ఈ పేజీ లో ప్రధానంగా ఈ క్రింది అంశాలు వివరించుకోబోతున్నాము
- ఈ సంవత్సరం వైస్సార్ చేయూతకి క్రొత్త నిబంధనలు(2022-23)
- ఈ సంవత్సరం మొదటి సారి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఏ డాకుమెంట్స్ పెట్టాలి
- ఈ సంవత్సరం రెన్యూవల్ లబ్ధిదారుల పరిస్థితి ఏమిటి,దరఖాస్తు చెసుకోవాలంటే కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటీ?
- ఈ పథకంకి ఎక్కడ,ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- NPCI లింక్ చెక్ చేసుకోవడం ఎలా
- YSR Cheyutha Application PDF
Ysr చేయూత పథకం అప్లై కి వెబ్సైట్ లింక్ ?
![]() |
NBM Site |
మరిన్ని నూతన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి తెలుసుకోగలరు
![]() |
WATSAPP |
వైస్సార్ చేయూత
మన ముఖ్యమంత్రి గారు గతంలో పాదయాత్ర లో హామీ ఇచ్చినట్టుగా SC, ST, BC, MINORITY కి చెందిన 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరం లోపల ఉన్న మహిళలకు పెన్షన్ ఇస్తాము.అని చెప్పడం జరిగింది. కానీ అప్పటి సమయంలో ఇప్పటి ప్రతిపక్షాలు ఈ రకమైన దానిని ఆ వయస్సులో పెన్షన్ ఏమిటని ఎద్దేవా చేశారు.
ఆ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకుని ప్రతినెలా పెన్షన్ రూపంలో ఇవ్వకుండా ఆర్ధిక భరోసా లాగా ఆ మహిళకు 75 వేలు ఆర్ధిక సహాయం చేయాలని నిశ్శయం చేసి అదేవిధంగానే YSR చేయూత పేరుతో సంవత్సరానికి Rs.18,750 లను 4 ఏండ్లుకి 75 వేల రూపాయలు అందిస్తున్నారు.అందులో బాగంగా ఇప్పటికే రెండు సంవత్సరాలు దిగ్విజయంగా ఆ కార్యక్రమం జరపడం జరిగింది. ఇప్పుడు ఈ 2022-23 సంవత్సరం కి సంబంధించి సెప్టెంబర్ నెలలో డబ్బులు విడుదల చేయనున్నారు.కావున ఈ ఆగస్ట్ నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు.
ఈ సంవత్సరం వైస్సార్ చేయూతకి క్రొత్త నిబంధనలు(2022-23)
1. వైస్సార్ చేయూత లబ్ది దారులు ఆంధ్ర ప్రదేశ్ నివాసి అయి ఉండాలి
2.ఆ కుటుంబ సంవత్సర ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు 10 వేలు, పట్టణాల్లో అయితే 12 వేలు కంటే మించకూడదు
3. రైస్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి
4. ఆ కుటుంబ మొత్తానికి 3 ఎకరాలు మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట వరకు ఉండచ్చు.మరియు మెట్ట, మాగాణి రెండూ కలిపి 10 ఎకరాలు వరకు కూడా ఉండచ్చు.
5. కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగి వుండకూడదు.
6. కుటుంబం లో 4 చక్రాల వాహనం ఉన్నచో అనర్హులు గా పరిగణిస్తారు. దీనిలోనే టాక్సీ, ట్రాక్టర్,ఆటో లకు సడలింపు ఉంది..వీరు మాత్రం అర్హులు.
7.కుటుంబం లో ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్ళు ఉన్నచో అనర్హులు
8.మున్సిపల్ ఏరియాలో స్వంత ఇల్లు 1000 చ.అ. కంటే ఎక్కువ ఉన్నచో వారికి పేదవారుగా పరిగణించరు.కావున వారు కూడా అనర్హులే.
9. కరెంట్ బిల్ వాడకం లో ఈ సంవత్సరం నుండి క్రొత్త నిబంధన తెచ్చారు.అదేమిటంటే 12 నెలలు కాలంలో సరాసరి 300 యూనిట్స్ కన్నా ఎక్కువ వాడకం ఉంటే వారిని అనర్హులుగా పేర్కొంటారు.(NBM Site)
ఈ సంవత్సరం మొదటి సారి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఏ డాకుమెంట్స్ పెట్టాలి
1.ఆధార్ కార్డ్
2.రైస్ కార్డ్
3.క్యాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్ (సచివాలయంలో తీసుకుంది మాత్రమే)
4. ఆధార్ అప్డేట్ హిస్టరీ
5.Active లో ఉన్న బ్యాంక్ అకౌంట్
ఈ పథకం కి ఎక్కడ,ఎలా దరఖాస్తు చేసుకోవాలి
ఈ 2022-23 కి సంబంధించి ఈ సంవత్సరం క్రొతగా దరఖాస్తు చేసుకివడానికి సచివాలయం లో డిజిటల్ ఆసిస్టెంట్ లాగిన్ లో సర్వీస్ ఓపెన్ అయివున్నాయి.రెన్యూవల్ వారికి ఇంకా వివరాలు రాలేదు. కనుక ఇంకాస్త సమయం వేచి ఉండండి. అప్డేట్ వస్తే తెలియజేస్తాను.కావున ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ ని సచివాలయంకి తీసుకెళ్లి అప్లై చేసుకోగలరు.
గమనిక: దరఖాస్తు చేయు సమయంలో లబ్ధిదారుని దగ్గర బయోమెట్రిక్ లేదా ఐరిష్ మరియు OTP సహాయంతో అప్లై చేస్తారు
ఈ సంవత్సరం రెన్యూవల్ లబ్ధిదారుల పరిస్థితి ఏమిటి,దరఖాస్తు చెసుకోవాలంటే కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటీ?
దీనికి సంబంధించి ఈ రోజు నాటికి అంటే ఆగస్ట్ 17 కి అయితే ఎలాంటి వివరాలు రాలేదు. కానీ ఈ సంవత్సరం వచ్చిన అన్ని పథకాలులాగే ఆలోచిస్తే ఈ NBM సైట్ లోనే గతంలో చేయూత లబ్ధిదారులు ఈ సంవత్సరం కి సంబంధించి ప్రాథమిక అర్హత - అనర్హత జాబితాని తెలపవచ్చును.అక్కడ అర్హత ఉన్నవారిని రెన్యూవల్ చేయుటకు ఒకసారి EKYC మాత్రం అడగవచ్చు.మిగతా ఏ డాకుమెంట్స్ కూడా అడగకపోవచ్చును.కానీ ఈ రెన్యూవల్ కి సంబంధించి మరిన్ని నూతన అప్డేట్స్ వస్తే మాత్రం మరలా తప్పక తెలియజేస్తాను.
NPCI లింక్ చేసుకోవడం ఎలా ?
ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా DBT సిస్టమ్ ద్వారా ముఖ్యమంత్రి గారు బట్టన్ నొక్కగానే నేరుగా ఎటువంటి అవినీతి లేకుండా లబ్ధదారుల బ్యాంక్ ఖాతాలోకి వచ్చి పడుతున్నాయి.ఈ విధంగా ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పడాలంటే మీ బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా NPCI లింక్ అయి ఉండాలి.
మీ బ్యాంక్ ఖాతాకు NPCI లింక్ ఉందా లేదా అని మీ ఆధార్ తో ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోండి.లింక్ లేకపోతె బ్యాంక్ కి వెళ్లి చేయించుకోండి.
![]() |
NPCI |
0 Comments