ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఆహ్వానించిన కొట్టే సాయి ప్రసాద్
MR News Telugu
శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి నూతన చైర్మన్‌గా నియమితులైన జనసేన నాయకులు కొట్టే సాయి ప్రసాద్ గురువారం ఉదయం తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్, శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి బాధ్యతలు స్వీకరించనున్న ఈ నెల 26 వ తేదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సాయి ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన దేవస్థాన అభివృద్ధి కోసం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన కార్యకర్తలు, దేవస్థానం అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
0 Comments