ఈ పేజీ లో ప్రధానంగా వివరించిన ముఖ్యాంశాలు
1) పేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్ నందు ఉచిత అడ్మిషన్లు కి సంబంధించిన నోటిఫికేషన్
2) విద్యా హక్కు చట్టం కి సంబంధించిన
3) ప్రైవేట్ స్కూల్ లో ఉచిత విద్యకి కావాల్సిన అర్హతలు
4) రిజిస్ట్రేషన్ ప్రాసెస్
5) ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
6) Self Apply Demo Video
7) Toll Free Number
ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యకి కావాల్సిన అర్హతలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట సారిగా విద్యా హక్కు చట్టం -2009 ని సమగ్రంగా అమలు చేయాలని అధికూడా ఈ విద్యా సంవత్సరం కి ప్రైవేట్ స్కూల్ లో 1 వ తరగతి ప్రవేశాలలో నిరుపేదలకు 25% సీట్లను ఇచ్చి ఉచితంగా విద్యను అందించాలని ఆదేశించారు.బహుశా ఇంతవరకు ఎప్పుడూ మన రాష్ట్రం లోనే కాదు ఎక్కడా ఇది అమలు అయినట్టు మనం వినలేదు. మొట్ట మొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ మరియు ఆన్-ఎయిడెడ్ స్కూల్ లలో 25% సీట్లు ఇచ్చి ఉచిత విద్య అందించనున్నారు.కనుక గత విద్యా సంవత్సరంకి 19,000 మంది విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ లలో అవకాశం కల్పించారు.అదే విధంగా ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు 90,000 సీట్లు అందుబాటులో వున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.
A) వికలాంగులు, అనాథ బాలలు,HIV బాధితులు మరియు వీధి బాలలకు - 5% ఉచిత సీట్లు
B) SC బాలలకు - 10%
C) ST బాలలకు - 4%
D) BC,OC కులాలకు చెందిన బాలలకు - 6%
ఇలా మొత్తానికి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అన్నీ గుర్తింపు ఉన్న స్కూల్స్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
గమనిక: ఈ 25% ఉచిత సీట్లు అనేది 1 వ తరగతి ప్రవేశాలకు మాత్రమే వర్తిస్తుంది.మరియు అడ్మిషన్ పొందే నాటికి ఆ విద్యార్థి వయస్సు 5 సంవత్సరాలు పూర్తి అయి 6 వ సంవత్సరం కి వచ్చి ఉండాలి.
5) ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- మనమే స్వంతంగా ఆధార్ తో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు.
- మీ సేవా కేంద్రాలలో చేసుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళు అయితే మీ సచివాలయం లో చేసుకోవచ్చు.కనుక ఈ క్రింది చూపించిన AP సేవా పోర్టల్ లో ఉచితంగా చేసి ఇస్తారు.

దీనికి ఎలా ఎంపిక చేస్తారు ?
ప్రభుత్వం దీనికి సంబంధించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిని వెరిఫై చేశాక
లాటరీ పద్ధతి లో ఎంపిక చేయాలని కొన్ని ముఖ్య తేదీలను కూడ విడుదల చేశారు.
రిజిస్ట్రేషన్ మొదలు - 06-03-2024
రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ - 25-04-2024
ఈ ఉచిత అడ్మిషన్లు కొరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ క్రింది నంబరు కి కాల్ చేయగలరు.లేదా మీ మండలానికి సంబంధించిన MEO ని కల్సి సమస్య చెప్పుకోవచ్చును.అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఈ క్రింది నెంబర్ కి కాల్ చేయవచ్చును.లేదా 1902 అనే నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చును.
Cal : 14417
అర్హతలు:
- ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రైవేట్ స్కూల్ నందు 1 వ తరగతిలో పేదవాళ్ళు ఉచిత విద్య పొందాలంటే దానికి అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- గ్రామీణ ప్రాంతం వాళ్ళు అయితే కుటుంబ ఆదాయం సంవత్సరం కి 1,20,000 మించరాదు.
- పట్టణ ప్రాంత వాళ్ళు అయితే వారి కుటుంబ ఆదాయం సంవత్సరం కి 1,44,000 కంటే మించరాదు.
- మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ లో అయితే పై అర్హతలని బట్టి చూస్తే రైస్ కార్డ్ ఉంటే ఇందులో ఉచిత అడ్మిషన్లు లభించినట్టే.
వయస్సు అర్హతలు ఏమిటి ?
Online లో దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాకుమెంట్స్
1) విద్యార్థి ఆధార్ నెంబర్
2) విద్యార్థికి ఆధార్ లేకపోతే తల్లి తండ్రుల ఆధార్ లేదా గార్డియన్ ఆధార్ తో అయినా లాగిన్ అవచ్చు.
3) విద్యార్థి యొక్క బర్త్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి.
4) మొబైల్ నెంబర్
5) అడ్రెస్స్ ప్రూఫ్ కోసం ఏదైనా ఒకటి ఉండాలి.అవి ఏమిటంటే ఈ క్రింది ఇచ్చిన దాంట్లో ఏదో ఒకటి వున్ననూ సరిపోతుంది.
ఆన్లైన్ లో దరఖాస్తు చేయు విధానము (Online Apply Process)
దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చింది.అది ఈ క్రింద ఇస్తున్నాను.దానిపై క్లిక్ చేయండి.లింక్ పై క్లిక్ చేశాక లాగిన్,పాస్స్వర్డ్ అడుగుతుంది.అది మనకు ఉండదు.మనం ఇప్పుడు క్రొతగా క్రెయేట్ చేసుకివాలి. దీనికి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ అబ్బాయి/అమ్మాయి యొక్క ఆధార్ లేదా తల్లిదండ్రులు యొక్క ఆధార్ తో అయినా అక్కడ అడిగిన వివరాలను ఇచ్చి రిజిస్టర్ చేయించుకుంటే మీరు ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి లాగిన్ & పాస్ వర్డ్ వస్తుంది.
![]() |
REGISTRATION |

మీకు లాగిన్ పాస్ వర్డ్ వచ్చాక మీకు కావాలంటే పాస్ వర్డ్ ని మళ్లీ కూడా మార్చుకోవచ్చును.ఇక ఇక్కడి నుండి మీ సచివాలయ పరిధిలో 1 నుండి 3 కిలోమీటర్లు పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు ఆన్-ఎయిడెడ్ స్కూల్స్ వివరాలను ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.
6) Self Apply Demo Video
పేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్ నందు ఉచిత అడ్మిషన్లు కి సంబంధించిన నోటిఫికేషన్
Online లో దరఖాస్తు ఎలా చేయాలో మీకు తెలియకపోతే క్రింద ఉన్న కామెంట్ బాక్స్ నందు తెలపండి.మరొక్క వీడియోలో క్షుణ్ణంగా ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను.
THANK YOU
0 Comments