How to Get free Marriage Certificate in Jagananna Suraksha Programme
ఈ పేజీ లో సమాచారం పూర్తిగా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన SOP ఆధారంగా మాత్రమే చెప్పడం జరిగుతోంది
.
INTRODUCTION
ఈ పేజీ నందు మనం ఇప్పడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమంలో 11 రకాల ప్రభుత్వ పరమైన సర్వీసులును ఉచితంగా అందించనున్న విషయం మనకు తెలిసిందే.కనుక అందులో భాగమైన ఒక సర్వీస్ "వివాహ ధ్రువీకరణ పత్రం".ఈ పత్రం పొందుటకు ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం.కావున ఈ సర్వీసుని కూడా ఉచితంగా సచివాలయం జరిగే క్యాంపు రోజున ఇవ్వనున్నట్లు తెలియజేసారు.
కానీ ఈ సర్టిఫికెట్ పొందుటకు కొన్ని షరతులు అయితే ప్రభుత్వం విధించింది.కావున ఈ సురక్ష కార్యక్రమము లో ఎలాంటి వారికీ మాత్రమే ఈ సర్టిఫికెట్ పొందే అవకాశం వుంది అనే విషయాన్ని చాల వివరంగా చెప్పుకుందాం.
మ్యారీజీ సర్టిఫికెట్ ఎవరికి ఇస్తారు ?
ఈ సందేహం చాల మందికి అయితే ఉంటుంది.ఎందుకంటే ఈ మ్యారీజీ సర్టిఫికెట్ అనేది AP లో ప్రతి ప్రభుత్వ సేవకి అనుభంధంగా అడుగుతున్నారు.ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెచ్చుకోవడం మంచిది.
ఈ మ్యారేజీ సర్టిఫికెట్ పొందాలి అనుకుంటే గమనించాల్సిన అంశాలు
1) గ్రామీణ ప్రాంతంలో వివాహం జరిగిన 60 రోజుల లోపు మీ సచివాలయం లో దారఖాస్తు చేసుకోవచ్చు.దాని కంటే ఎక్కువ కాలం అయుంటే తప్పకుండా మీ మండలంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లోకి వెళ్లి చేసుకోవాలి.
2) పట్టణ ప్రాంతాలలో వాళ్ళు వివాహం జరిగి 90 రోజుల లోపు అయితే మీ సచివాలయం ల దరఖాస్తు చేసుకోవచ్చు.దాని కంటే ఎక్కువ కాలం అయుంటే తప్పకుండా మీ మండలంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లోకి వెళ్లి చేసుకోవాలి.
ఏ సర్టిఫికెట్ కొరకు సచివాలయంలో ఎంత అమౌంట్ కట్టాలి?
ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఈ జగనన్నసురక్ష క్యాంపు నందు ఉచితంగా చేసే సర్వీసులలో ఈ సర్టిఫికెట్ కూడా వుంది.కానీ ఇక్కడ అధికారికంగా SOP లో ఇచ్చిది మాత్రం - SOP LINK DOWNLOAD
- వివాహం జరిగిన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకుంటే రూ 100/-లు కట్టుకోవాలి.
- వివాహం జరిగిన 30 రోజుల తర్వాత అయితే రూ 200/- లు కట్టుకోవాలి.
గమనిక: పై ఫీజుతో చేయాలంటే గ్రామీణ ప్రాంతాలో 60 రోజుల లోపు,పట్టణ ప్రాంతంలో 90 రోజుల లోపు ఉంటే మాత్రమే.ఆ పైన కాలపరిమితి అయుంటే మాత్రం డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్ లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ మ్యారీజీ సర్టిఫికెట్ కొరకు కావలసిన డాకుమెంట్స్ ఏమిటి?
1) అప్లికేషన్
2) ఆధార్ కార్డు
3) పెళ్లి పత్రిక
4) సాక్షుల యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో
5) వయస్సు నిర్దారణకు (ఉదా: ఆధార్)
6) చిరునామా నిర్ధారణకు
A) రైస్ కార్డు/ టెలిఫోన్ బిల్ / కరెంట్ బిల్ /ఆధార్ కార్డు/ ఓటరు కార్డు / పాస్పోర్ట్ /డ్రైవింగ్ లైసెన్స్ / MGNREGS జాబ్ కార్డు
పై అప్లికేషన్స్ అన్నీ ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
60/90 రోజులు దాటిన వారు ఈ క్యాంపు లో పెట్టుకోవచ్చా?
ఈ జగనన్నసురక్ష కాంప్ నందు అయితే దీనికి సంబంధించి ఉచిత సర్వీస్ అయితే లేదు.మీరు తప్పకుండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది.కానీ ఈ జగనన్న సురక్ష క్యాంప్ నందు ఈ సర్టిఫికెట్ పొందడానికి మీకు కలిగే ఇబ్బందులు ఉంటే అక్కడే జగనన్నకు చెబుదాం అనే హెల్ప్ డెస్క్ నందు అర్జీ ఇవ్వవచ్చును.లేదా అక్కడే మండలంలో ఉన్నత అధికారులందరూ క్యాంపు రోజున వుంటారు కాబట్టి వాళ్లకు కూడా సమస్యని చెప్పుకోవచ్చు.ఆ తరవాత వీలైతే ఆ సమస్య ని జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసి ఆ సర్టిఫికెట్ పొందడానికి కూడా కొంచెం సులభతరం చేసే అవకాశం ఉండవచ్చును.
ఈ మ్యారీజే సర్టిఫికెట్ ని SELF మనమే Online లో దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది.
FAQs
1) పై 11 సర్వీసులు కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే ఎవరికీ చెప్పుకోవాలి ?
జ) ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు పై 11 సర్వీసులు కాకుండా ప్రతి కుటుంభంలో ఎలాంటి సమస్యలు వున్నా మీ సమస్యలు వినడానికి మీ మండలంలోని ఉన్నత అధికారులు అందరూ ఒకే రోజు ఒకే చోటుకి వస్తారు కనుక మీ సమస్యలు వీలైనన్నీఅర్హత వున్నవారికందరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది.
2) జగనన్న సురక్ష లో 11 సర్వేసులు,వాటికీ కావలసిన డాకుమెంట్స్ ఏమిటి ?
ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకుని ఉచితంగా మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ యొక్క సపోర్టింగ్ డాకుమెంట్స్ ని DOWNLOAD చేసుకోగలరు.
RELATED LINKS
CONCLUSION
ఈ పేజీ లో చెప్పిన ప్రతి అక్షరం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అవకాశాలను ప్రజలకు అర్ధమయేటట్టు చెప్పడం కోసమే వ్రాస్తున్నాను.కనుక ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకుని అర్హత వున్న వారు తప్పక లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాను.ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అయ్యి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.
0 Comments