సచివాలయం లో కరెంట్ మీటర్లకు ఆధార్ నెంబర్ ని తొలగించు విధానం
ఈ పేజీ నందు మనం ఇప్పుడు మన ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉన్న కరెంట్ మీటర్ల నంబర్లను సచివాలయం నందు తొలగించు విధానం గురించి చెప్పకుందాం.
అసలు ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది..?
ఆంద్ర ప్రదేశ్ నందు ప్రభుత్వం ఇప్పుడు పేదవాళ్లకు చాలా సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తూ ఉంది.అవన్నీ కూడా పొందాలంటే ఖచ్చితంగా పేదవారు మాత్రమే అర్హులని.అలాంటప్పుడు పేదవారిని ఎలా గుర్తిస్తారని ఒక అర్హత నిబంధనలు కూడా చెబుతూవస్తోంది.అందులో బాగంగానే కరెంట్ వాడకం కూడా ఆ కుటుంబం 6 నెలలకు సరాసరి 300 యూనిట్ల లోపల వాడే వాలందరూ అన్ని పథకాలకు అర్హులే..అని చెప్పడం జరిగింది.
కానీ కొన్నిచోట్ల వారికి సంబందం లేని కరెంట్ మీటర్లు కూడా వారి ఆధార్ కి లింక్ అయిపోవడం వలన ఆ కుటుంబం సరాసరి 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నట్టు చూపిస్తూ, ప్రభుత్వం ఇచ్చే పథకాలు పొందలేక దూరమయ్యేవారు.
అలాంటి వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి వారికి తప్పుగా లింక్ అయినా మీటర్లను తొలగించుకుని తరవాత వాళ్ళు సంతకం చేసి ఇచ్చే స్టేట్మెంట్ ని తెచ్చి సచివాలయం లో గ్రీవెన్స్ పెట్టుకునే వారు.ఇక్కడ ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా చేసుకోవాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. దీనిని గమనించిన ప్రభుత్వం ఆ సర్వీస్ ని కూడా సచివాలయం లోనేఅందుబాటులో కి తెచ్చి ఉచితంగా 7 రోజుల లోపలే పరిష్కారం అయ్యేటట్టు ప్రజలకు అయితే ఊరటనిచ్చారు.కానీ ఆ విషయం కూడా ప్రజలకు అవగాహన లేకుండా ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పడు మనం సచివాలయం లో ఇచ్చిన ఆ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం.
కావాల్సిన డాకుమెంట్స్ :
1.అప్లికేషన్ ఫారం
2.ఆధార్ కార్డ్
3.అడ్రస్ ప్రూఫ్
STEP 1 : ఈ క్రింది వెబ్సైట్ ద్వారా మొదటగా ఆర్జీదారుడు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అను సేక్రటరీ దగ్గర నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకుని ఒక రసీదు పొందుతారు.
![]() |
GSWS |
STEP 2 : ఆ లింక్ ఓపెన్ చేశాక పాత GSWS వెబ్సైట్ లోకి వెళుతుంది.ఇక్కడ "Energy" డిపార్ట్మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఉన్న ఏరియాని ఎంటర్ చేస్తారు.
STEP 4 : ఇక్కడ మన ఏరియా ని ఎంచుకున్నాక మనం వాడే డిస్కం రకాన్ని చూపిస్తూ,ఆధార్ ని సీడింగ్ చేయాలన్నా, డీ సీడింగ్ చేయాలన్నా ఈ క్రింది ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటారు.
STEP 5: ఈ పేజీ నందు మీరు కరెంట్ మీటర్ కి ఆధార్ లింక్ చేసుకోవాలా లేదా మనకు సంబందం లేని మీటర్లను తొలగించుకోవాలా అనే రెండు ఆప్షన్స్ వస్తాయి.మనము ఇప్పుడు ఈ పేజీ లో ఆధార్ డీ సీడింగ్ చేసుకోవాలో కాబట్టి సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
STEP 6 : ఇక్కడ డి సీడింగ్ ఆప్షన్ ని ఎంచుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి GET DETAILS అని ఎంటర్ చేస్తే మన ఆధార్ కి లింక్ అయిన కరెంట్ మీటర్లు చూపిస్తుంది.అందులో మనవి కానివి ఏమైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి వుంటుంది.అక్కడే క్రింద మరో ఆప్షన్స్ కనిపిస్తాయి.ఒకవేళ మీరు తొలగిస్తున్న సర్వీస్ నంబర్లు కి సంబంధించిన అసలు ఓనర్ ఆధార్ నెంబర్ ఏమైనా తెలుసా...అని అడుగుతుంది.అది తెలిస్తే పెట్టండి.లేదంటే అవసరం లేదు.ఆ తరువాత ఇప్పుడు ఎవరైతే డీ లింక్ చేసుకోవాలి అనుకుంటున్నాడో అతని యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, వారి దగ్గర బయోమెట్రిక్ గానీ లేదా ఆధార్ OTP ద్వారా అతేంతికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
STEP 7: ఒకవేళ పై గ్రీవెన్స్ నందు ఓనర్ ఆధార్ అందుబాటులో ఉంటే అతని ఆధార్ ఎంటర్ చేసి, ఓనర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి,ఆ అప్లికంట్ దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటారు.
ఇక్కడ గ్రీవెన్స్ పెట్టిన తరువాత ఆ అప్లికేషన్ ఎలెక్టరీకల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన AO కి వెళుతుంది.అక్కడ వెరిఫై చేసి మనం పెట్టిన గ్రీవెన్స్ ని అప్రూవ్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని 7 రోజులల్లో రిప్లై ఇస్తారు.కావున APPLICANT మరలా ఈ క్రింది లింక్ ద్వారా ఆ సర్వీస్ మీటర్ల నంబర్స్ తొలగించబడిందా లేదా అని చెక్ చేసుకోవచ్చును
LINK : CLICK HERE
పై విధంగా అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లబ్ధిపొందగలరని ఆశిస్తున్నాను.
మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఈ గ్రూప్ నందు వస్తుంటాయి.
Thank You
0 Comments