయాలైనాయి.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
0 Comments