Header Ads Widget

YSR PENSION RE-VERIFICATION LIST -2022

 YSR PENSION RE-VERIFICATION-2022






ఈ పేజీ నందు మనం ప్రధానంగా YSR పెన్షన్ కానుక కి సంబంధించి అనర్హులు గా తెలిన వారు ఏ విధంగా మళ్లీ తెచ్చుకోవాలో చెప్పడం జరుగుతుంది.కావున అందరూ తెలుసుకుని లబ్ది పొందగలరు.


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అవసరమయ్యే ముఖ్య సమాచారాలు కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ క్రింది టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అయి అప్డేట్స్ తెలుసుకోగలరు.



    WATSAPP& TELEGRAM



ప్రధాన అంశం: ఆంధ్ర ప్రదేశ్ నందు వైస్సార్ పెన్షన్ కానుక లబ్దిదారుల కి ఆరు దశల వేరిఫికషన్ అనేది చేయగా అందులో ప్రభుత్వం విధించిన నిబంధనలు కంటే కూడా ఎక్కువగా ఉండడం వలన చాలా పెన్షన్స్ అనర్హులు గా పేర్లు వచ్చాయి.ఇప్పుడు అలాంటి వారు వాటిని ఎలా అనర్హులుగా చేసుకోవాలో చుద్దాం.దానికంటే ముందు అసలు పెన్షన్ పొందాలంటే అర్హతలు ఏమిటో తెలుసుకుందాం


APPLICATIONS & అర్హతలు కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయగలరు



APPLICATIONS & ELIGIBILITY

    










(1) కరెంట్ బిల్ సమస్య

 కరెంట్ బిల్ సమస్య వచ్చిన వారు ముందుగా మీ సచివాలయంలో మీ కుటుంబానికి ఏయే మీటర్లు చూపిస్తున్నాయో వ్రాసుకుని అవి మీవా కాదా అని సరి చూసుకున్నాక, వాటిలో మీవి కానివి తప్పుగా లింక్ అయుంటే అక్కడే సచివాలయంలో నే De-link పెట్టుకోవచ్చు.దానిలో మీ సమస్యని ఇన్ని రోజుల్లో క్లియర్ చేయగమని గడువు తేదీ కూడా ఇవ్వడం జరుగుతుంది.


గమనిక: ఇంకా త్వరగా పూర్తి కావాలి అనుకుంటే మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ లు తీసుకెళ్లి దగ్గరలోని ఎలక్ట్రిక్ డిపార్టెంట్ లొని AE గారి దగ్గర ఇచ్చి వెంటనే మీకు సంబందం లేని వాటిని తొలగించుకోవచ్చును. 


ఆ తరువాత పైన ఇచ్చిన అప్లికేషన్ పై సంబంధిత అధికారి దగ్గర సంతకం మరియు SEAL వేసుకుని సచివాలయం ఇస్తే సరిపోతుంది.


(2) పట్టణాలలో నివాశిత భవనం యొక్క పరిమాణం

జ) దీనికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 1000 చ.అడుగుల లోపు ఉండాలి.దానికంటే ఎక్కువగానే ఉన్నవారి పేర్లు వేరిఫికేషన్ కి వచ్చి ఉంటాయి.మీకు అర్హత ఉండి సచివాలయ లాగిన్ లో తప్పుగా చూపిస్తుంటే అక్కడే అడ్మిన్ సెక్రెటరీ (పరిపాలన కార్యదర్శి) అనే ఉద్యోగి వుంటారు.అతనికి తెలియజేస్తే మళ్లీ కొలతలు వేసి కరెక్ట్ చ||అడుగులని ఎంటర్ చేస్తారు.


ఆ తరువాత పైన ఇచ్చిన అప్లికేషన్ లో కమీషనర్ దగ్గర సంతకం చేసుకుని వచ్చి సచివాలయంలో వెల్ఫేర్ సెక్రెటరీ కి ఇస్తే ప్రభుత్వానికి Online లో Submit చేస్తారు.



(3)వ్యవసాయ భూమి ఎక్కువగా ఉన్నట్లు ఉన్న సమస్య

జ) ఈ విధంగా అర్హత ఉన్న కూడా సచివాలయ లాగిన్ లో ఎక్కువగా చూపిస్తుంటే అక్కడే సచివాలయంలో VRO వుంటారు. వారికి సమస్య తెలియజేయాలి.వారి ద్వారా ఫీల్డ్ వెరిఫికషన్ చేశాక తప్పులను సరిదిద్ది ఆన్లైన్ర్ లో వివరాలు పొందుపరచడం జరుగుతుంది.


ఆ తరువాత పైన ఇచ్చిన అప్లికేషను పై VRO గారి సాయం తో MRO దగ్గర సంతకం చేసి సచివాలయం లో ఇవ్వాలి


(4) నాలుగు చక్రాల వాహన సమస్య

జ)ఈ సమస్యకి మీ కుటుంబం లోని అందరి ఆధార్ కార్డ్ లను RTO ఆఫీస్ కి తీసుకెళ్లి,చెక్ చేసుకుని తప్పుగా లింక్ అయిన ఆధార్ ని తొలగించుకోవాలి.


ఆ తరువాత పైన ఇచ్చిన అప్లికేషను పై RTO దగ్గర సంతకం చేసి సచివాలయం లో ఇవ్వాలి 


(5) ప్రభుత్వ ఉద్యోగుల సమస్య

జ)పొరపాటున సంబంధం లేని ప్రభుత్వ ఉద్యోగి వేరే కుటుంభం తో లింక్ అయినట్లు చూపిస్తుంటే సచివాలయంలో గ్రీవిన్స్ పెట్టుకోవాలి.


గ్రీవిన్స్ లో సమస్య క్లియర్ అయ్యాక పైన ఇచ్చిన అప్లికేషను పై  దగ్గర సంతకం చేయించుకుని సచివాలయం లో ఇవ్వాల్సివుంటుంది.


(6) ఆదాయపు పన్ను సమస్య

జ) ఈ సమస్య కి కూడా 26 A ఫారం అనేది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఇచ్చి క్లియర్ చేసుకోవచ్చును.


పైన ఇచ్చిన అప్లికేషను పై  దగ్గర సంతకం చేయించుకుని సచివాలయం లో ఇవ్వాల్సివుంటుంది.


Post a Comment

0 Comments