Quick and Easy PAN Card Status Check -2023
ముఖ్యంశాలు
1)PAN Card Status ఇప్పడే ఎందుకు చెక్ చేసుకోవాలి?
2)మీ PAN CARD పనిచేస్తుందా..లేదా ఎలా తెలుసుకోవాలి?
3)PAN Card పని చేస్తుంటే ఈ విధంగా ఉంటుంది !
4)పాన్ కార్డు పని చేయకుంటే ఈ విధంగా చూపిస్తుంది !
INTRODUCTION
ఈ పేజీ లో మనం ఇప్పుడు PAN Card Status ని ఏ విధంగా మన మొబైల్ లోనే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.కావున పేజీ లో వివరాలను తప్పులు లేకుండా పూర్తిగా తెలుసుకుని ఇక్కడ చూపిన విధంగానే చెక్ చేసుకుంటే ప్రస్తుతం మీ PAN Card Active గా వుందా..లేదా In Active గా ఉందా అనే విషయాన్నీ తెలుసుకోవచ్చు.
PAN Card Status ఇప్పడే ఎందుకు చెక్ చేసుకోవాలి?
కేంద్ర ప్రభుత్వం ప్రతి PAN CARD కి ఆధార్ అనుసంధానం చేసుకోవాలి అనే నిబంధనలు జారీ చేస్తూ గతంలో 1 సంవత్సరం వరకు ఉచితంగా Online లోనే ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ తరువాత నుండి క్రమ పద్దతిలో 6 నెలల సమయం ఇచ్చి 500/-జరిమానా తో లింక్ చేసుకునే అవకాశం ఇచ్చారు.అయినా ఇంకా PAN Card కి Aadhar లింక్ చేసుకోని వారికి తరువాత మరో 6 నెలలు సమయం ఇచ్చి దీనికి 1000/- జరిమానాతో లింక్ చేయడానికి అంటే జూన్ 30,2023 వ తేదీ వరకు అవకాశం కల్పించారు.ఈ పొడిగింపు తేదీని ప్రకటన చేసినప్పుడు చెప్పిన ప్రధాన సమాచారం ఏమిటంటే Pan Card కి ఆధార్ లింక్ గడువు తేదీ లోపల చేసుకోకపోతే ఆ తరువాత మీ Pan card లు పాన్ చేయవు అని చెప్పడం జరిగిది.కనుక ప్రజలు ఎక్కువుగా ఇప్పుడు అడుగుతున్న సందేహం మా Pan card ఇప్పుడు పనిచేస్తుందా లేదా అని,కావున ఇప్పుడు ఈ విషయాన్ని గురించి విపులంగా చూద్దాం.
మీ PAN CARD పనిచేస్తుందా..లేదా ఎలా తెలుసుకోవాలి?
దీనికి సంబంధించి ఆఫీషియల్ గా వున్న Website Link ఈ క్రింద ఇవ్వడం జరిగింది.కావున మొదట అక్కడ CLICK చేసుకోగలరు.ఇక్కడ ఈ క్రింది వివరాలు ఇవ్వాల్సి వస్తుంది.అక్కడ ఇచ్చాక Continue అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- పాన్ కార్డు నెంబర్
- పాన్ కార్డులో ఉన్నట్లు పూర్తి పేరు
- పుట్టినతేదీ
- మొబైల్ నెంబర్
STEP 2: ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మొబైల్ నెంబర్ ఏదైననూ ఇవ్వవచ్చును.కనుక ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా పర్వాలేదు.
STEP 3: అన్ని వివరాలను సక్రమంగా ఇచ్చిన తరువాత మీ PAN CARD Active గా ఉందా లేదా Inactive గా వుందా అనే విషయాన్ని మనమే చెక్ చేసుకోవచ్చును.
PAN Card పని చేస్తుంటే ఈ విధంగా ఉంటుంది !
![]() |
పాన్ కార్డు ACTIVE అని చూపిస్తుంది కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అక్కడ ప్రత్యేకంగా NOTE అని "మీరు పాన్ కార్డునకు ఆధార్ లింక్ చేయనందున మీ యొక్క ఆర్ధిక లావాదేవీలన్నియు నిలిపివేయడమైనది అని స్పష్టంగా చెప్పి వున్నారు.
FAQs
1) PAN Card Status Check చేసుకోవడానికి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలా ?
జ) అవసరంలేదు.మీకుఇది అందుబాటులో ఉంటే దానిని ఎంటర్ చేసి కూడా తెలుసుకోవచ్చు.
2) PAN Card కి Aadhar Link అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి ?
జ) దీనికి సంబంధించి గతంలోనే మన వెబ్సైటు నందు తెలియపరచాను.కనుక దీనికి సంబంధించిన లింక్ అనేది Related Links లో ఇస్తాను.అక్కడ నుండి ఓపెన్ చేసుకుని తెలుసుకోగలరు.
0 Comments