రాష్ట్రంలో సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అయింది
శ్రీకాళహస్తి, MR News:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీల్లో భాగంగా ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సఫలీకృతులయ్యారని తద్వారా ప్రజలకు మరింత చేరువైందుకు సూపర్ సిక్స్ పథకాలు దోహదపడ్డాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సలహా మండలి సభ్యుడు ఎం సుబ్బయ్య అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అనంతపురంలో సంయుక్తంగా నిర్వహించిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అనే కార్యక్రమం విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఇదే పంతాలో కూడా సూపర్ సిక్స్ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేసి మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి కృషి చేస్తున్నారని చెప్పారు. అయితే కొంతమంది వైసీపీ నేతలు ప్రజల్లో రైతుల్లో ఆందోళరేకితించే రీతిలో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఎరువుల సరఫరా చేయడం లేదంటూ తాజాగా వైస్ సిపి నాయకులు పోరుబాట పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం తగదన్నారు. రైతాంగానికి అవసరమైన యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని వైసిపి నేతల బురిడీ మాటల నమ్మే స్థితిలో ప్రజలు, రైతులు లేరన్నారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.


0 Comments