సీఐటీయూ ప్రాంతీయ కమిటీ ఎన్నిక
MR News
శ్రీకాళహస్తి - సీఐటీయూ శ్రీకాళహస్తి ప్రాంతీయ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శ్రీకాళాహస్తి తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల సీఐటీయూ సంయుక్త మహా సభలు జరిగాయి. ఈ సభల సందర్భంగా ప్రాంతీయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొప్పల గురునాధం, ప్రధాన కార్యదర్శిగా పెనగడం గురవయ్య, కోశాధికారిగా రేవతితో పాటు మరో 15 మందిని సభ్యులుగా ఎన్నికయ్యారు. శ్రీకాళహస్తి ప్రాంతంలోని కార్మిక, కర్షకుల సమసస్యలపై నూతన కమిటీ అలుపెరగని పోరాటం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జీ.బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments