PM Kisan Eligible List Download -2022
Eligible List Download 2022
ఈ పేజీ లో ప్రధానంగా ఈ క్రింది అంశాలు వివరించడం జరిగింది.
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన : కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులందరికి పెట్టుబడి సాయం క్రింద ఒక సంవత్సరానికి రూ 6000 వేల రూపాయలను 3 వాయిదాలలో రైతుల ఖాతాలోకి వేస్తూ వుంటారు.అందులో భాగంగానే ఇప్పటివరకు 10 విడతలుగా రూ.2000 వేలు చొప్పున వేయడం జరిగింది. ఇప్పుడు 11 విడతగా మే-31వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.దీనికి గానూ దేశవ్యాప్తంగా 10 కోట్లమందికి పైగా రైతులకు 21 వేల కోట్లువేయనున్నారు.
మీ వ్యవసాయ భూమి యొక్క ఆడంగల్,1B ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా..?
Adangal, 1B Download |
e-KYC కి తేదీ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు కూడా వారి ఆధార్ అంతేంటికేషన్ ఖచ్చితంగా ఉండాలి అనే నిబంధన పెడుతూ వచ్చారు.దీనికి గానూ ఈ నెల అంటే మే-31 వరకు అవకాశం ఉంది అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు e KYC ని 41% మాత్రమే చేసుకుని వున్నారు. ఇంకా 59% చేసుకోలేక పోవడం వలన దీనికి గానూ మళ్లీ తేదీ పొడిగించి జులై 31,2022 వరకు అవకాశం ఇచ్చి వున్నారు.కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లబ్ది పొందగలరు.
Ekyc మనమే మన ఫోన్ లొనే సులభంగా చేసుకోవాలంటే ఈ క్రింది పేజీ లో ఇచ్చిన లింక్ ఆధారంగా చేసుకోవచ్చు
EKYC LINK |
కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అధికారిక సమాచారం
రైతు భరోసా & PM కిసాన్ మధ్య తేడా ఏమిటి..?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు రైతులకు పంట వేసే సమయంలో ఉచితంగా రూ.12,500 ఆర్ధిక సాయాన్ని చేస్తామని చెప్పారు.కానీ కొన్నాళ్లకు ఆ రైతులకు ఎంత చేసినా తక్కువే అని భావించి మరో వెయ్యి రూపాయలు పెంచి సంవత్సరానికి రూ 13,500/-లుగా ఇవ్వడం జరుగుతుంది. దీనిని 3 వాయిదాలలో ఆ రైతుల యొక్క ఖాతాలలో వేయడం DBT పద్ధతి ద్వారా డబ్బులును జమ చేయడం జరుగుతుంది.
పైన చెప్పిన రూ.13,500/- లలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా రూ 7500 /- లుగా ఉంటుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ PM కిసాన్ లో రూ 6,000/-లు కూడా కలసి మొత్తం మీద రూ 13,500 లను రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతూవుంటుంది.ఇందులో ఈ మే నెలలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రైతుకు మొదటి విడత క్రింద రూ.5,500/- లు వేయడం జరిగింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్ధిక సంవత్సరరానికి మొదట విడత క్రింద రూ 2 వేల రూపాయలు ను MAY 31,2022 న వేయనున్నారు.
ఆ తర్వాత అక్టోబర్ మాసం లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 2 వేలు వేయనున్నారు.అంతిటితో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతతో కలుపుకుని రూ 7,500 లు ఇచ్చినట్టు అవుతుంది.అదే నెలలోనే పీఎం కిసాన్ ద్వారా రెండవ విడత క్రింద మరో 2 వేలు వేస్తారు.ఆ తరువాత ఈ పీఎం కిసాన్ ద్వారానే మూడో విడత క్రింద జనవరి లో మరో 2 వేలు వేస్తారు.ఈ విధంగా మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రూ.6000, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ 7,500 లు వేస్తారు.ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి.
NPCI కి లింక్ అయిందా లేదా ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు
NPCI Link |
పీఎం కిసాన్ అర్హుల లిస్ట్ విడుదల -2022
దీనికి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
Eligible list |
మొట్టమొదటగా పై లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ రాష్ట్రం,జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామము ఇలా మీ వివరాలు ఇచ్చి,Get Report పై క్లిక్ చేయండి.
గమనిక : ఈ వెబ్సైట్ ఎక్కువగా Error అని ఈ క్రింది విధంగా చూపిస్తూ ఉంటుంది. అయినా మళ్లీ, మళ్లీ ప్రయత్నం చేస్తూవుంటే ఓపెన్ అయిపోతుంది.
STEP 2 : ఈ పేజీ లో ఈ సంవత్సరానికి సంబంధించిన అర్హుల లిస్ట్ రావడం జరుగుతుంది. మొదట ఈ పేజీ లో 50 పేర్లు మాత్రమే కనిపిస్తాయి.
STEP 3 : ఇదే పేజీలోనే చివరన 1,2,3,4... ఈ విధంగా చూపిస్తాయి.అంటే ఇంకా అన్ని పేజీ లలో వివరాలు ఉన్నాయి అని అర్థం. కాబట్టి ప్రతి పేజీ లో క్షుణ్ణంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ లో డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకునే విధానం
PHOTO
మరిన్ని ప్రభుత్వ పరమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలి. అనుకుంటే ఈ క్రింది గ్రూప్స్ నందు జాయిన్ అవగలరు.
Join Watsapp |
0 Comments