ఈ సమాచారం మొత్తం కూడా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన SOP ఆధారంగానే చెబుతున్నాను.కావున నిరభ్యంతరంగా ప్రజలు ఉపయోగించుకోగలరు.
Introduction
Jagananna Suraksha అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 11 రకాల ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు.కనుక ఈ విషయాన్ని గురించి గతంలో చాలా వివరంగా వివరించాను.పూర్తి వివరాలు కావాలంటే ఈపేజీ చీవరన వీడియో ఇస్తాను చూడగలరు.ఇప్పుడు ఈపేజీ లో ప్రధానంగా మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే 11 ఉచిత సర్వీసులలో ఒకటైన ఆధార్ కార్డు కి సంబంధించిన సర్వీసులు ఎలాంటివి ప్రజలకు ఉచితం,ఎలాంటి సర్వీసులకు డబ్బులు చెల్లించాలి అనే విషయాన్ని కాస్త వివరంగా చెప్పుకుందాం.
ఉచితంగా ఇచ్చే 11 సర్వీసులు ఏమిటి ? వాటికి కావలసిన డాకుమెంట్స్ ఏమిటి?
Aadhar Free Services
ఈ జగనన్న సురక్ష లో ఆధార్ సేవలు ఉచితంగా పొందాలి అనుకుంటే అందరూ గుర్తించుకోవాల్సిన అంశాలు ఏమిటంటే మీ సచివాలయం లో క్యాంప్ జరిగే 7 రోజుల ముందు నుండి ఆధార్ సర్వీసులు పొందాలంటే మీ సచివాలయ సిబ్బంది దగ్గర ముందుగా TOKEN జనరేట్ చేసుకోవాల్సివుంటుంది.అట్టి వారికి మాత్రమే ఈ సేవలు ఉచితంగా పొందగలరు.మిగతా వాళ్ళు అందరూ సర్వీస్ ఛార్జ్ చెల్లించి సేవలను వినియోగించుకోగలరు.
Token వున్న వారికి ఉచిత సేవలు ఏవి?
1) క్రొత్త ఆధార్ కార్డు నమోదు
2) బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు మరియు డెమోగ్రాఫిక్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు.కాకపోతే ఈ క్రింది వయస్సు వారికి మాత్రమే ఉచితం.
వయస్సు5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు
వయస్సు15 సంవత్సరాలు నుండి 17 సంవత్సరాల వరకు
3) ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం (ఇది అన్ని వయస్సుల వారికి కూడా ఉచితం)
Source : ప్రభుత్వం ఇచ్చిన అధికారిక SOP (8th Point)
గమనిక: ఇక్కడ ఒకసారి ఆధార్ కార్డు కి సంబంధించి టోకెన్ జనరేట్ అయితే డిలీట్ చేసే అవకాశం లేదు.కావున దయవుంచి ఈ విషయాన్నీ గుర్తించుకుని ఉచిత సర్వీసులను ఉపయోగించుకోండి.
ఉచిత సర్వీసులుకు Token ఇవ్వకపోతే సమస్యని ఎవ్వరికి చెప్పుకోవాలి?
ప్రభుత్వం ఇచ్చిన ఉచిత సర్వీసులను అందిచడానికి అన్నీ సచివాలయ ఉద్యోగులు అందరూ ప్రయత్నం చేస్తుంటారు.కానీ కొన్ని చోట్ల తప్పిదాలు జరుగుతాయి కాబట్టి అలంటి సమస్యలు ఎక్కడైనా తలెత్తితే ముందుగా మీ మండల ఉన్నతాధికారులైన MPDO / MC / MRO / RDO లకు ఎవరికైనా సమస్యను తెలియజేయవచ్చును.లేదా మీ స్థానిక రాజకీయ నాయకులకు తెలియజేయగలరు.లేదా మీరే కూడా 1902 అనే నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యని డైరెక్ట్ గా ప్రభుత్వానికి తెలియజేయవచ్చును.
జగనన్న సురక్ష కార్యక్రమం అంటే ఏమిటి ..పూర్తి వివరాలు?
జగనన్న సురక్షలో వాలంటీర్ యాప్ లో సర్వే చేయు విధానము
FAQs
Conclusion
ఈ పేజీ నందు ఇచ్చిన సమాచారాన్ని మరియు SOP ని క్షుణ్ణంగా చదువుకుని ప్రజలందరూ లబ్ది పొందాలని ఆశిస్తూ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మరియు జాబ్ అప్డేట్స్ గురుంచి ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని అందిస్తూ అందులో ఏమైనా సందేహాలు వున్నచో మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లలో జాయిన్ అయి నన్ను Contact కాగలరు.
0 Comments