Header Ads Widget

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో డయేరియా విలయ తాండవం అంటున్న మాజీ ఎమ్మెల్యే

వార్త 1 - MR NEWS TELUGU - 03-09-2025

శ్రీకాళహస్తిలో డయేరియా విలయతాండవం - మాజీ MLA బియ్యపు మధుసూదన రెడ్డి


కూటమి ప్రభుత్వ వైఫల్యంపై, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం.

• రేణిగుంట మండలం గుత్తి వారి పల్లెలో విచ్చలవిడిగా డయేరియా కేసులు నమోదు 

• పారిశుద్ధ్య లోపంతోనే డయేరియా వ్యాప్తి.


శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని, రేణిగుంట మండలం గుత్తి వారి పల్లి గ్రామంలో ఇప్పటివరకు 70 మంది గ్రామస్తులకు డయేరియా వ్యాధి వ్యాప్తి చెందింది అందులో ఒకరు మృతి చెందారు.కావున బాలాజీ హాస్పిటల్ నందు వైద్యం పొందుతున్న గ్రామస్తులను బుధవారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వయంగా హాస్పటల్ కు విచ్చేసి వారి ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను అభ్యర్థించారు.


ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వల్లే డయేరియా వ్యాధి వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు. గతంలో మీ ఇంటికే డాక్టర్ వంటి విన్నూతన కార్యక్రమాలను వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించే వాళ్ళని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఇంటికి డాక్టర్, సిహెచ్ఓ, ఏఎన్ఎం, ఆషా వర్కర్లు వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ రికార్డులలో ఆరోగ్య సమస్యలను నమోదు చేసేవారని, కానీ నేడు ఆంధ్ర రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ఎక్కడ చూసినా విష జ్వరాలు ఆరోగ్య సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమలరెడ్డి, సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, గంగారి రమేష్,శ్రీను, ప్రభాకర్,గంగయ్య,గణేష్ రెడ్డి, గుణ శేఖర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి,నగేష్,రఫీ ఉల్లా,మంజుల,ముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


వార్త 2 - MR NEWS TELUGU 

రైతులే ఆర్థిక రంగానికి బలమంటున్న - బీమాల భాస్కర్ ముదిరాజ్ 



శ్రీకాళహస్తి - విశ్వంలోని ప్రతీ జీవికి ఆయువును అందిస్తూ, తమ శక్తియుక్తులను ధారపోసి ప్రకృతిని కాపాడుకుంటూ అటు ఆహార ధాన్యాలను, ఇటు వృక్ష సంపదను ఉత్పత్తి చేసే రైతులే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలం అని తంగేళ్ళ పాలెం, పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్ పేర్కొన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు అమాస రాజశేఖర్ రెడ్డిని చిత్తూరు లోని వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేసి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000 ఆర్థిక భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కేంద్రం సాయంతో అన్నదాత సుఖీభవ నిధులు ఒక్కో రైతుకు రూ.7,000 తొలి విడతగా నేడు విడుదల చేయనుండటం రైతులకు భరోసా కలిగించే అంశమని హర్షం వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ జెండా లోనే నాగలి గుర్తును పొందుపరిచారని, మన ప్రతి అజెండా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుందని, అన్నదాత తోనే దేశ ప్రగతి సాధ్యం అని నమ్మిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. కాయ కష్టం చేసి పండించిన తమ పంటలను ప్రభుత్వం సేకరించి, వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తే, వాటి కోసం రైతులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితిని గత వైసిపి ప్రభుత్వం తీసుకొని వచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, తొట్టంబేడు మండల యువజన విభాగం అధ్యక్షుడు చంద్రబాబు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ అధికారి చిరంజీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వార్త 3 - MR NEWS TELUGU 

శ్రీకాళహస్తి మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇన్చార్జిలతో సమావేశమైన బొజ్జల సుదీర్ రెడ్డి 


శ్రీకాళహస్తి పట్టణం పంచాయతీ రాజ్ అతిధి గృహం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇన్చార్జిలతో సమావేశమై నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు మరియు గ్రామాలు,వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని పలు సూచనల్లో చేసిన శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి పట్టణం నందు తెలుగుగంగ అతిథి గృహాన్ని పరిశీలించిన శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి


శ్రీకాళహస్తి నియోజకవర్గం లో విద్యాలయ పాఠశాలను ప్రారంభించడానికి తాత్కాలిక భవనం పరిశీలనలో భాగంగా శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ అతిథి గృహాన్ని పరిశీలించి పాఠశాలకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అని ప్రజల నుంచి వినతులు స్వీకరించి మరియు భవన ఫిట్నెస్ను పరిశీలించాలని అధికారులకు సూచనలు చేశారు.

వార్త 4 - MR NEWS TELUGU 

గుత్తివారి పల్లి బాధితులను పరామర్శించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి  



రేణిగుంట మండలం గుత్తి వారి పల్లి లో కలుషిత నీరు త్రాగడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, పంచాయతీ అధికారులను వెంటనే గుత్తి వారి పల్లె నందు పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి వ్యవస్థలను మెరుగుపరచాలని అలానే ఆర్వో ప్లాంట్ వాటర్ ను పరీక్ష చేసి దానికి ప్రత్యామ్నాయ త్రాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు

Post a Comment

0 Comments