Header Ads Widget

Ysrcp కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్

వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ 


MR News Telugu:

    వైస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 24 వతేదీ ఉదయం 10:30 గంటలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో కీలక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో YSRCP Digital Book, జగనన్న 2.0 ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముఖ్యంగా వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలను ఆమానుషంగా, అకారణంగా ఇబ్బందులు పెడుతున్న వారి వివరాలతో  YSRCP Digital Book ద్వారా ఏ స్థాయిలో వున్న నాయకులు మరియు కార్యకర్తలు మీ ఫోన్ లోనే ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందులో వచ్చే ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే, అన్యాయం చేసిన వారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. ఇది YSRCP సూత్ర సిద్ధాంతాలను ప్రతిబింబించే విషయమన్నారు. ప్రజలకు న్యాయం చేయడం, నిజాయితీగా పాలన అందించడం, అవినీతిని అరికట్టడం పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు.


 ఈ డిజిటల్ బుక్ అనేది పార్టీ కార్యకర్తలకు ఒక మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ఈ డిజిటల్ బుక్ లాంచ్‌తో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లైంది. ప్రజలు, కార్యకర్తలు మధ్య బంధాన్ని బలపరచడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

🔗 ఫిర్యాదు Link

https://db.weysrcp.com/


ఈ సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.


VIDEO 





Post a Comment

0 Comments