Header Ads Widget

YSR Cheyutha New Update (23-09-2022)

ysr cheyutha scheme status ysr cheyutha login ysr cheyutha amount ysr cheyutha 2022 ysr cheyutha eligibility ysr cheyutha status 2022 ysr cheyutha application status ysr cheyutha list


ఈ పేజీ చివరన వైస్సార్ చేయూత సంబరాలు కి సంబంధించిన PDF ఇవ్వడం జరిగింది. 


వైస్సార్ చేయూత: ఈ పథకం పేరుతో రాష్ట్రంలోని 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు SC,ST,BC,MIN,OC లోని ముస్లిం మహిళలకు ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున ఆర్ధిక సాయం చేస్తున్నారు.ఇది పూర్తిగా ఉచితం,దీనిని తిరిగి కట్టాల్సిన అవసరం లేదు.


మరిన్ని ప్రభుత్వ పథకాలపై మరియు ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలను పొందాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి.


WATSAPP GROUP


ఈ డబ్బులను తిరిగి కట్టాలి అంటున్నారు..నిజమా ?

దీనితో వాళ్ళు స్వచ్ఛందoగా వారి కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చును.ఎలాంటి ఆక్షేపణ లేదు.లేదు అంటే ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అంటే దేశంలో ప్రసిద్ధిగాంచిన AMUL,ITC,HUL,P&C,RELIANCE లాంటి పెద్ద కంపెనీలతో భాగస్వామ్యం చేసి వ్యాపారం చేసుకోవడం లో ఆ మహిళకు తోడుగా కూడా వుంటాము అని చెబుతారు.


ఈ విడతలో ఎంత మందికి ఇస్తున్నారు, ఈ కార్యక్రమం ఎక్కడ ప్రారంభిసస్తున్నారు ?

రాష్ట్ర వ్యాప్తంగా అక్క,చెల్లమ్మలకు దాదాపు 26,39,703 మందికి ఈ సంవత్సరం అక్షరాల రూ.4,949.44 కోట్లు ను ఈ రోజు చిత్తూరు జిల్లాలోని కుప్పం నందు ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభిస్తారు.


డబ్బులు ఎప్పటి వరకు అకౌంట్లలో జమ కానున్నాయి ?

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెద్ద పథకాలలో అమ్మఒడి తర్వాత ఈ వైస్సార్ చేయూత పథకమే ఉంది.కావున ప్రభుత్వం కూడా ఒక వారం పాటు YSR చేయూత సంబరాలు చేస్తున్నారు కాబట్టి అకౌంట్లలో 23 వ తేదీ నుండి ఈ నెల చివర 30 వ తేదీ వరకు అకౌంట్లలో పడుతూవుంటుంది.


వైస్సార్ చేయూత సంబరాలు ?

రాష్ట్ర ప్రభుత్వం ఈ వైస్సార్ చేయూత కార్యక్రమాన్ని ఒక వారం పాటు సంబరాలు నిర్వహించాలని భావించారు.అందులో భాగంగానే 22-09-2022 నుండి 30-09-2022 వరకు ఈ వైస్సార్ చేయూత సంబరాలు నిర్వహించనున్నారు.



Post a Comment

0 Comments