పవన్ కళ్యాణ్ ని కలిసిన కొట్టే సాయి ప్రసాద్
శ్రీకాళహస్తి, MR News :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొత్తగా ఎంపికైన కొట్టే సాయి ప్రసాద్ మర్యాదపూర్వకంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి, శ్రీకాళహస్తీశ్వర తీర్థప్రసాదాలును అందజేశారు. ఈ భేటీ అనంతరం కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ, పవిత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఒక సామాన్య కార్యకర్త అయిన నన్ను నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లు తెలియజేసారు. అదేవిదంగా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పరిరక్షణ, పారదర్శకతతో కూడిన పాలనకు కట్టుబడి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. అలాగే, భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సౌకర్యాల విస్తరణ, ఆలయ పునరుద్ధరణ, పూజా కార్యక్రమాల మరింత శ్రద్ధ, సిబ్బంది సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
0 Comments