MLC Voter Card Status & Polling Station Details Checking-2023
ఈ పేజీలోని ముఖ్యాంశాలు
1) MLC ఓటరు లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం
2)ఎమ్మెల్సీ ఓటర్ లిస్టులో మీపోలింగ్ స్టేషను గుర్తుంచడం ఎలా ?
3) ఓటర్ స్లిప్పులు పంపిణీ
4) MLC ఎలక్షన్ తేదీ?
5) MLC లు ఎన్ని రకాలు & ఓటింగ్ వేయు విధానము
Watsapp Groups
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుకి సంబంధించిన సంక్షేమ పథకాల గురించి మరియు జాబ్ నోటిఫికేషన్ గురించి నూతన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఈ క్రింది గ్రూప్ నందు జాయిన్ అవగలరు.
1) MLC ఓటరు లిస్ట్ లో మీపేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం?
జ) ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో గ్రాడ్యుయేషన్ MLC లకు మరియు టీచర్ల MLC లకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ గత డిసెంబర్ వరకు పూర్తి ఓటరు లిస్ట్ లను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేది.కానీ ఇప్పుడు ఈ రోజు నాటికి రావడం లేదు.బహుశా మళ్లీ ఏమైనా అప్డేట్ చేస్తారేమో తెలియదు.
కానీ ఈ MLC లకు సంబంధించి ఈ ఓటరు లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అని 2 రకాలుగా తెలుసుకోవచ్చు.
1) అప్లికేషను నెంబర్ ఆధారంగా
2) మీ పేరు ఆధారంగా
Checking Link :CLICK HERE
Step 1: పై లింక్ ఓపెన్ చేశాక ఈ క్రింది విధంగా పేజీ వస్తుంది.ఇక్కడ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన వాళ్ళు స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే F18 ఆప్షన్ లేదా టీచర్స్ కి సంబంధించిన వాళ్ళు అయితే F19 అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని అక్కడ అప్లికేషను నెంబర్ తెలిసినా ఎంటర్ చేయండి లేదా మీరు అప్లికేషను లో మీరు ఎంటర్ చేసిన విధంగా మీ పేరు ని అయినా ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయగలరు.
Step 2: ఇక్కడ అప్లికేషను నెంబర్ మరియు అభ్యర్థి పేరు, తండ్రి పేరు,స్టేటస్ అన్ని చూపిస్తుంది.అక్కడే చివరన View Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయిపోయివున్నా కూడా కారణాన్ని చూపిసస్తుంది.
Step 3: ఈ పేజీ నందు అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ ని ప్రింట్ తీసుకోవచ్చును.
గమనిక: ఈ ప్రింట్ తీసుకుని పోయి ఓటు వేయచ్చా అంటే లేదు. ఇది కేవలం స్టేటస్ చూసుకోవడానికి మాత్రమే.
2) ఎమ్మెల్సీ ఓటర్ లిస్టులో మీపోలింగ్ స్టేషను గుర్తుంచడం ఎలా?
జ) పైన చెప్పిన విధంగా మీ కార్డ్ Approved అని వచ్చిన తర్వాత అక్కడ అప్లికేషను నంబర్ ని Copy చేసి పెట్టుకోండి.లేదా ఒక దగ్గర రాసి పెట్టుకోండి ఎందుకంటే ఆ నెంబర్ సాయంతోనే పోలింగ్ స్టేషన్ ని కనుక్కోగలము.
POLING STATION CHECKING
Step 1: ఇక్కడ కూడా మొదట ఆప్షన్ లో మీరు గ్రాడ్యుయేషన్ ఓటరా లేదా టీచర్స్ కి సంబంధించిన ఓటరా అని ఆప్షన్ ఎంచున్నాక,ఆ తర్వాత మీ పాత జిల్లాని ఎంపిక చేసుకోవాలి.
తరువాత అక్కడ అప్లికేషను నెంబర్ లేదా పేరు తో కూడా పోలింగ్ స్టేషన్ ని తెలుసుకునే విధానం ఇచ్చారు.కానీ ఈ రోజు నాటికి అయితే అప్లికేషను నెంబర్ ఉంటేనే చెక్ చేసుకునేలా ఉంది.పేరు తో చూద్దామంటే ఆప్షన్ సెలెక్ట్ అవడం లేదు. బహుశా తరువాత ఏమైనా అప్డేట్ చేస్తారేమో చూద్దం.
Step 2: ఇక్కడ మీ వివరాలు తోపాటు పోలింగ్ స్టేషన్ వివరాలు మరియు ఆ లిస్ట్ లో మీ సీరియల్ నంబర్ ని కూడా చూపిస్తుంది.
ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే అక్కడే చివరన View Polling Station అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.ఆ తరువాత ప్రింట్ ఈ విధంగా కనిపిస్తుంది.
3) ఓటర్ స్లిప్పులు పంపిణీ
జ) ఈ MLC ఎన్నికల కొరకు ఓటరు స్లిప్ ల పంపిణీని మార్చి 7 వతేదీ లోపల అందరికి పంపిణీ చేయాలని అధికారులకు ఎలక్షన్ కమిషన్ సూచించింది.
Know Your BLO : CLICK HERE
4) MLC ఎలక్షన్ తేదీ?
జ) ఆంద్ర ప్రదేశ్ కి సంబంధించి గ్రాడ్యుయేషన్ మరియు టీచర్లకు సంబంధించిన MLC ఎన్నికలకు మార్చి 13 వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుపబడును.
5) MLC లు ఎన్ని రకాలు & ఓటింగ్ వేయు విధానము ?
జ) దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ని గతంలోనే వీడియో రూపంలో చెప్పడం జరిగింది.కావున ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోగలరు.
0 Comments