ఈ పేజీ లో మనం ఇప్పుడు ఈ క్రింది అంశాలు గురించి క్లుప్తంగా వివరించుకోబోతున్నాము.
- ఆధార్ అప్డేట్ హిస్టరీ ని డౌన్లోడ్ చేసుకునే విధానము
- ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏమిటి?ఇప్పుడు దీనిని ఎందుకు పథకాల దరఖాస్తులలో పెట్టమని కోరుతున్నారు ?
ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఎప్పటికప్పుడు నూతన వివరాలను తెలుసుకోవాలి అనుకున్న వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి.
WATSAPP LINK |
ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏమిటి ? ఇప్పుడు దీనిని ఎందుకు పథకాల దరఖాస్తులలో పెట్టమని కోరుతున్నారు ?
ముందుగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏమిటంటే భారతీయులు ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డ్ పొందిన తర్వాత నుండి ప్రస్తుతం వరకు ఆ ఆధార్ కార్డ్ నందు ఎన్ని సార్లు వివరాలు మార్చుకున్నారు.అనే విషయాన్ని తెలపడాన్నే ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటారు.ఇది మనకు ఆన్లైన్ లో చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఆంద్రప్రదేశ్ నందు వివిధ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ని పెట్టి తీరాలి.ఎందుకోసం ఈ నిబంధన తేవడం అంటే వార్త పత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఈ సంక్షేమ పథకాలలో లబ్ది పొందాలనే ఉద్దేశ్యం తో ఆధార్ లో వారికి నిజంగా తక్కువ వయస్సు వున్నా,కూడా అడ్డదారిలో కొంతమంది వయస్సు మార్పిడి చేసుకుంటున్న విషయం ప్రభుత్వ అధికారులు పసిగట్టారు. దీంతో అప్పటి నుండి ప్రభుత్వం అలా ఆధార్ మార్చుకున్న వారికి ఏ పథకాలు వర్తించకూడదు అనే నిబంధన పెడుతూ మరియు దాంట్లోనే నిజమైన వివరాలు పెట్టి మార్చుకుని ఉంటే అలాంటి వాటిని సచివాలయం లో డిజిటల్ ఆసిస్టెంట్ ఉద్యోగి తరువగా విచారణ చేసాక దరకాస్తు కి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.
ఆధార్ అప్డేట్ హిస్టరీ ని డౌన్లోడ్ చేసుకునే విధానము
దీనికి సంబంధించి పేజీ చివరన వెబ్సైట్ లింక్ ఇస్తాను.కావున ఒకసారి చెక్ చేసి వివరాలు ఇచ్చుకోండి.
గమనిక: ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి.
MOBILE NUMBER CHECKING LINK
STEP 2: ఈ పేజీ లో OTP ని ఎంటర్ చేసి SUBMIT చేయాలి.
STEP 3: ఈ పేజీ లో మన ఆధార్ కార్డ్ కి సంబంధించి మనము ఇప్పటి వరకు ఎన్ని సార్లు వివరాలు మార్పు చేసుకున్నారో ఇక్కడ వస్తుంది.
STEP 4: దీనిని PDF లో ప్రింట్ తీసుకోవాలంటే ముందుగా పైన ఉన్న 3 చుక్కల పై క్లిక్ చేసి Share ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత క్రింద లైన్ లో క్రొతగా పక్కకి జరిపితే Print ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసుకోవాలి. అక్కడ PDF సింబల్ పై క్లిక్ చేసి SAVE చేసుకోవాలి.
ADHAR UPDATE HISTORY DOWNLOAD LINK
0 Comments