మంత్రి నాదెండ్ల మనోహర్ ని కలసిన కొట్టే సాయి
శ్రీకాళహస్తి, MR News:
శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్‌గా ఎంపికైన జనసేన పార్టీ కి చెందిన కొట్టే సాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలసి, శ్రీకాళహస్తీశ్వర తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ ని కూడ కలసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ పెద్దలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ మాధవ మహేష్ కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
0 Comments