మీ ఆధార్ కార్డ్ ఏ కరెంట్ మీటర్ కి లింక్ అయిందో..?
ఈ పేజీ లో మనం ప్రధానంగా ఈ క్రింది అంశాలు గురించి వివరించుకుందాం
అంద్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేదవానికి దగ్గర చేయాలి అనే ఉధ్యేశ్యం తో ప్రజలకు కొన్ని అర్హతలు అయితే పెట్టడం జరిగింది.ఈ విధంగా పేదవారిగా గుర్తింపు పొందాలంటే ఈ 6 దశలలో అర్హత ఉండి తీరాలి. అందులో ఒక అర్హత అయిన ఈ కరెంట్ యూనిట్స్ వాడకం గురించి కూడా ఉంది.అది ఏ విధంగా అంటే ప్రస్తుత నెల నుండి గత 6 నెలలుగా సరాసరి నెలకు 300 యూనిట్స్ కరెంట్ బిల్ లోపల వాడుతున్నట్టు ఉంటే ఎటువంటి అభ్యతరం లేకుండా పథకాలు అందుతాయి.
ఈ ప్రక్రియలో కొంతమంది కి సంబంధం లేకుండా వారి ఆధార్ నెంబర్ కి మరెవరిదైనా మీటర్ నంబర్స్ లింక్ అవడం వలన అర్హత ఉండి కూడా పథకాలు పొందలేక ఇబ్బంది పడుతూవుంటారు.అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మనం చెప్పినట్టు ఆన్లైన్ర్ లో చెక్ చేసుకుని మనవి కానీ మీటర్ నుంబర్ల ఉంటే వాటిని తొలగించుకుని,లబ్ది పొందవచ్చు అనే ఉద్దేశ్యం తోనే 3 డిస్కం లకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ ని మీ ముందు ఉంచుతున్నాను.
మీ ఆధార్ నెంబర్ కి ఏ మీటర్ లింక్ అయిందో..?
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలకు కరెంట్ ని సరఫరా చేయడానికి ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈ క్రింది డిస్కమ్స్ ద్వారా అందిస్తున్నారు.
1.APSPDCL (Andra Pradesh Southern Power Distribution Company Limited)
2. APCPDCL (Andra Pradesh Central Power Distribution Company Limited
3.APEPDCL (Andra Pradesh Eastern Power Distribution Company Limited)
1.APSPDCL : ఈ డిస్కం ద్వారా ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు,కడప, అనంతపురం,కర్నూల్ జిల్లాలోని ప్రజలకు కరెంట్ సరఫరా చేస్తున్నారు.
హెడ్ క్వార్టర్స్: తిరుపతి
2. APCPDCL: ఈ డిస్కమ్ ద్వారా నే ప్రధానంగా కృష్ణా జిల్లా,గుంటూరు జిల్లా, మరియు ప్రకాశం జిల్లా లోని ప్రజలకు కరెంట్ ని సరఫరా చేయడం జరుగుతుంది.
హెడ్ క్వార్టర్స్ : విజయవాడ
3.APEPDCL ఈ డిస్కమ్ ద్వారా నే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా, విశాఖ పట్నం జిల్లా, విజయనగరం జిల్లా,మరియు ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలోని ప్రజలకు కరెంట్ ని సరఫరా చేయడం జరుగుతుంది.
హెడ్ క్వార్టర్స్: సీతమ్మ ధార, విశాఖపట్నం.
ఇప్పుడు మనం మన ఆధార్ కార్డ్ కి ఏయే మీటర్ నంబర్స్ లింక్ అయి ఉన్నాయో తెలుసుకునే విధానం చూద్దాం
మొదట APSPDCL కి సంబంధించి పైన పేర్కొన్న 5 జిల్లాల ప్రజలు ఈ క్రింది లింక్ ని ఓపెన్ చేయండి.
![]() |
APSPDCL |
ఈ లింక్ నందు కుటుంబ సభ్యుల అందరి ఆధార్లతో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.
STEP 1 : పై లింక్ పై క్లిక్ చేసుకున్నాక మొట్టమొదట సర్వీస్ నెంబర్ తో అయినా లేదా ఆధార్ నెంబర్ తో అయినా చెక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు కాబట్టి మీ దగ్గర అందుబాటులో ఉన్న వివరాలు బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
STEP 2: ఈ పేజీ నందు ఆ ఆధార్ కి ఎన్ని మీటర్లు లింక్ అయి ఉన్నాయో..అన్నియు చూపిస్తాయి.ముఖ్యంగా అందులో మీవి ఏవి, పొరపాటున లింక్ అయినవి ఏవి..అని గుర్తించి వాటిని వ్రాసి పెట్టుకోండి. మీవి కాకుంటే ఎలా తొలగించుకోవాలో కూడా చివరిలో చూద్దాం.తరువాత ఇక్కడే Consumption History పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
STEP 3: ఈ పేజీ లో Consumption History పై క్లిక్ చేసాకా ఈ పేజీ నందు ఏ నెలలో ఎన్ని యూనిట్స్ వాడుకున్నారు.ఎంత బిల్ వచ్చింది.అని 1 సంవత్సర కాలానికి వివరాలు ఇస్తారు.
APCPDCL : ఈ డిస్కం కి సంబంధించిన లింక్ క్రింద ఇవ్వబడును.
![]() |
APCPDCL |
STEP 1: పైలింక్ పై క్లిక్ చేసుకున్నాక మొట్టమొదట సర్వీస్ నెంబర్ తో అయినా లేదా ఆధార్ నెంబర్ తో అయినా చెక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు కాబట్టి మీ దగ్గర అందుబాటులో ఉన్న వివరాలు బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
2. ఈ పేజీ నందు మీరు ఎంటర్ చేసిన ఆదార్ నెంబర్ కి ఎన్ని మీటర్ లు లింక్ అయినాయో, అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇందులో మీకు సంబంధించిన మీటర్ లు ఉంటే పర్వాలేదు. ఒకవేళ మనకు సంబందం లేని మీటర్లు ఉంటే వాటిని తొలగించి కోవలెను.ఇక్కడ Consumption History పై క్లిక్ చేయాల్సిఉంటుంది.
STEP 3 : ఈ మూడవ పేజీ నందు Consumption History పై క్లిక్ చేసాకా ఈ కరెంట్ మీటర్ కి ఏ నెలలో ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు.ఎంత కరెంట్ బిల్ వస్తుంది.అని మనమే చెక్ చేసుకోవచ్చు.
APEPDCL : ఈ డిస్కం కి సంబంధించిన లింక్ క్రింద ఇవ్వబడును.
![]() |
APEPDCL |
STEP 1: పైలింక్ పై క్లిక్ చేసుకున్నాక మొట్టమొదట సర్వీస్ నెంబర్ తో అయినా లేదా ఆధార్ నెంబర్ తో అయినా చెక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు కాబట్టి మీ దగ్గర అందుబాటులో ఉన్న వివరాలు బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
STEP 2: ఈ పేజీ నందు మీరు ఎంటర్ చేసిన ఆదార్ నెంబర్ కి ఎన్ని మీటర్ లు లింక్ అయినాయో, అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇందులో మీకు సంబంధించిన మీటర్ లు ఉంటే పర్వాలేదు. ఒకవేళ మనకు సంబందం లేని మీటర్లు ఉంటే వాటిని తొలగించి కోవలెను.ఇక్కడ Consumption History పై క్లిక్ చేయాల్సిఉంటుంది.
STEP 3: ఈ మూడవ పేజీ నందు Consumption History పై క్లిక్ చేసాకా ఈ కరెంట్ మీటర్ కి ఏ నెలలో ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు.ఎంత కరెంట్ బిల్ వస్తుంది.అని మనమే చెక్ చేసుకోవచ్చు.
300 యూనిట్స్ కన్నా కరెంట్ బిల్లు ఎక్కువ వాడుతున్నారా, తక్కువ వాడుతున్నారా అని ఎలా చెక్ చేసుకోవాలి.
దీనికి ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజల అవసరాన్ని బట్టి ఒక నెలలో ఎక్కువ,తక్కువగా వినియోగిస్తూ వుంటారు.కాబట్టి ప్రస్తుత నెల నుండి గత 6 నెలల కరెంట్ బిల్ యూనిట్లను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు.
గడచిన 6 నెలలో యూనిట్ల మొత్తం
------------------------------
6
ఉదాహరణకు: ప్రస్తుత నెల నుండి గడిచిన నెలలలో వరుసగా 200,360,170,120,210,180 యూనిట్లు వాడుతుంటే
200+360+170+120+210+180
------------------------
6
1240
= ----------------
6
= 206.66 యూనిట్లు
ఈ విదంగా సరాసరి యూనిట్లను పరిగణలోకి తీసుకుని 300 యూనిట్ల లోపల వస్తే అలాంటి కుటుంబాలను పేద ప్రజలుగా గుర్తించి, అన్నీ సంక్షేమ పథకాలు కూడా ఇంటి ముందుకే అందుతాయి.
ఆధార్ సీడింగ్, డీ - సీడింగ్ ఎలా చేసుకోవాలి
మన మీటర్ లు వేరే వారికి లింక్ అయుంటే మన ఆధార్ కి లింక్ ఇచ్చుకోవడం గానీ లేదా మనకు సంబందం లేని మీటర్లు మన ఆధార్ కి లింక్ అయుంటే సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకుని 7 రోజుల SLA పీరియడ్ ప్రకారం సర్వీస్ ని క్లియర్ చేస్తారు.
Watsapp Group Link
0 Comments